పులివెందులలో వైసీపీ అరాచకాలకు అడ్డకట్ట పడుతోందా?
Publish Date:Nov 30, 2024
Advertisement
రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పులివెందులలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని ఇప్పటి వరకూ అందరూ చెబుతున్న మాట. పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోట. వైఎస్ మరణం తరువాత కుటుంబంలో విభేదాలు తలెత్తినప్పటికీ, అక్కడ జగన్ అధిపత్యం ఇసుమంతైనా తగ్గలేదు. పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగానికి తోడు జగన్ రెడ్డి రాజ్యాంగం కూడా జమిలిగా అమలు అవుతోంది. అక్కడ వైసీపీగూండా రాజ్యం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందరి నోటా అదే మాట. అయితే ఏపీలో తెలుగుదేశం కూటమి అధకార పగ్గాలు చేపట్టిన ఐదు నెలల తరువాత పరిస్ధితిలో క్రమంగా మార్పు వస్తున్నది. వైసీపీ గూండాల ఆటకట్టించేందుకు పోలీసులు నడుంబిగించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రారవీందర్ రెడ్డిని పులివెందుల గడ్డమీదే అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాజాగా వైసీపీ నేతలు దౌర్జన్యంగా మూడేళ్ల నుంచి సాగిస్తున్న కార్ల దందాకు చెక్ పెట్టారు. విషయమేంటంటే.. తెలంగాణ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి నుంచి పులివెందులకు చెందిన వైసీసీ నేతలు అద్దె కోసం అంటూ తీసుకువెళ్లారు. మూడేళ్ల నుంచీ అటు అద్దె చెల్లించకుండా, ఇటు కార్లు ఇవ్వకుండా వేధిస్తూ వస్తున్నారు. ఇదేంటని అడిగిన సతీష్ కుమార్ పై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. ఈ విషయమై మూడేళ్ల కిందటే తెలంగాణ పోలీసులకు సతీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే జగన్, రాజారెడ్డిల రాజ్యం అమలౌతున్న కాలం అది. పోలీసులు చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో మూడేళ్ల నాటి కేసు ఫైలు బూజు దులిపిన తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని పులివెందులలో అడుగుపెట్టి వైసీపీ గూండాల చెర నుంచి సతీష్ రెడ్డి కార్లను విడిపించి అతనికి అప్పగించారు. అసలేంజరిగిందంటే.. మూడేళ్ల కిందట మెడికల్ కాలేజీ కోసం అంటూ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ కు చెందిన ఆరు కార్లను వైసీపీ నేతలు రెంటల్ కాంట్రాక్ట్ పై తీసుకువెళ్లారు. ఆ తరువాత అలా కార్లు తీసుకువెళ్లిన వారి ఆచూకీ సతీష్ కుమార్ కు దొరకలేదు. దీంతో జీపీఎస్ ట్రాక్ ద్వారా ఆ కార్లు పులివెందులకు చెందిన నేతల చేత్లుల్లో వేంపల్లెలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సతీష్ కుమార్ వేంపల్లో వెళ్లి కార్లు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో వారు అతనిని ఇడుపుల పాయలో బంధించి భౌతిక దాడికి పాల్పడ్డారు. దీనిపై సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పట్టించుకోని పోలీసులు ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కదిలారు. కడప పోలీసుల సహాయంతో తెలంగాణ పోలీసులు నాలుగు రోజుల పాటు పులివెందుల, వేంపల్లెలో గాలించి కార్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని సతీష్ కుమార్ కు అప్పగించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/police-check-to-ycp-atrocities-39-189239.html





