LATEST NEWS
  హైదరాబాద్‌ సిటీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో గంట పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టుప్రాంతాల్లో వరదనీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకం చూశారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, రాయదుర్గం, హైటెక్‌ సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనాలు ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ కారణంగా నానా తిప్పలు పడ్డారు.  జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, షేక్ పేట్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. బంజారాహిల్స్ లో భారీ వర్షం కురవడంతో దేవరకొండబస్తీ లో సంతలో కూరగాయలు, వాహనాలు కొట్టుకుపోయాయి. మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా కొండాపూర్, హైటెక్స్, కొత్తగూడ నుంచి కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్ కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. సైబర్టవర్స్ నుంచి నీరూస్ జంక్షన్ వరకు నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్లో వెళ్లే వెహికల్స్కు రోడ్డు బ్లాక్ అయింది. ఇనార్బిట్ మాల్నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్‌తో ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్, గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్ వైపు వెళ్లే వాటితో ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.  బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర అయితే ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం‌.. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, జలమండలి (హైడ్రా) అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లోని ఈ ఫోన్ నెంబర్ 040 2302813 / 7416687878 కి కాల్ చేయాలన్న ప్రజలకు జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అలాగే అధికారులందరూ అందుబాటులో ఉంటూ.. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే రెవిన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షాలు, వరదల వల్ల ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే, వాటిని ఎదుర్కొనేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన గట్టిగా సూచించారు. గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద అత్యధిక వర్షపాతం నమోదైంది. 123.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది. ఆ తర్వాత శ్రీనగర్‌ కాలనీలో 111.3 మి.మీ, ఖైరతాబాద్‌లోని సెస్‌ వద్ద 108.5 మి.మీ, యూసఫ్‌గూడ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం సమీపంలో 104.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
  ఏపీలో  ట్రైబల్ శాఖలో  ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) అబ్బవరపు శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్‌సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు.అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం నాడు శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.  
  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  అపాయింట్‌మెంట్‌ రాకుండా ప్రధాన మంత్రి మోదీ, హొం శాఖ మంత్రి అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు.  రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ధర్నాలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పాల్గొనలేదని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  బీజేపీ, బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇందుకోసం హైదరాబాద్ లో పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా విధానం అని పార్టీ పరంగా ఇవ్వాలా, మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామన్నారు.  హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులో వాదన వినిపిస్తామన్నారు. బిల్లులు, ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించకుంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పీఏసీ సమావేశంలో చర్చిస్తామన్నారు. నిన్నటి ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే రాలేదన్న వాదన అర్థరహితం అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అనుమానాలు ఉంటే అధికారిక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు అవగాహన కల్పిస్తామన్నారు. అన్ని కులాల వివరాలు సేకరించి కులగణన చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు  
  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరాన్నికి క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని  వాతవరణ నిపుణులు చెబుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, మాదపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం దంచికొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.  దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులంతా ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని ఐఎండీ వెల్లడించింది.
  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్‌, మణికొండ, హైటెక్‌ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా వెల్లడించింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.. రోడ్ల‌న్నీ జ‌లమ‌యం కావ‌డంతో.. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ప‌లు కాల‌నీల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. ఈ ప‌రిస్థితుల దృష్ట్యా ఎమ‌ర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల  కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించారు.
ALSO ON TELUGUONE N E W S
  ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కార్మిక సంఘాలు వర్సెస్ నిర్మాతలు అన్నట్టుగా పరిస్థితి ఉంది. సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే నిర్మాతలు మాత్రం అంత మొత్తం పెంచడానికి సిద్ధంగా లేరు. ఈ విషయంపై కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. బయట వర్కర్స్ తో షూటింగ్ చేయడానికి కొందరు సిద్ధపడటం, దీంతో యూనియన్లు గొడవ చేయడం వంటివి జరిగాయి. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. లోకల్ టాలెంట్‌ను తక్కువగా చేస్తూ విమర్శలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన విశ్వప్రసాద్.. తన విమర్శలు వ్యవస్థపై మాత్రమేనని, ప్రతిభపై కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.   "హైదరాబాద్‌లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సుమారు 60% నుండి 70% వరకు పని చేసే బృందం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. గతంలో 10% ఉన్న స్కిల్‌ గ్యాప్‌ ఇప్పుడు 40% దాకా పెరగడం కేవలం ప్రతిభ ఒక్కటే లేకపోవడం కాదు. అసలు కారణం కొత్త టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పరిశ్రమలోకి రానివ్వకుండా రూ.5-7 లక్షల వరకు అక్రమంగా డిమాండ్‌ చేసే గ్రూపుల వల్ల. నిజమైన టాలెంట్‌, స్కిల్‌ ఉన్న వాళ్లకు ఇది ప్రధానమైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇప్పటికే మేజార్టీ టీం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. మిగిలిన గ్యాప్‌ కూడా ఇక్కడి ప్రతిభతోనే నింపాలి. నేను హైదరాబాద్‌ టాలెంట్‌ను తక్కువగా అంచనా వేస్తున్నానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు. హైదరాబాద్‌లో టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తెలుగు సినిమాకు ఎప్పట్నుంచో అండగా ఉన్నారు. వాళ్లను అడ్డుకునే వ్యవస్థల్ని తొలగించాలి.. మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.. స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించాలి... వడ్డీల కోసమే ఉండే గ్రూపులను అడ్డుకోవడం మన బాధ్యత. ఇదే మన పరిశ్రమ భవిష్యత్తుకు అవసరం." అని విశ్వప్రసాద్ తెలిపారు.    
  పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటనకు దూరమవుతారని కొంతకాలంగా వినిపిస్తోంది. పవన్ సైతం తనకు నటించడానికి సమయం కుదరకపోవచ్చని, నిర్మాతగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. అదే జరిగితే ఇక పవన్ నటనకు దూరమైనట్టే.   ఇటీవల 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 'ఓజీ' షూటింగ్ పూర్తయింది. ఇది సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.   'ఉస్తాద్ భగత్ సింగ్'కి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో వారం రోజులు కేటాయిస్తే చాలు.. ఆయన భాగం షూటింగ్ పూర్తవుతుందట. మొత్తం సినిమా షూటింగ్ పూర్తి కావడానికి మాత్రం మూడు వారాలు పట్టే అవకాశముంది.   నటుడిగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు కమిట్ అవ్వకపోతే.. 'ఉస్తాద్ భగత్ సింగ్' చివరి చిత్రం అవుతుంది. అదే జరిగితే.. కేవలం వారం రోజులు మాత్రమే ఆయన సెట్ లో నటుడిగా సందడి చేయనున్నారు.    పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సినిమాలు కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోసమైనా భవిష్యత్ లో పవన్ సినిమాలు చేస్తారేమో చూడాలి.  
Cast: Aadhi Pinisetty, Chaitanya Rao Madadi, Sai Kumar, Divya Dutta, Tanya Ravichandran, Ravindra Vijay, Shatru Crew: Created by Deva Katta Music Director : Shakthikanth Karthick Cinematographers  : Suresh Ragutu, Gnana Shekar V. S. Editor : Praveen K. L. Directors : Deva Katta, Kiran Jay Kumar Producers : Vijay Krishna, Lingamaneni, Sree Harsha Streaming on OTT Platform: Sony LIV Release Date: 7th August 2025  No: of Episodes: 09 Mayasabha is the new web series from creative writer and director Deva Katta, who dares to touch political subjects in Telugu Cinema. The series is based on fictionalised lives of Nara Chandra Babu Naidu and YS Rajasekhar Reddy. It deals with their rise and explores fictionalised NTR's entry into AP politics as well. So, with such controversial history of AP Politics, let's see what Deva Katta is serving us in this series.  Plot:  Kakarla Krishnama Naidu (Aadhi Pinisetty) and MS Rami Reddy (Chaitanya Rao) hail from same area of Andhra Pradesh and they start their political journey almost simultaneously. They become friends as they join same political party and grow together as influential young leaders. KKN becomes son-in-law of RCR (Sai Kumar), famous actor and slowly, RCR's decisions about politics start affecting both of their lives. What happens to their lives due to this political change in the state? Watch the series, to know more.  Analysis:  Aadhi Pinisetty delivered his best upon the instructions of the director. You see him being balanced in his portrayal and not mocking the real leader to maintain the character. It feels welcoming to watch such a matured portrayal. Chaitanya Rao also doesn't fall into the traps of confiding to mockery and he does a good job in bringing a complex character to life. Sai Kumar impresses us yet again with his maturity to imitate and not completely fall into buffoonery or mockery in his portrayal. All others look good and delivery their best. More than the performances it is writing this series based on such popular leaders that aks for great maturity. Deva Katta tries to balance his prowess as a writer to his directorial ambition and ability. He wants to be very clear in his approach to maintain the sincerity of his core idea while also exploring the reasons behind the real-life actions in his fictional world.  His act of balancing needed more maturity and impressive tactical flair. He did showcase his tendency to over tell certain things and over drive certain points home with too much information. There is a certain level of fear in not touching the wrong side of any leader, too. Still, it is engaging to watch and the drama is gripping enough to ask our attention.  Certain episodes do feel like they have been dragged too much while some does do a good job in humanising these idols. Production values, music and performances are the major positives of this series. But certain elements in writing do feel a little bit too convenient and confusing at places. Overall, we can say that the series is a watchable drama with such a controversial content without taking sides.    Bottomline: An Engaging Political drama with ebbs and flaws.    Rating: 3/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. 
దర్శకులకి స్టార్ డమ్ తెచ్చిన వాళ్ళల్లో 'రవిరాజా పినిశెట్టి'(RaviRaja pinisetty)కూడా ఒకరు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తన సినీ జర్నీలో మెజారిటీ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి విజయాన్ని అందుకున్నాయి. యముడికి మొగుడు, జ్వాల, దొంగపెళ్లి, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, బలరామకృష్ణులు, యం ధర్మరాజు ఎంఏ, పెదరాయుడు, మా అన్నయ్య,  వీడే ఇలా సుమారు నలభై చిత్రాల వరకు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. రీసెంట్ గా రవిరాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు మా పెద్ద అబ్బాయి సత్య ప్రభాస్(Sathya Prabhas)దర్శకుడు కావాలని అనుకుంటున్నానని చెప్తే, రామ్ గోపాల్ వర్మ(Ram Gopal varma)దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ చెయ్యడానికి పంపించాను. . అదే నా తప్పయ్యింది. వర్మ మా వాడితో ఎవరి దగ్గరో చెయ్యడం ఎందుకు, దర్శకత్వం అనేది ఎవరి దగ్గరో  నేర్చుకొని చేసేది కాదు, సినిమాలు బాగా చూడు, మీ నాన్న దర్శకుడు, నీకు అనిపించిన కథతో సినిమా చేసెయ్యి. అంతే కానీ ఒకరి దగ్గర వర్క్ చేసి టైం వేస్ట్ చేసుకోకని బ్రెయిన్ మొత్తం వాష్ చేసి పంపించేసాడని రవిరాజా చెప్పుకొచ్చాడు సత్య ప్రభాస్ తన మొదటి మూవీగా 'మలుపు'(Malupu)అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన మలుపు 2015 లో తెలుగుతో పాటు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. నలుగురు స్నేహితుల కథతో అనుక్షణం ఎంతో ఉత్కంఠభరితంగా సాగగా, ఆది పినిశెట్టి(Aadhi pinisetty),నిక్కీ గల్రాని జంటగా చేసారు. బాలీవుడ్ లెజండ్రీ  యాక్టర్ 'మిథున్ చక్రవర్తి' కీలక పాత్రలో కనిపించగా రవిరాజా నే నిర్మాతగా వ్యవహరించాడు. ఆది పినిశెట్టి రవిరాజా రెండో కుమారుడు.    
సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో నిర్మాతలు కూడా ఓటీటీలపై ఎక్కువ ఆధారపడుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఓటీటీ సంస్థలు నిర్మాతలపై ఆధిపత్యం చలాయిస్తున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్‌ డేట్‌లను కూడా ఓటీటీలే డిసైడ్‌ చేస్తున్నాయి. సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ రైట్స్‌ అగ్రిమెంట్స్‌ జరిగిపోతుండడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో నిర్మాతలు కూడా ఓటీటీ చెప్పిన కండిషన్స్‌కి తలొగ్గక తప్పడం లేదు. కానీ, ఇప్పుడు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న ‘మహావతార్‌ నరసింహ’ ఓటీటీ సంస్థలకు పెద్ద షాక్‌ ఇచ్చింది.  హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న సినిమాలను ముందే బుక్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు ఉత్సాహం చూపిస్తుంటాయి. మహావతార్‌ నరసింహ చిత్రం ఓటీటీ డీల్‌ జరగకముందే రిలీజ్‌ అయింది. ఎవరూ ఊహించని కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ఈ సినిమా కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఫైనల్‌గా జియో హాట్‌స్టార్‌ ఓటీటీ హక్కులు దక్కించుకుందని, నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‌ కూడా జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. బయట జరుగుతున్న ఈ ప్రచారానికి మహావతార్‌ నరసింహ టీమ్‌ చెక్‌ పెట్టింది. థియేటర్లలో అద్భుతంగా రన్‌ అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ఓటీటీ హక్కులు ఇచ్చే ఆలోచన లేదని చిత్ర యూనిట్‌ తేల్చిచెప్పింది. థియేటర్‌లో రన్‌ని బట్టి తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తామని వారు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ ఏ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి. 
  ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా పలు భారీ మల్టీస్టారర్ లు వస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకున్న 'వార్-2' ఈ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'రామాయణ'లో రణబీర్ కపూర్, యశ్ కలిసి నటిస్తున్నారు. త్వరలో అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో కూడా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశముందని తెలుస్తోంది.   'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన హోంబలే ఫిలిమ్స్.. అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను రంగంలోకి దింపాలని చూస్తోందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.   ప్రస్తుతం అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, ప్రశాంత్ నీల్ ముగ్గురూ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అట్లీతో బన్నీ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. షారుఖ్ చేతిలో 'కింగ్' మూవీ ఉంది. నీల్ కూడా ఎన్టీఆర్ తో 'డ్రాగన్' అనే భారీ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ల తర్వాత.. వీరి కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ కు హోంబలే ఫిలిమ్స్ శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.   ఈ మల్టీస్టారర్ సాధ్యమైతే మాత్రం.. కేవలం ప్రకటనతోనే సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక విడుదల తర్వాత ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని చెప్పవచ్చు.  
అశ్లీల దృశ్యాలు, మితిమీరిన హింస ఉన్నట్టయితే ఆ సినిమాకి ఎ సర్టిఫికెట్‌ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. తమ సినిమాకి ఎ సర్టిఫికెట్‌ వచ్చిందంటే దాన్ని పెద్ద అవమానంగా భావించే దర్శకనిర్మాతలు కూడా ఉన్నారు. ఎ సర్టిఫికెట్‌ యొక్క ప్రధాన ఉద్దేశం.. చిన్న పిల్లలు అలాంటి సినిమాలు చూడకూడదని. అయితే ఇప్పటివరకు దాన్ని సక్రమంగా థియేటర్స్‌ వారు అమలు చేయలేదు. ఇప్పుడు దాన్ని కఠినంగా అమలు చేసేందుకు థియేటర్‌ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఈ నిర్ణయం సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అభిమానులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. రజినీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘కూలీ’కి సెన్సార్‌ బోర్డ్‌ ఎ సర్టిఫికెట్‌ జారీ చేసింది. దీని ప్రకారం 18 సంవత్సరాలలోపు పిల్లల్ని ఈ సినిమాకి అనుమతించరు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా మల్టీపెక్సు సంస్థలు ప్రకటించాయి. వయసు నిర్థారణ లేకుండా థియేటర్‌లోకి ప్రవేశం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం రజినీకాంత్‌ ఫ్యాన్స్‌కి ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన సింగిల్‌ థియేటర్లకు కూడా వర్తిస్తుంది. కానీ, సింగిల్‌ థియేటర్స్‌ వారు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. దాంతో సినిమా చూసేందుకు అందర్నీ అనుమతిస్తారు. రజినీకాంత్‌కి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అభిమానులు ఉన్నారు. తమ పిల్లల్ని రజినీ సినిమాకి అనుమతించకపోతే ఎలా అని తల్లిదండ్రులు టెన్షన్‌ పడుతున్నారు.  ఆగస్ట్‌ 14న కూలీ చిత్రంతోపాటు వార్‌2 కూడా రిలీజ్‌ అవుతోంది. మల్టీప్టెక్సులు పెట్టిన నిబంధన వల్ల వార్‌2కి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలో కూడా వయొలెన్స్‌ ఉంది. కానీ, ఈ సినిమాకి యుఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్‌ ఉన్న సినిమాలకు పెద్దవారి పర్యవేక్షణలో పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. మల్టీప్టెక్సులు పెట్టిన ఈ నిబంధనలు కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాదు, ఫుల్‌ రన్‌ రికార్డులు కూడా తారుమారవుతాయి. ఇంతకుముందు కూడా మల్టీప్లెక్సుల్లో ఈ నిబంధన ఉంది. కానీ, కూలీ చిత్రానికి మాత్రమే పిల్లల్ని తీసుకురావద్దంటూ ప్రత్యేకంగా ప్రకటించారు. దానికి కారణం.. ఈ విషయం ముందే చెప్పకపోతే థియేటర్స్‌కి పిల్లలతో సహా వచ్చేస్తారు. అప్పుడు వారిని వెనక్కి పంపడం కష్టంతో కూడుకున్న పని. అందుకని ముందే చెప్పేస్తే ఏ సమస్య ఉండదనేది మల్టీప్లెక్సు యాజమాన్యాల ఆలోచన. మరి ఈ విషయంలో అభిమానులు, పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)గత చిత్రం 'హరిహరవీరమల్లు'(HariHara Veeramallu)జులై 24 న విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిన వీరమల్లు ఆర్థికపరమైన ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సైతం వీరమల్లు ప్రమోషన్స్ లో  ప్రస్తావించడంతో పాటు, ఆర్ధిక పరమైన   విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత 'టిజి విశ్వప్రసాద్'(TG Vishwa Prasad)సాయం చేసారని కూడా పవన్ ప్రస్తావించడం జరిగింది. దీంతో పవన్ కొడుకు 'అకిరానందన్' ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వస్తుందనే విశ్వప్రసాద్ సాయం చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'విశ్వప్రసాద్' మాట్లాడుతు అకిరాని ఇంట్రడ్యూస్ చెయ్యాలనే ఆశ ప్రతి నిర్మాతకి ఉంటుంది. నాకు కూడా ఆ  అవకాశం రావాలని కోరుకోవడం సహజం. అంతే కానీ అకిరాని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం వస్తుందని వీరమల్లుకి నేను సాయం చెయ్యలేదు. ఆ సమయంలో ఏఎంరత్నం గారికి నా అవసరం ఉందనిపించి చేశాను. కాకపోతే ఎవరితో చెయ్యాలనే నిర్ణయాన్ని అకిరానే నిర్ణయించుకుంటాడు. నాకైతే చిరంజీవి, పవన్, అకిరా తో సినిమాలు నిర్మించాలని ఉందని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు. 2015 లో  w/ o ఆఫ్ రామ్ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన విశ్వ ప్రసాద్ అనతి కాలంలోనే వరుస చిత్రాలు నిర్మిస్తు అగ్ర నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas)తో 'ది రాజాసాబ్'(The Raja Saab), తేజ సజ్జ(Teja Sajja)తో 'మిరాయ్'(Mirai)వంటి భారీ చిత్రాలని నిర్మిస్తున్నాడు.  ఆ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటు విడుదలకి సిద్ధం కానున్నాయి. పవన్ కళ్యాణ్, విశ్వప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే 'బ్రో' మూవీ వచ్చిన విషయం తెలిసిందే.   
ప్రముఖ హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ 'శ్వేతామీనన్'(Swetha Menon)సినీ నేపధ్యం ఎంతో ఘనమైనది. మలయాళ సూపర్ స్టార్ 'మమ్ముట్టి' కి జోడిగా, 1991 లో వచ్చిన 'అనశ్వరం' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన శ్వేత, ఆ తర్వాత మలయాళ, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో కలుపుకొని ఇప్పటి వరకు సుమారు వంద సినిమాల వరకు చేసింది. వీటిల్లో హీరోయిన్ గా చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అవార్డుల పరంగా చూసుకుంటే  2009 ,2011 కి సంబంధించి మలయాళ రాష్ట్ర ప్రభుత్వం చేత బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని సొంతం చేసుకుంది. ఫిలిం ఫేర్, సైమా అవార్డ్స్ తో పాటు ఇతర అవార్డ్స్ ని  ఎన్నింటినో గెలుచుకున్న శ్వేత, మలయాళంలో తెరకెక్కిన అనేక సీరియల్స్, షోస్ ద్వారా కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. రీసెంట్ గా శ్వేతా మీనన్ పై మార్టిన్ అనే వ్యక్తి పోలీసులకి  ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా పోలీసులు పట్టించుకోవడం లేదని కోర్టుని ఆశ్రయించాడు. ఈ విషయంపై మార్టిన్ మాట్లాడుతు శ్వేతా మీనన్ అడల్ట్ చిత్రాల్లో నటిస్తు యువతని తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో కూడా ఆమె మీడియాతో మాట్లాడుతు, డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని చెప్పిందని మార్టిన్ తెలిపాడు. శ్వేతా మీనన్ శృంగార పరంగా చేసిన సినిమాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, 2011 లో వచ్చిన 'రతినిర్వేదం'(RathiNirvedam)మళయాళంతో పాటు ఇతర భాషల్లోను రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా రొమాన్స్ సన్నివేశాల్లో శ్వేతా మీనన్ నటన ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది. నేటికీ సదరు సన్నివేశాలు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని రాబడతాయి. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచిన శ్వేతా, తెలుగులో 'భానుచందర్' స్వీయ దర్శకత్వంలో 1995 లో  వచ్చిన  'దేశద్రోహులు'లోను హీరోయిన్ గా చేసింది.  
  తారాగణం: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, దివ్య దత్తా,  రవీంద్ర విజయ్, శత్రు తదితరులు దర్శకత్వం: దేవ కట్టా, కిరణ్ జై కుమార్ నిర్మాతలు: విజయ్ కృష్ణ, శ్రీ హర్ష ఓటీటీ: సోనీ లివ్ విడుదల తేదీ: ఆగస్టు 7, 2025   వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు పొందారు దేవ కట్టా. ఆయన క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ 'మయసభ'. ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'మయసభ'పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Mayasabha review)   కథ: చిత్తూరు జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కృష్ణమనాయుడు(ఆది పినిశెట్టి). ఉన్నత చదువులు చదవాలి, ప్రజా సేవ చేయాలనే గొప్ప ఆలోచనలతో ఉంటాడు. వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం, మనకెందుకు ఇవన్నీ అని కుటుంబ సభ్యులతో సహా అందరూ నిరుత్సాహ పరుస్తున్నా వినడు. మరోవైపు కడప జిల్లాలోని ఉన్నత కుటుంబానికి చెందిన రామిరెడ్డి(చైతన్య రావు) వైద్య విద్యను అభ్యసిస్తుంటాడు. అతని తండ్రిపై రౌడీ/ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర ఉంటుంది. రౌడీయిజం, రాజకీయానికి దూరంగా ఉండే రామిరెడ్డి.. ప్రజల్లో ఒకడిగా ఉంటూ, వైద్యుడిగా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటాడు. ఇలా వేరు వేరు ప్రాంతాలలో గొప్ప ఆలోచనలతో ఉన్న కృష్ణమనాయుడు, రామిరెడ్డి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం స్నేహంగా ఎలా మారింది? వీరి రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది? రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులుగా ఎలా మారారు? వంటి విషయాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: 'మయసభ' కల్పిత కథ అని మేకర్స్ చెప్పినప్పటికీ.. ఇది చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మధ్య స్నేహాన్ని, వారి రాజకీయ ప్రయాణాన్ని ఆధారంగా తీసుకొని రాసుకున్న కథ అని.. సిరీస్ చూసే ప్రతి ఒక్కరికీ అర్థమవుతూనే ఉంటుంది. అదే సమయంలో వారి పాత్రలను కల్పిత పాత్రలుగా మార్చడమే కాకుండా, వారి మధ్య కొన్ని కల్పిత సన్నివేశాలను కూడా అల్లారని అనిపిస్తుంది. సినిమా అయినా, సిరీస్ అయినా పొలిటికల్ డ్రామాను డీల్ చేయడం అంత తేలిక కాదు. ఎత్తులు పైఎత్తులతో ఉండే రాజకీయ చదరంగాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించడానికి ఎంతో వర్క్ చేయాలి. ఆ పరంగా దేవ కట్టా దిట్ట అని తన రెండో సినిమా 'ప్రస్థానం'తోనే రుజువైంది. ఇప్పుడు 'మయసభ' విషయంలోనూ ఆయన ప్రతిభ అడుగడుగునా కనిపించింది. 'మయసభ' సిరీస్ ను తొమ్మిది ఎపిసోడ్లుగా విడుదల చేశారు. మొదటి ఎపిసోడ్ లో కృష్ణమనాయుడు, రామిరెడ్డి పాత్రల తీరుని, వారి కుటుంబ నేపథ్యాలను చూపించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కృష్ణమనాయుడు పెద్ద పెద్ద ఆలోచనలతో ఉంటాడు. ఇక రామిరెడ్డి తన తండ్రిపై పడిన ఫ్యాక్షనిస్ట్ అనే ముద్రకు దూరంగా, ప్రజా వైద్యుడిగా స్థిరపడాలనే ఆలోచనతో ఉంటాడు. ఇద్దరి జీవితాలను సమాంతరంగా చూపిస్తూ.. ఇద్దరు ఎప్పుడు కలుస్తారనే ఆసక్తిని మొదటి ఎపిసోడ్ లోనే కలిగించడంలో 'మయసభ' టీం సక్సెస్ అయింది. రెండో ఎపిసోడ్ లో ఇద్దరి కాలేజ్ జీవితాలు చూపించారు. కృష్ణమనాయుడు స్టూడెంట్ లీడర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉంటే, రామిరెడ్డి మాత్రం తెలుగువారి ఆరాధ్య నటుడు RCR అభిమానిగా కర్ణాటకలో తెలుగోడి సత్తా చూపిస్తాడు. మూడో ఎపిసోడ్ లో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. రామిరెడ్డి తన బంధువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లాడతాడు. అయితే కృష్ణమనాయుడు విఫల ప్రేమ కథ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఒకమ్మాయిని ప్రేమించాడని, ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయింది అన్నట్టుగా చూపించారు. తండ్రి ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉండాలని రామిరెడ్డి నిర్ణయించుకోవడం, కృష్ణమనాయుడు ప్రేమ విఫమవ్వడం.. అలా ఇద్దరు అనుకోకుండా బస్సులో పరిచయం అవ్వడంతో మూడో ఎపిసోడ్ ముగుస్తుంది. అంటే ఈ ఇద్దరి మధ్య పరిచయం కోసం మూడు ఎపిసోడ్ల సమయం తీసుకున్నారు. నాలుగో ఎపిసోడ్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు.. ఈ క్రమంలో కృష్ణమనాయుడు, రామిరెడ్డి మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులుగా మారడం వంటి సన్నివేశాలు చూపించారు. అయితే ఈ ఎపిసోడ్ కాస్త నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే ఇద్దరి రాజకీయ ప్రయాణం మొదలైందో.. అప్పటి నుంచి సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. ఎమ్మెల్యే టికెట్లు సాధించడం, ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, మంత్రి పదవులు పొందటం.. ఇలా ఇద్దరు మిత్రులు రాజకీయ నాయకులుగా ఎదిగే క్రమం మెప్పిస్తుంది. అయితే చివరి రెండు ఎపిసోడ్ లు మళ్ళీ కాస్త నెమ్మదిగా సాగాయి. ఈ ఎపిసోడ్లకు నిడివి ప్రధాన సమస్యగా మారింది. వీటిలో ఎక్కువగా RCR రాజకీయం ప్రవేశం, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులను చూపించారు. RCR కి కృష్ణమనాయుడు అల్లుడు అవ్వడం, ఆ తర్వాత ఆయనకే ఎదురుతిరగడం, మరోవైపు ప్రతిపక్ష నేతగా రామిరెడ్డి ఎదగటం వంటి సన్నివేశాలు ఉంటాయి. సీఎంగా నాయుడు, ప్రతిపక్ష నేతగా రెడ్డి ఎదిగాక.. వీరి రాజకీయ పోరు ఎలా సాగింది అనేది మాత్రం నెక్స్ట్ సీజన్ లో చూడాలి. 'మయసభ'లో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. ఇద్దరి మిత్రుల ప్రయాణం అని చెప్పినప్పటికీ.. ఆ సమయంలో రాజకీయ పరిస్థితులను అన్నింటినీ చూపించే ప్రయత్నం చేశారు. విజయవాడ గొడవలు, అనంతపురం కొట్లాటలు, ఎమర్జెన్సీ ఇలా ఎన్నో ప్రస్తావించారు. వీటి వల్ల నిడివి పెరిగింది తప్ప.. సిరీస్ కి అదనపు బలం చేకూరలేదు. పైగా వంగవీటి, రక్తచరిత్ర, ఎమర్జెన్సీ సినిమాలు చూసిన వారికి.. మళ్ళీ అవే సన్నివేశాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.  ఓవరాల్ గా అయితే 'మయసభ' సిరీస్ బాగుంది. కృష్ణమనాయుడు, రామిరెడ్డి పాత్రలను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా.. రెండు పాత్రలను సమానంగా మలిచిన తీరు బాగుంది. అయితే నిజ జీవిత పాత్రలకు అన్వయించి చూసుకుంటే మాత్రం.. కొంత వివాదం కూడా అయ్యే అవకాశముంది. రెడ్డి తండ్రిని రౌడీ, ఫ్యాక్షనిస్ట్ అన్నట్టుగా చూపించడమే కాకుండా.. ఇతర రెడ్డి కుటుంబాలు వారిని దూరంగా పెట్టేవి అన్నట్టుగా చూపించారు. ఇక కృష్ణమనాయుడుకి నత్తి ఉంది అన్నట్టుగా, దాని నుంచి బయటపడటానికి డాక్టర్ గా రెడ్డి హెల్ప్ చేసినట్లు చూపించారు. అలాగే కృష్ణమనాయుడు లవ్ స్టోరీ కూడా హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: కృష్ణమనాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయిన తీరు అమోఘం. ఇద్దరూ పోటాపోటీగా నటించి సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు. RCR పాత్రలో సాయి కుమార్ సర్ ప్రైజ్ చేశారు. బాబురావు అనే సీనియర్ నాయకుడి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఆకట్టుకున్నారు. అక్కడక్కడా వినోదాన్ని కూడా పంచారు. వీరు మాత్రమే కాదు.. అన్ని పాత్రలకు సంబంధించి నటీనటుల ఎంపిక చక్కగా కుదిరించింది. ఆయా పాత్రలకు అందరూ న్యాయం చేశారు. రామిరెడ్డి తండ్రి శివారెడ్డి పాత్రధారుడిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. 'మయసభ' సిరీస్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా ఆర్ట్, సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచాయి. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. సంగీతం పరవాలేదు. పాటలు తేలిపోయాయి కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ల నిడివిని కుదించే ప్రయత్నం చేయాల్సింది. సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి.   ప్లస్ పాయింట్స్: కథా నేపథ్యం దర్శకత్వం నాయుడు, రెడ్డి పాత్రలను మలిచిన తీరు నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్: కొన్ని ఎపిసోడ్ల నిడివి ఎమర్జెన్సీ వంటి ఇతర అంశాల ప్రస్తావన  సినిమాటిక్ లిబర్టీ   ఫైనల్ గా.. పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి 'మయసభ' సిరీస్ నచ్చుతుంది. కృష్ణమనాయుడు, రామిరెడ్డి పాత్రలను మలిచిన తీరు బాగుంది. వారి రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ.. తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ సిరీస్ లలో ఒకటిగా ఇది నిలిచే అవకాశముంది.   రేటింగ్: 3/5  - గంగసాని  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చేనేత చాలా గొప్ప కళ.. ఒక దారం కలుస్తుంది, ఆకారం తీసుకుంటుంది, మలుపులు తిరుగుతుంది, కొన్నిసార్లు విప్పుతుంది, విరిగిపోతుంది,  తరువాత మళ్ళీ కలుస్తుంది.  అంతా అయ్యాక ఒక అద్బుతం ఆవిష్కారం అవుతుంది.  అదే చేనేత అందం. జాతీయ చేనేత దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా కనిపించే విభిన్న స్వదేశీ వస్త్రాల గురించి,  చేనేత నైుణ్యం గురించి, భారతదేశానికి చేనేత తెచ్చిపెట్టిన ప్రత్యేక గుర్తింపు గురించి తెలుసుకుంటే.. పెళ్లి, పండుగ, శుభకార్యం.. ప్రత్యేక సందర్భం ఏదైనా పట్టు వస్త్రాలు కట్టుకోవాలి అనుకుంటారు. అయితే మిషన్ వస్త్ర పనితనానికంటే.. చేత పనితనం చాలా అద్బుతాలను ఆవిష్కరిస్తుంది.  ఇది వ్యక్తిలో సృజనాత్మకతను, కళను, పనితనాన్ని వెలికితీస్తుంది. నిజానికి చేనేత అనేది ఒక అద్బుతమైన కళ. కేవలం దారాలతో వస్త్రాలు నేయడం కాదు.. రంగులు,  డిజైన్లు ఇందులో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  చేనేత అనేది దేశం యావత్తు ఆవరించి ఉంది. పశ్చిమ భారతదేశంలో  గుజరాత్‌లోని దంగాసియా,  భార్వాడ్ కమ్యూనిటీలు తంగాలియా నేతను ఆచరిస్తారు. ఇది వార్ప్ దారాల చుట్టూ చుట్టబడిన అదనపు దారాలను ఉపయోగించి సృష్టించబడిన చుక్కల నమూనాలకు ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలో విదర్భ..  క్లిష్టమైన కార్వతి కినార్ నేత  చాలా ప్రత్యేక కలిగి ఉంది. నేత కళాకారిణి శ్రుతి సాంచెటికి ఈ కళను కాపాడుకుంటూ వస్తోంది. తాను ఈ చేనేత పనిని సంరక్షించడం తన బాధ్యత అనుకుంటోంది. "ఈ కళారూపం నాకు చాలా విలువైనది" అని ఆమె చెబుతుంది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ నుండి వచ్చిన ఇకత్-రంగు వేసిన, నూనెతో  చేయబడిన టెలియా రుమల్ ఫాబ్రిక్ ఎరుపు, నలుపు,  తెలుపు రేఖాగణిత,  పూల నమూనాలను కలిగి ఉంటుంది. ఇక ధర్మవరం పట్టు,  బనారస్,  కంచి,  ఉప్పాడ వంటివి వస్త్రాలలో చీరల స్థానాన్ని ఎప్పుడూ ఒక మెట్టు కాదు.. వంద మెట్లు పైన ఉంచుతున్నాయి. నిజానికి చీర అనే వస్త్రం కూడా తరతరాలుగా ఇట్లా నిలబడటానికి కారణం పట్టు వస్త్రాలు.. అందులోనూ సాంప్రదాయత, భారతీయతనం ఈ చీరలలో ఉట్టిపడటమే.. ఈ కారణంగానే ఎన్ని రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినా  చీరకు ఒక స్పెషల్ స్టేటస్ ఉండనే ఉంది. కేవలం చీరలు అనే కాదు.. పురుషుల వస్త్రాలు,  పిల్లల వస్త్రాలను సాంప్రదాయంగా ఉంచడంలో చేనేత వస్త్రాలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే చేనేతలను ఎప్పుడూ గౌరవించాలి. ఆదరించాలి, ప్రోత్సహించాలి.                                            *రూపశ్రీ.
  టాయిలెట్ సీట్.. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చాక ఇంట్లో అందరూ ఒకే సీటు మీద కూర్చుని టాయిలెట్ వెళ్లడం తప్పనిసరి. అయితే ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత శుభ్రం చేస్తున్నా టాయిలెట్ సీట్ తొందరగా మురికిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా టాయిలెట్ మురికిగా లేకపోతే వచ్చినవారు చాలా అసహ్యించుకుంటారు. అయితే టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను కేవలం 10 రూపాయల విలువ చేసే పానీయంతో సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా కూల్ డ్రింక్ అంటే షాకయ్యేవారు ఎక్కువ. కానీ దీని వెనుక నిజాలు తెలుకుంటే.. కూల్ డ్రింక్.. వేసవి కాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేస్తాయి అనే విషయం పక్కన పెడితే.. టాయిలెట్ ను, టాయిలెట్ సీట్ ను మాత్రం అద్భుతంగా క్లీన్ చేస్తాయి. నిజానికి కూల్ డ్రింక్స్ లో  కార్బోనిక్ ఆమ్లం,  ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటాయి. ఈ ఆమ్లాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అవి టాయిలెట్ సీటుపై ఉన్న మొండి మరకలు,  ధూళిని సులువుగా కరిగిస్తాయి . దీని కారణంగా మురికిగా ఉన్న టాయిలెట్‌ను శుభ్రం చేయడం సులభం. దీన్ని ఉపయోగించడం వల్ల శుభ్రపరిచేటప్పుడు  ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. ఎలా క్లీన్ చేయాలి.. కూల్ డ్రింక్స్ ను ఉపయోగించి టాయిలెట్ ను క్లీన్ చేయడానికి కూడా పెద్ద యుద్దం చేయాల్సిన పని లేదు.  టాయిలెట్ సీట్ పైన ఎక్కడెక్కడ మురికి ఎక్కువ కనిపిస్తోందో.. అక్కడ కూల్ డ్రింక్ ను కాస్త ఎక్కువ పోయాలి. మిగిలిన ప్రాంతంలో సాధారణంగా వేస్తే సరిపోతుంది.  ఇలా పోసిన తరువాత దాన్ని ఒక 15 లేదా 20 నిమిషాలు అలాగే వదిలేయాలి.  కూల్ డ్రింక్ లో ఉండే ఆమ్లం చర్య జరిపి మురికి, మరకలు మొదలైనవాటిని కరిగిస్తుంది.  15 నిమిషాల తరువాత టాయిలెట్ బ్రష్ తీసుకుని స్ర్కబ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేశాక నీళ్ళు పోసి కడిగితే సరిపోతుంది.  ఇలా చేస్తే టాయిలెట్ కొత్త దానిలా మెరిసిపోతుంది కూడా.  అయితే కూల్ డ్రింక్ లోని తీపి బాగా పోయేలా కాస్త నీరు ఎక్కువ వినియోగిస్తే సరిపోతుంది.  టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా  ఉండటానికి, నిమ్మ తొక్క, ఉప్పు,  నీటిని కలిపిన ద్రావణాన్ని టాయిలెట్‌లో పోయాలి. ఓడోనిల్ వంటి ఉత్పత్తులకు బదులుగా, మీరు నిమిషాల్లో దుర్వాసనను తొలగించడానికి  డిఫ్యూజర్‌ను ఉపయోగించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. టాయిలెట్ లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, టాయిలెట్ లో వివిధ రకాల ఉత్పత్తులు, వస్తువులు ఉంచడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే టాయిలెట్ శుభ్రంగా, దుర్గంధం లేకుండా ఉంటుంది.                                   *రూపశ్రీ.  
జీవితంలో మనిషి సుఖాన్ని మాత్రమే కోరుకుంటాడు. బాధకలుగుతుందంటే భయపడతాడు. శారీరక బాధకు మానసికమైన ఆదుర్దా, భయమూ గనక జోడించకపోతే, కేవలం శారీరక బాధ బాధాకరం కాదు. ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక వైద్యవిధానంలో ఈ బాధను చాలావరకు ఉపశమింపచేయగలిగి ఉన్నారు. కానీ బాధను ఓర్చుకోడం కూడా కొంత నేర్చుకోవాలి. అసలు ఓర్వలేనంటూ బాధకలిగి కలగకముందే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటే ఇక బాధ ద్వారా ప్రకృతి మనిషికి నేర్పగలిగింది కానీ, మనిషి నేర్చేదికానీ ఏమీ వుండదు. బాధ నేర్పేదేమిటనే ప్రశ్న కలగవచ్చు. నిజానికి జీవితంలో మనం నేర్చుకునేది చాలామటుకు బాధద్వారే గానీ సుఖం ద్వారా కాదు. సుఖం మనిషిని మత్తులో ముంచుతుంది. బాధ ఏ రంగంలో ఏ అవయవంలో మనకు కలుగుతుందో, ఆ విషయం మొత్తం విశదంగా తేట తెల్లంగా సంపూర్ణంగా మనకు తెలియజేస్తుంది.  ప్రేయసీ ప్రియుల హృదయాలు విరహవేదనను అనుభవించినప్పుడే ప్రేమ నిజంగా ప్రకటితమవుతుంది. స్త్రీ పురిటినొప్పులు పడినప్పుడు కానీ నూతనసృష్టి ప్రారంభం కాదు. గౌతముడు దుఃఖాగ్నిని అనుభవించినందునే సత్యాన్వేషకుడైనాడు. ఒక శ్వేతజాతీయుడు దక్షిణాఫ్రికాలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే వ్యక్తిని అర్థరాత్రి రైలునుండి బయటికి తోసేస్తే, చలిలో వణుకుతూ స్టేషన్లో కూర్చున్నందునే గాంధీ హృదయంలో శ్వేత జాత్యహంకారాన్ని నిర్మూలించాలనే అకుంఠిత దీక్ష బయలుదేరింది. పురాణకాలం నుండీ ఆధునిక కాలం వరకూ బాధలేకుండా ప్రయోజనకరమైన పని ఏదీ జరగలేదు. ప్రజలు బాధలకు గురియైన తర్వాతగానీ అవతార పురుషులుగా మార్లు చెందలేదు.  మనిషి బాధపడిన తర్వాతగానీ జ్ఞానము ఉదయించదు. బాధనెరగని జీవితం పరిపూర్ణమైన జీవితం కానేకాదు. బాధకీ, భక్తికీ దగ్గర సంబంధమని తోస్తుంది. “బాధలకొరకే బ్రతికించితివా” అనే పాటను సక్కుబాయి నిజజీవితంలో పాడినా పాడకపోయినా, ఆ బాధామయ జీవితంలోనే ఆవిడ అనేకసార్లు మూర్ఛిల్లడం, అనేకమార్లు ఆవిడకు పాండురంగ విఠల్ దర్శనమివ్వడం జరిగింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి మరచిపోకుండా వుండడానికి తరచూ తనకు బాధలు కలిగించమని ప్రార్థించింది కుంతీదేవి. బాధలోగానీ భగవంతుడు కనిపించడన్నమాట, “ఎంత బాధపడ్డానో, దేవుడు కనిపించాడనుకోండి” అని వారూ, వీరూ ఉత్తుత్తగా అనడం వింటుంటాం. నిజంగా అంత బాధపడివుండరు. దేవుడు కనిపించీ వుండడు. కానీ నిజంగా బాధపడితే దేవుడు కనిపించడం కూడా యథార్థమే అయివుండాలి. భక్తరామదాసుకు అలాగే కనిపించాడు. హృదయవేదనకు గురైన త్యాగరాజుకు అలాగే కనిపించాడు. ఆవేదనలో నుండే అద్భుతమైన భక్తి సంగీత సాహిత్యాలు వెల్లువలై పొంగి ప్రవహించాయి. మామూలు మనిషికి బాధ అంటే ఎంత భయమో, మరణం ఆసన్నమవుతోంది అంటే అంతకు పదిరెట్లు భయం. కానీ స్థిరచిత్తులైన వారికి మరణం సమీపిస్తున్నదంటే, తాము నిర్ణయించుకున్న కర్తవ్యం పూర్తి చేయాలనే పట్టుదల అధికమవుతుంది. ప్రఖ్యాత జర్మన్ సంగీత స్రష్ట ఫ్రెడరిక్ షోపోన్ ఆరోగ్యం క్షీణిస్తున్న రోజులలో ఇక తన జీవితకాలం సమాప్తం కానున్నదనే సంకోచం ఏర్పడింది. అందుకని మరింత పూనికతో సంగీతాన్ని కంపోజ్ చేస్తుండేవాడు. తరచూ తీవ్రమైన అనారోగ్యానికి గురవడం వల్ల షోపోన్ ఇక బ్రతకడేమోననే అనుమానం ఊరివారందరికీ తరచూ కలుగుతుండేది. షోపోన్ మరణించాడనే వార్త వ్యాపించినా అందరూ ఇట్టే నమ్మేవారు. షోపోన్ తన వైద్యులిచ్చిన రిపోర్టుల సంగ్రహాన్ని ఇలా తెలియజేసుకున్నాడు. " ఒక వైద్యుడు నేను ఖాయంగా చనిపోతానని తెలియజేశాడు. మరొక వైద్యుడు ఇక నేను మరణించడానికి అట్టే కాలవ్యవధి లేదన్నాడు. మూడో వైద్యుడు నేను గతించాననే ప్రకటించేశాడు. ఏంచేయను?" అని తన నిస్సహాయతను ప్రకటించాడు. తన పరిస్థితి తరచూ అంతగా విషమంగా లేదన్నమాట. షోఫోన్ బాధతోనే గతించాడు. అయితేనేమి ఈ భూలోకవాసులకు గాంధర్వ గానమందించి వెళ్ళాడు. నిజానికి షోపోన్ యొక్క అలౌకిక సంగీతం అతడి బాధాతప్త హృదయం నుండి జనించింది. షోపోన్ మూలుగే మహాద్భుతమైన మ్యూజిక్ అయింది. ఇదీ మనిషికి బాధ, దుఃఖం, కష్టం నేర్పించే గొప్ప పాఠం, అది అందించే గొప్ప బహుమానం.                                                            ◆నిశ్శబ్ద.
  కళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన,  సున్నితమైన భాగం. ప్రపంచాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి,  అనుభూతి చెందడానికి, అర్థం చేసుకోవడానికి కళ్లే ఆధారం. అయితే నేటి కాలంలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి, వీటిలో కంటి చూపు మందగించడం, కంటి ఒత్తిడి, చికాకు, ఎరుపు వంటివి ఉన్నాయి. స్క్రీన్ సమయం పెరగడం వల్ల కూడా ఈ కంటి సమస్యలు వస్తున్నాయి. పెద్దల  నుండి పిల్లల  వరకు ప్రతిదానికీ డిజిటల్ పరికరాలు చాలా అవసరం అయ్యాయి. గంటల తరబడి వాటి ముందు గడపడం వల్ల కళ్ళపై చాలా ఒత్తిడి వస్తుంది,  కళ్ళు అలసిపోతాయి. వీటి వల్ల కంటి ఒత్తిడి, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.  దీని నుండి ఉపశమనం కలగడానికి, కంటి చూపు మెరుగవ్వడానికి 20-20-20 టెక్నిక్ భలే సహాయపడుతుంది.  దీని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. 20-20-20 టెక్నిక్.. స్క్రీన్ చూస్తున్నప్పుడు కంటి ఒత్తిడిని నివారించడానికి 20-20-20 నియమం ఒక గొప్ప మార్గం . ఈ నియమంలో   స్క్రీన్ నుండి 20 సెకన్ల విరామం తీసుకుంటారు.  ఇది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడాలి. ఇది ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్‌లను చూడటం వల్ల కలిగే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయోజనాలు.. ప్రతిరోజూ 20-20-20 నియమాన్ని పాటించడం ద్వారా, కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు లేదా నిరోధించవచ్చు. దీనికి సంబంధించిన ఆధారాలు అనేక అధ్యయనాలలో కూడా కనుగొనబడ్డాయి. 20-20-20 నియమం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌ను నివారించడానికి,  దీర్ఘకాలిక కంప్యూటర్ లేదా డిజిటల్ పరికర వినియోగం వల్ల కలిగే డిజిటల్ కంటి ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే సరళమైన,  ప్రభావవంతమైన టెక్నిక్. స్క్రీన్ ను చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న విరామాలు తీసుకోవడం వల్ల కంటి దృష్టి కేంద్రీకరించే కండరాలు సడలించబడతాయి. ఇది కంటి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర మార్గాలు.. కంటి ఒత్తిడిని కొన్ని ఇతర మార్గాల ద్వారా కూడా తగ్గించవచ్చు.  స్క్రీన్ చూస్తున్నప్పుడు లైటింగ్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి.  టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ చూడటం చాలా మసక వెలుతురు లేదా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు   కంటి ఒత్తిడిని పెంచుతుంది.  కంప్యూటర్‌ను ఉపయోగించడం లేదా చదవడానికి వైద్యులు సూచించిన  అద్దాలు ధరించడం వల్ల కంటి ఒత్తిడి తగ్గుతుంది. పెద్దలు స్క్రీన్ సమయాన్ని కంట్రోల్ పెట్టుకుంటే పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయవచ్చు. తాము ఆచరిస్తూ పిల్లలకు చెప్పడం మంచిది.   ఎక్కువసేపు స్క్రీన్ వాడటం వల్ల కంటి ఒత్తిడి,  నొప్పి వస్తుంది. దీన్ని పై చిట్కా తో అధిగమించవచ్చు. కంటి సమస్యలు ఉన్నవారు  క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.  ఇది కంటి ఒత్తిడిని తగ్గించగలదు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు.   అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట.  రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా  కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక  మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది.  శరీరం చురుకుగా ఉంటుంది.  వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు.. సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు.  కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు.  ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా  ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో  వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల  అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది.   కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా  యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి  ఎంతగానో తోడ్పడతాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  పసుపులో ఉన్న ఔషద గుణాలు మరిదేనిలోను లేవని అంటున్నారు యు నాని వైద్యులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పసుపు లోనే కాదు పసుపు చెట్టు ఆకుల లోను ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు సత్య. సహజంగా అందరికి తెలిసింది పసుపు కేవలం కూరలలోనే వాడతారని, లేదా సంప్రదాయంగా  పసుపు ను పూజా కార్య క్రమాలలో వాడతారు. సంప్రదాయ పద్దతిలో జరిగే  పెళ్లి లోను పసుపుదే కీలక పాత్ర,సహజంగా గ్రా మీణ ప్రాంతాలలో చిన్న పాటి గాయం అయితే రక్త శ్రావం ఆగడానికి ముందుగా వాడేది పసుపే అని అంటారు యునాని వైద్యురాలుఅక్కడ పసుపు యాంటి బాయిటిక్  గా పనిచేస్తుందని అన్నారు.   ఎస్ జి వి సత్య. ముఖ్యంగా పసుపు మొక్క నుండి తీసిన పసుపు కొమ్ము ను ఆరగ దీసి పెట్టుకుంటే దద్దుర్లు వాపులు  తగ్గుతాయి. పసుపు ఆకును డికాక్షిన్  తో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. పసుపును డ వేడి వేడి పాలలో వేసి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుముఖం పడుతుంది. పసుపు ఆకుల రసాన్ని  డికాక్షిన్ రూపం లో తీసుకుంటే శరీరం లో ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఇక సాంప్రదాయానికి వస్తే వివాహానికి సంబంధించి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కి సంబంధించి చేసే మంగళ స్నానాలలో పసుపు వాడడం అనావాయితిగా వస్తుంది. పసుపు కాళ్ళకు రాసుకుంటే  యాంటీ బాయిటిక్ గా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్న వారికి పసుపు రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి.  ఇక ముఖం పై పసుపు రాసుకుంటే ముఖం పై వచ్చే ముడతలు తగ్గి ముఖం లో  గ్లౌ వస్తుంది.అలాగీ మీ ముఖం మరింత సౌందర్యం కావాలంటే తేనె, పసుపు ఆకు రసం కలిపిన  లేపనాన్ని కలిపి రాస్తే ముఖం మరింత కాంతి వంతంగా మెరుస్తుందని యునాని హెల్త్ క్లినిక్  కు చెందిన డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. పసుపు ఆకు ఇమ్యునిటీ  బూస్టర్ గా పని చేస్తుంది.పసుపు ఆకు డికాక్షిన్ ను క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికి ఒక సారి ఇస్తే  నీరసం తగ్గి కొంచం కోలుకుంటారని డాక్టర్ ఎస్ జి వి సత్య వివరించారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...