పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Publish Date:May 15, 2026
Advertisement
పెట్రోల్,డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపు శుక్రవారం (మే 15) ఉదయం నుంచీ అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 110.50 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది.ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్ లీటర్ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.77, డీజిల్ రూ. 90.67, ముంబైలో పెట్రోల్ రూ. 106.68, డీజిల్ రూ. 93.14, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 108.74, డీజిల్ రూ. 95.13, చెన్నై పెట్రోల్ రూ. 103.67, డీజిల్ రూ. 95.25కి చేరాయి. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా సముద్ర మార్గంలో చమురు రవాణా నిలిచిపోయి తీవ్ర కొరత ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లు దాటడంతో.. దేశీయంగా ధరలను పెంచక తప్పలేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. కాగా ఈ పెంపు వల్ల రానున్న రోజులలో రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
http://www.teluguone.com/news/content/petro-36-219831.html





