క్యూ నెట్ మోసాలు మళ్లీ షురూ!?

Publish Date:Mar 23, 2026

Advertisement

గత కొంతకాలంగా తెరమరుగైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూ నెట్  మళ్లీ చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నది.  దీంతో క్యూనెట్ మోసాలు మళ్లీ షురూ చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం క్యూనెల్ మోసాలపై మళ్లీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 తాజాగా నమోదైన కేసులతో ఈ వ్యవహారం మళ్లీ  వెలుగులోకి వచ్చింది. దీంతో క్యూనెట్ వ్యవహారాన్ని సీరియనస్ గా పరిగణనలోనికి తీసుకున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు రంగంలోకి దిగి  ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. 

హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సీసీఎస్ పోలీ సులు సమన్వయంతో మూడు రాష్ట్రాల్లో ఏకకాలం లో భారీ ఆపరేషన్ చేపట్టారు.  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 25 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం నగరాల్లో క్యూ నెట్‌కు అనుబంధంగా నడుస్తున్న కార్యాలయాలు, ట్రైనింగ్ సెంటర్లు,  నివాస గృహాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోమవారం (మార్చి 23)  తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో  ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ డేటా, ఆర్థిక లావాదేవీ లకు సంబంధించిన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి, కొత్త సభ్యు లను చేర్చుకునే  వారికి ఇన్ సెంటివ్ లంటూ పెద్ద ఎత్తున  పాల్పడుతు న్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడిందని పోలీసు వర్గాల సమాచారం.  

ఇప్పటివరకు  సుమారు 20 మంది నిందితులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో కొందరు కీలక నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తు న్నారు. మరికొందరిపై నిఘా ఉంచి, వారి కదలికలను గమనిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  

ఇటీవల క్యూ నెట్ మోసాలకు సంబంధించిన రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో  పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.  ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్‌లో క్యూనెట్ పై ఆరు కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంస్థ దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.  జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విదేశీ టూర్లు, అధిక లాభాల వాగ్దానాలు, విలాసవంత మైన జీవితం ఎరగా చూపుతూ ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది.  

By
en-us Political News

  
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత, సామాజిక సంబంధాల చుట్టూ కూడా నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.
స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బంతిని ఆపే క్ర‌మంలో 15 ఏళ్ల వైభ‌వ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.
కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి.
అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.