ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.?

Publish Date:Oct 23, 2026

Advertisement

సాధారణంగా కుటుంబంలో శుభకార్యం జరుగుతుంటే బంధాలు బలపడతాయి. విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా శుభకార్యం కోసం నడుంబిగిస్తారు. అయితే..  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో మాత్రం శుభకార్యం కుటుంబ విభేదాలను మరింత పెంచుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాల అగాధాన్ని షర్మిల కుమార్తె వివాహ వేడుక మరింత పెంచినట్లు కనిపిస్తోంది. షర్మిల కుమార్తె పెళ్లి వేడుకను వైసీపీయులు రాజకీయ రచ్చ చేయడానికి ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది.  షర్మిల కుమార్తె వివాహం వచ్చే నెల  25న జరగనున్న నేపథ్యంలో.. బెంగళూరులోని జగన్ నివాసంలో పెళ్లి నిర్వహించాలన్న ప్రతిపాదనకు జగన్ అంగీకరించలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో కూడా దీనిపై కథనాలు వెలువడ్డాయి. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తులు, రాజకీయ విభేదాలు మరోసారి రచ్చకెక్కియి. 

ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పెద్దరికం మీదేసుకుని విభేదాల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అయితే వైఎస్ కుటుంబ పెద్దలు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోకుండా వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాన్ని అన్నా చెల్లెళ్ల మధ్య మరింత చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 

అసలింతకీ బెంగళూరు ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహం అన్న అంశం దగ్గరకు వెడితే.. బెంగళూరులోని ఎలహంకలో జగన్, షర్మిలనివాసాలు  ఒకే కాంపౌండ్‌లో  పక్కపక్కనే ఉన్నాయి. వారిద్దరి నివాసాలకు ప్రవేశ మార్గం ఒక్కటే.   అందుకే షర్మిల కుమార్తె వివాహం అక్కడ జరగడం విషయంలో వింతా లేదు.. సప్పోజ్ ఫర్ సప్పోజ్ షర్మిల తన కుమార్తె వివాహానికి యలహంక ప్యాలెస్ ప్రతిపాదన జగన్ వద్ద చేయడంలో తప్పూలేదు. రాజకీయ, ఆస్తుల విభేదాలు శుభకార్యం జరుగుతున్నప్పుడు పక్కన పెట్టడం మంచిదని ఆమె భావించడం సహజమే. అయితే షర్మిల, జగన్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనీ, పైపెచ్చు జగన్ ప్రాణాలకు హాని ఉన్న నేపథ్యంలో ఆయనకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించారనీ పేర్కొన్న పేర్ని నాని..  జగన్ వంటి హైప్రొఫైల్ వ్యక్తి నివసించే కాంపౌండ్‌లో పెళ్లి వేడుక నిర్వహించడం సాధ్యం కాదని, అయినా ఆయన నివాసమేమీ ఫంక్షన్ హాల్ కాదనీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పెళ్లంటే అతిథులు రావడం, క్యాటరింగ్ సిబ్బంది, డెకరేషన్‌ వాళ్లు, ఇతర పనివాళ్ల రాకపోకలు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయనీ పేర్కొన్న పేర్ని నాని, షర్మిల ఒక వేళ యలహంక ప్యాలెస్ లో తన కుమార్తె పెళ్లి అన్న ప్రతిపాదన చేసి ఉంటే అది తప్పు అని చెప్పారు.  

అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఈ విషయంలో పేర్ని నాని ఎందుకు మాట్లాడారన్నదే. పెళ్లి ఎక్కడ, ఎలా జరగాలి అన్నది  కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశం.  దానికి రాజకీయ వివరణలు, మీడియా విమర్శలతో బయటి వారు జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.   

పేర్ని నాని జోక్యం జగన్, షర్మిల మధ్య విభేదాలను మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  షర్మిల నిజంగా ఎలహంక ప్యాలెస్ లో తన కుమార్తె వివాహం అన్న ప్రతిపాదనను జగన్ వద్ద చేశారా? అందుకు జగన్ తిరస్కరించారా? తిరస్కరిస్తే ఆయన చెప్పిన కారణాలు ఉమిటి?  అన్న ప్రశ్నలకు వివరణ లేదా సమాధానం అంటూ వస్తే అది జగన్ నుంచి, షర్మిల నుంచీ రావాలి. కానీ పేర్ని నాని ఎందుకు మధ్యలో గొంతు సవరించుకుని మాట్లాడుతున్నారన్న ప్రశ్న అటు రాజకీయవర్గాలలో, ఇటు వైఎస్ కుటుంబ సభ్యులలో వినవస్తోంది.   

[Perni Nani  stoking Divisions Between  Jagan YS Sharmila, Sharmila Daughter Marriage, alahanka Palace, Telugu One]

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.