ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్

Publish Date:Jun 17, 2026

Advertisement

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్ నమోదు.. 

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌తో పాటు అరవింద్ యాదవ్ స్టేట్మెంట్లను నమోదు చేశారు.

ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికలకు రెండేళ్ల ముందే తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పలు పోరాటాలు నిర్వహించిందని, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే తమపై నిఘా పెట్టారని అన్నారు.

తాను నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ పార్టీ తరఫున పలు ఉద్యమాలు చేపట్టానని తెలిపారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉండి పలు ఆందోళనల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే తమ కదలికలపై నిఘా పెట్టినట్లు భావిస్తున్నామని చెప్పారు.

తాము ప్రత్యేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉండటంతో సిట్ అధికారులు తమ స్టేట్మెంట్లను నమోదు చేశారని వెల్లడించారు. ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారనే ప్రశ్నకు, తాము చేసిన రాజకీయ పోరాటాలు, ఉద్యమాల కారణంగానే అలా జరిగి ఉండొచ్చని అధికారులకు వివరించినట్లు తెలిపారు. రాజకీయంగా తమను అణగదొక్కేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారని అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

 
 

By
en-us Political News

  
ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె కనీసం నిలబడలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్ పై మైదానం నుంచి తీసుుకు వెళ్లారు.
అమెరికా అంతరిక్ష చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉన్న కాలిఫోర్నియా స్లిక్-సిక్స్ (SLC-6) లాంచ్ టవర్లను స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాల కోసం భారీ పేలుళ్లతో నేలమట్టం చేశారు. ఆ ఆసక్తికరమైన వివరాలు మీకోసం.
గూగుల్ నుండి అత్యాధునిక జెమిని ఏఐ (Gemini AI) సామర్థ్యాలతో సరికొత్త గూగుల్ హోమ్ స్పీకర్ జూన్ 25న విడుదల కానుంది. కేవలం $100 ధరతో, 360 డిగ్రీల సౌండ్, మల్టీ-కమాండ్ ఫీచర్లు మరియు ఉచిత ప్రీమియం ఆఫర్లతో వస్తున్న ఈ స్మార్ట్ స్పీకర్ పూర్తి వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
బెంగళూరులో వీధి వ్యాపారుల భారీ సమ్మెతో మార్కెట్లు మూతపడ్డాయి. కేఆర్ మార్కెట్, చిక్‌పేట మరియు టౌన్ హాల్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు జరిగాయి. తాజా ట్రాఫిక్ అలెర్ట్స్ మరియు రూట్ మ్యాప్ వివరాలు ఇక్కడ చూడండి.
బిట్‌కాయిన్ ధర ఒక్కసారిగా $65,000 మార్కు కంటే కిందకు పడిపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, మరియు యూఎస్-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం క్రిప్టో మార్కెట్‌ను ఎలా దెబ్బతీశాయో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 తొలి మ్యాచ్‌లోనే పోర్చుగల్‌ జట్టుకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో షాక్ ఇచ్చింది. క్రిస్టియానో రొనాల్డో ప్రభావం చూపడంలో విఫలం కాగా, 1-1 తేడాతో మ్యాచ్ డ్రా అయింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వీరిరువురూ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్ కు కేవలం 70 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న టీ9 చాలెంజ్ సీజన్-4 గోల్ఫ్ టోర్నమెంట్‌లో పార్ టైమర్స్ జట్టు 9 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఈ ఉత్కంఠభరితమైన స్కోర్లు, పాయింట్ల వివరాలు చూడండి.
బంగాళాఖాతం పాకిస్థాన్ సబ్‌మెరైన్, భారత్ పాక్ రక్షణ వివాదం, చైనా హ్యాంగర్ క్లాస్ జలాంతర్గామి, భారత నౌకాదళం నిఘా, విశాఖపట్నం నేవీ బేస్, హిందూ మహాసముద్రం రక్షణ
బుధవారం రాత్రి ఇరు దేశాల అధినేతల తుది ఆమోద ముద్ర పడింది. మొత్తం 14 కీలక అంశాలతో కూడిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. ఈ 60 రోజుల కాలంలో శాంతి స్థాపనకు అవసరమైన మరిన్ని శాశ్వత చర్యలను చేపట్టనున్నారు.
విమానంలో ఇంధనం కూడా పూర్తిగా అయిపోయి పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి లారెడో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు విమానాన్ని మళ్లించేందుకు సిబ్బంది శతధా ప్రయత్నించారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా.. అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించింది. ప్రభుత్వ వైద్య సేవల్లో అలసత్వాన్ని, ప్రజారోగ్యంతో ఆడుకునే ఇలాంటి బాధ్యతారాహిత్యాన్ని ఇసుమంతైనా సహించేది లేదని సర్కార్ ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.