పుంగనూరు పుడింగి ఆటకట్టు.. పెద్దిరెడ్డి భూదందాలపై ప్రజాదర్బార్

Publish Date:Aug 6, 2024

Advertisement

అధికారం అండతో మంచి , చెడు, ఉచ్ఛం, నీచం అని లేకుండా   తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి  పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.  పెద్దిరెడ్డి పాపాల  పుట్టలు అన్నీ పగులుతున్నాయి.   వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద‌ మొత్తంలో దోపిడీకి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పెద్దిరెడ్డి దోపిడీలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

పుంగనూరు పుడింగి అక్రమాల నిగ్గు తేల్చడానికి తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ  మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి భూదందాల నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెడుతోంది. జగన్ సర్కార్ అధికారంలో  ఉన్న ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, దాడులే కాకుండా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో  పెద్ది రెడ్డి భూదందాలపై జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. 
వాస్తవానికి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు వీలులేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనం ఆయనను ఛీ కొడుతున్నారు. పెద్ది రెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల అరాచకాలపై ప్రజాగ్రహం ప్రజ్వరిల్లుతోంది.

ఈ నేపథ్యంలోనే మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో భూముల రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే మదనపల్లి సబ్  కలెక్టరేట్ లో జరిగింది అగ్ని ప్రమాదం కాదనీ, ఉద్దేశ పూర్వ కంగా రికార్డులను దగ్ధం చేశారన్న ఆరోపణలతో తెలుగుదేశం కూటమి సర్కార్ విచారణకు ఆదేశిం చింది. ఆ విచారణలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లను ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారని తేలింది. ఇలా ఉండగా  పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల భూ దందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఫిర్యాదులపై విచారణకు తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తమౌతోంది.  

పెద్ది రెడ్డి భూదందాల అంశంపై పుంగనూరులో ప్రజాదర్బార్  నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది.  మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రజాదర్బార్రా ద్వారా పెద్దిరెడ్డి అక్రమాలను వెలుగులోనికి తీసుకువస్తున్నారు. ఈ ప్రజాదర్బార్ లో పెద్దిరెడ్డి అక్రమాలు, భూ కబ్జాలు, దందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.    ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పుంగనూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొంటున్నారు.

మరో వైపు  మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా సాగుతోంది. తన భూదందాలు, కబ్జాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పెద్దిరెడ్డే  ఈ అగ్ని ప్రమాదం నాటకానికి తెరలేపారనీ, ఫైళ్ల దగ్ధంలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.  స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా  దీనిపై విచారణాధికారిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే మదనపల్లె డివిజన్ లోని 11 మండలాల తహశీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ విచారణకు అదనంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాదర్భార్  ద్వారా పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది.  దీంతో పుంగనూరు పుడింగి అటకట్టైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎందుకంటే రికార్డుల ద‌గ్దం కేసులో అన్నివేళ్లూ పెద్దిరెడ్డి వైపే చూపుతుండ‌టంతో పెద్దిరెడ్డికి ఉచ్చుబిగుసుకోవ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మరో వైపు  హైకోర్టులో ఎన్నిక‌ల అఫిడ‌విట్ పై విచార‌ణ‌ సాగుతోంది. ఇంకో వైపు ప్రజాదర్బార్ లలో పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ. మొత్తం మీద పెద్దిరెడ్డి ఆటకట్టినట్లేననీ ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు  ప్ర‌మాదంలో పడిందని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

By
en-us Political News

  
ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు.
జైలు నుంచి విడుదల అయిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు వారి విధులు వారు నిర్వహించారన్నారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించలేదన్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన జైల్లో భోజనం ఏ మాత్రం బాలేదని చెప్పారు.
ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వర్తించే ఈ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ ముస్లింలకు ఈ కోటా ఇకపై ఉండదని స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివిధ తేదీలలో ఖాళా అవుతాయి. అలా ఖాళీ అయ్యే స్థానాలలో తెలంగాణ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీల స్థానాలు కూడా ఉన్నాయి.
నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.
పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకూ, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఏప్రాల్ లో ఎన్నికలు జరగున్నాయనీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చిలో విడుదల చేయనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ కుమార్తె, జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పిటిన్ ను విచారించిన గుంటూరు కోర్టు.. అంబటిని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా పరిగణించి, మాజీ మంత్రికి చట్ట ప్రకారం కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది.
బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో తమకే సంఖ్యా బలం అధికంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, నెల్లూరు మేయర్ పదవికి దేవరకొండ శ్రీలతని తెలుగుదేశం ఎంపిక‌ చేసిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.