స్థానిక ఎన్నికల రీషెడ్యూల్ : వైసీపీ ట్రాప్ లో పడిన తెలుగుదేశం.. మసకబారిన ప్రతిష్ఠ.!

Publish Date:Oct 23, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయం విలక్షణం. ఆ పార్టీ విధానాలూ, ఎత్తుగడలూ, వ్యూహాలూ అన్నీ సొంత లాభం, ప్రయోజనం కంటే.. ప్రత్యర్థి పార్టీలను బదనాం చేయడం కోసమే అన్నట్లు ఉంటాయి. ఈ విషయంలో స్థానిక ఎన్నికల విషయంలో మరో సారి రుజువైంది. స్థానిక ఎన్నికలు సజావుగా సాగవు, హింస ప్రజ్వరిల్లుతుంది అంటూ ముందునుంచే ఓ ఎన్విరాన్ మెంట్ క్రియోట్ చేసిన వైసీపీ.. తెలుగుదేశం కూటమిని ట్రాప్ లో పడేసింది.

వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది. ఇక స్థానిక నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాకాండను జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. ప్రసారం చేసింది. 

ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు కూటమి సర్కార్ కు వ్యతిరేకం కాదని ఎంతగా నెత్తీనోరూ బాదుకుని చెప్పినా ఫలితం లేదు. ఎన్నికలు రీషెడ్యూల్ అయ్యాయి.  ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1న జరుగుతాయి. ఇక రీపోలింగ్ కు ఒక రోజు రిజర్వ్ చేసి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి నవంబర్ 3గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  

 తిరుపతి, కడప కార్పోరేషన్‌లోని పలు డివిజన్లు, అలాగే రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీలలో పలు వార్డులలో మళ్ళీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు.  25న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుంది. అదలా ఉంచితే చాలా ముందునుంచే జగన్ హెచ్చరిస్తున్నా, అల్లర్ల నివారణకు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైంది.

ఈ విధ్వంసం, అల్లర్ల వల్ల వైసీపీకి వచ్చేదీ, పోయేదీ ఏమీ లేదు. కట్టుదిట్టమైన భద్రత లేకపోయినా... ఆ పార్టీ నామినేషన్లు వేసేదీ లేదు.. వెసినా గెలిచినా పరిస్థితీ లేదు. పుంగనూరు, పులివెందులలో పరిస్థితిని గమనించిన ఎవరికైనా స్థానిక ఎన్నికలలో వైసీపీ సత్తా చాటే పరిస్థితి ఇసుమంతైనా లేదని అవగతమౌతుంది. సో.. ఈ రీషెడ్యూల్ వల్ల వైసీపీ బలం పెరగదు, ప్రతిష్ఠ ఇనుమడించదు. కానీ తెలుగుదేశం పార్టీకీ, కూటమి ప్రభుత్వానికి మాత్రం ఈ పరిణామం ఒకింత ఇబ్బందికరమే. 

స్థానిక సీట్ల సర్దుపాట్ల నుంచి, ఎన్నికల వాయిదా వరకూ అన్ని విషయాలకూ కూటమి సర్కార్ బాధ్యత వహించకతప్పని పరిస్థితి. మొత్తంగా నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితుల్లోనూ వైసీపీ తెలుగుదేశం కూటమి ప్రతిష్ఠను మసకబార్చే విషయంలో ఓ మేరకు విజయం సాధించింది.   


[AP Municipal Elections Rescheduled,  SEC Andhra Pradesh,  Changes tMunicipal E lection Dates, AP Politics, Telugu One]

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.