Publish Date:Mar 25, 2025
అత్యంత హేయంగా, నీచంగా, ద్వేష భావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రరెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు.
Publish Date:Mar 25, 2025
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా .. మమతా బెనర్జీ.. మమతా బెనర్జీనే. ఆమె మారరు.ఆమె వేషం అసలే మారదు. అదే ముతక చీర, అవే స్లిప్పర్స్. అదే నడక, అదే పరుగు. సహజంగా రాజకీయ నాయకులనే కాదు, మాములు మనమే అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు, వేషం మార్చేస్తాం. సూటూబూటులోకి మారిపోతాం.నిజానికి విదేశాలకే వెళ్ళ నక్కర లేదు, పెళ్ళికో పేరంటానికో వెళ్ళినా అంతే. సందర్భాన్ని బట్టి డ్రెస్ కోడ్ మారి పోతుంది.
Publish Date:Mar 25, 2025
బోరుగడ్డ అనీల్ కుమార్ సమాజానికి ప్రమాదకరం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలు, బూతులు తెలిసిందే. వారిరువురినే కాకుండా వారి ఇళ్లలోని మహిళలను కూడా కించపరిచేలా బోరుగడ్డ అనీల్ కుమార్ వ్యఖ్యలు చేశారు.
Publish Date:Mar 25, 2025
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. నలుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు కొత్త మంత్రులతో నాలుగు బెర్తుల భర్తీకి నిర్ణయం జరిగింది. అయితే ఈ నలుగురిలో రాములమ్మ పేరు లేదు. అనూహ్యంగా ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న రాములమ్మకు మంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాజా ప్రోబబుల్స్ లో ఆమె పేరు లేదు. బహుశా ఆర్ఏసీలో ఆమెకు బెర్త్ ఇస్తారో, లేక మిగిలిన రెండు ఖాళీల భర్తీ సమయంలో అవకాశం కల్పిస్తారో తెలియదు కానీ ఇప్పటికైతే రాములమ్మకు క్యాబినెట్ బెర్త్ లేనట్లే అంటున్నారు.
Publish Date:Mar 25, 2025
భద్రాద్రి రాముడి కల్యాణంలో అతి పవిత్రంగా భావించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది.
Publish Date:Mar 25, 2025
లోకసభ, రాజ్యసభ సభ్యుల జీతాల భృత్యాలు పెరిగాయి. వాస్తవానికి వీరి జీతాలు రెండేళ్ల కిందటే పెరగాల్సి ఉంది. అయితే జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పెంరిగింది. పెరగడమే కాదు.. ఈ పెంపు 2023 నుంచి అమలులోకి వస్తుంది. రెండేళ్ల అరియర్స్ కూడా ఎంపీలు అందుకుంటారు. గతంలో ఎంపీలకు లక్ష రూపాయల వేతనం అందుకునే వారు.
Publish Date:Mar 25, 2025
చట్టం ముందు అంతా సమానమే, కానీ కొందరు కొంచెం ఎక్కువ సమానం. ఇది ఎప్పటినుంచో జనం అంటున్న మాట. అనుకుంటున్న మాట. అవును రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో చట్టం ముందు అంతా సమానం,.కానీ, రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు, వ్యవస్థల దృష్టిలో కాదు.
Publish Date:Mar 25, 2025
రోళ్లు పగిలే ఎండలు మార్చిలోనే జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా మే 2, 3 వారాలలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. అటువంటిది ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
Publish Date:Mar 25, 2025
పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలు భారీగా పెరిగాయి. ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజా పెంపుదల మేరకు ఏంపీలకు వేతనం 1.24 లక్షలు , రోజువారీ భత్యం రూ.2500 వరకూ పెరుగుతాయి.
Publish Date:Mar 25, 2025
వేలాది మంది జీవితాలలో చీకటి నింపుతున్న బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైనే కాకుండా వాటిని ప్రమోట్ చేస్తున్న సెలిబ్రిటీలపై కూడా వరుసగా కేసులు నమోదు చేస్తున్నది.
Publish Date:Mar 25, 2025
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Publish Date:Mar 25, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏజీజీహెచ్ వరకూ సాగింది.
Publish Date:Mar 24, 2025
హైద్రాబాద్ చంపాపేటలో అడ్వేకేట్ ఇజ్రాయిల్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇజ్రాయిల్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉన్న మహిళపై ఎలక్ట్రిషన్ దస్తగిరి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.