పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం వెనుక ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ త్యాగం, కృషి, పట్టుదల ఉన్నాయనడంలో ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. పైగా పిఠాపురంలో తన విజయానికి సర్వశక్తులూ ఒడ్డి శ్రమించిన వర్మను విజయం తరువాత స్వయంగా పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వర్మ త్యాగాన్ని, కృషిని గుర్తించారు. సరైన న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.
నిజమే గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు, ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించి గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే పని చేస్తూ వస్తున్న వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన అభిమానులైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మను ఉండవల్లి పిలిపించుకుని మాట్లాడారు. కూటమి అవసరాలు వివరించారు. సమన్వయంతో పని చేసి పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడమని ఆదేశించారు.
దీంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలా వర్మ ఆ క్షణం నుంచీ పవన్ కల్యాణ్ విజయమే లక్ష్యంగా పని చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ కూడా వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ అయితే వర్మకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. జనసేన మద్దతు దారులతో వర్మకు గ్యాప్ ఏర్పడింది. తన నాయకుడి ఘన విజయం క్రెడిట్ లో కొంతైనా వర్మకు ఇచ్చుందుకు ఇష్టం లేకపోవడమో మరో కారణమో తెలియదు కానీ నియోజకవర్గంలో వర్మను క్రమంగా దూరం పెట్టడం మొదలైంది. అంతే కాకుండా నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకులైన వైసీపీ వారిని జనసేనలో చేర్చుకున్నారు. ఇది సహజంగానే వర్మకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వర్మ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు వర్మకు ప్రధాన్యమున్న పోస్టులోకి తీసుకుం టానని హామీ ఇచ్చినట్లు చెబుతారు. ఇప్పుడు చంద్రబాబుతో వర్మ భేటీ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటువంటి తరుణంలో వర్మ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pithapuram-verma-meets-cbn-39-192460.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.