శ్రేయాంక పాటిల్ కు గాయం
Publish Date:Jun 18, 2026
Advertisement
మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫామ్‌తో వరుస విజయాలు అందుకుంటున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలకమైన యువ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ బుధవారం ( జూన్ 17) నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడింది. నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డచ్ బ్యాటర్ కొట్టిన బంతిని అడ్డుకోవడానికి మిడాన్ దిశగా పరుగెత్తిన శ్రియాంక పాటిల్ కుడి కాలు మడతపడింది. దాంతో ఆమె ఒక్కసారిగా మైదానంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే భారత జట్టు ఫిజియోథెరపిస్ట్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె కనీసం నిలబడలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్ పై మైదానం నుంచి తీసుుకు వెళ్లారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ గాయం ఆమె ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/shreyanka-patil-injured-36-223354.html





