పీవోకే ఎన్నికలలో ప్రజ్వరిల్లిన హింస.!

Publish Date:Jul 27, 2026

Advertisement

పీవోకేలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. అక్కడ నిర్వహించిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికలో రక్తం చిందింది. ఎన్నికల అక్రమాలు, తుపాకీ మోతలతో పీవోకే పోలింగ్ రణరంగాన్ని తలపించింది.  పీవోకేలోని భీంబర్, మిర్‌పూర్, కోట్లి   జిల్లాల్లోని మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం (జులై 27) జరిగిన తొలి దశ పోలింగ్ లో   ఓటింగ్ మొదలైన తొలి గంట  నుంచే  ఘర్షణలు చోటు చెలరేగాయి.. పక్కా ప్రణాళికతో జరిగిన రిగ్గింగ్, దొంగ ఓట్ల ఆరోపణలు, రాజకీయ వర్గాల మధ్య భౌతిక దాడులతో పోలింగ్ కేంద్రాలు రక్తసిక్తమయ్యాయి.  ఈ పోలింగ్ సందర్భంగా చెలరేగిన  ఘర్షణల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. 

 కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో  పోలింగ్ జరుగుతుండగా..  జరిగిన  కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన 35 ఏళ్ల  ముఖ్తార్ యూనస్ మరణించాడు. ఈ  ఘటనలో మరో ఇద్దరు పీపీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.  కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తలే ఇక్కడ పరస్పర దాడులకు తెగబడ్డారు.  పీఎంఎల్-ఎన్ అభ్యర్థి, అతని మద్దతుదారులే తమ పార్టీ కార్యకర్త ముఖ్తార్ యూనస్‌ను లక్ష్యంగా చేసుకుని దారుణంగా కాల్చి చంపారని పీపీపీ నేతలు  ఆరోపించారు.  

ఈ దారుణ ఘటనపై పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల పేరిట జరుగుతున్న  హింసాకాండపై ఆయన  ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు అక్కడ భద్రతా అధికారులు ఎక్కడ ఉన్నారు? ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రాజ్యాంగబద్ధంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో స్థానిక అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.  

కాగా ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం బూటకమనీ, ఫలితాలనుఇప్పటికే  పాకిస్థాన్ సైన్యం ఖరారు చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో పీవోకే ప్రాంతంలో పాకిస్థాన్ పాలనకు వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలు, తిరుగుబాట్లు తలెత్తకుండా ముందే అణచివేసేందుకు పాక్ ఆర్మీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోందని అంటున్నారు. అక్కడి స్థానిక రాజకీయ వ్యవస్థపై, ప్రజాప్రతినిధులపై పూర్తి నియంత్రణ సాధించడమే లక్ష్యంగా సైన్యం   కనుసన్నల్లోనే ఈ ఎన్నికల డ్రామాను నడిపిస్తోందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మొత్తం మీద 13 నియోజకవర్గాల్లో ముగిసిన తొలిదశ పోలింగ్ పీవోకేలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతటి పతనస్థితిలో ఉందో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

PoK Elections Violence, Mukhtar Yunus Murder, Kotli District Clashes, Bilawal Bhutto Zardari, PML-N vs PPP Violence, Pakistan Army PoK Elections

By
en-us Political News

  
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
ర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
E20 పెట్రోల్ అంశంలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం మరియు డీప్‌ఫేక్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటా, గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలపై పరువు నష్టం దావా వేసేందుకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.