ఐ బొమ్మ రవికి... 12 రోజుల కస్టడీ
Publish Date:Dec 16, 2025
Advertisement
ఐ బొమ్మ రవి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి ఐ బొమ్మ రవిని12 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఇప్పటికే రవిని రెండు దఫాలుగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపిస్తూ కీలక సమాచారాన్ని రాబట్టారు. ఒకవైపు రవి పై నమోదైన నాలుగు కేసుల విషయంలో కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగాయి. రవికి బెయిల్ ఇవ్వకూడదని అతనిపై నమోదైన నాలుగు కేసుల్లో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకా శాలు ఉన్నాయని కస్టడీ కి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. ఈ మేరకు నాంపల్లికోర్టు విచారణ జరిపి ఐ బొమ్మ రవిని మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీ కి అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది.. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఈనెల 18వ తేదీ నుండి ఐ బొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. హాయ్ బొమ్మ వెబ్సైట్ నిర్వహణ పైరసీ ఆరోపణలు ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టనున్నట్లు గా సమాచారం ... ఏది ఏమైనప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు మరో పన్నెండు రోజులు రవిని కస్టడీలోకి తీసుకొని కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు...
http://www.teluguone.com/news/content/ibomma-ravi-36-211113.html





