సమస్యలు ప్రస్తావిస్తే తెలుగుదేశమేనా?

Publish Date:Aug 20, 2022

Advertisement

మీరు తెలుగుదేశం పార్టీ వాళ్లు.. అందుకే నన్ను నిలదీస్తున్నారంటూ కనిిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రజలపై విరుచుకుపడ్డారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కనిగిరిలో పలు కాలనీల్లో పర్యటించారు. ఆ సందర్భంగా సమస్యలను ప్రస్తావించిన ప్రజలపై ఆయన విసుక్కున్నారు.

సంక్షేమ పథకాలతో జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ లబ్ధి చేకూరుస్తోందనీ, అయినా కూడా చిన్న చిన్న సమస్యలను పట్టుకుని నన్న ప్రశ్నిస్తారేమిటని ప్రజలను నిలదీశారు. మీరంతా తెలుగుదేశం వాళ్లు అందుకే ఇలా చేస్తున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి   ప్రభుత్వ పథకాల ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరిస్తుంటే,  పలువురు  రోడ్లు గుంతలమయంగా మారాయని, వీధి దీపాలు వెలగడం లేదని, పింఛన్లు కొందరికే ఇస్తున్నారంటూ కొందరు సమస్యలను ఏకరువు పెట్టారు.

దీంతో ఎమ్మెల్యే బుర్రా తీవ్ర అసహనానికి లోనయ్యారు. మీరంతా తెలుగుదేశం వాళ్లు అందుకే ఇలా చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు. దీంతో ప్రజలు   తాము ఏ పార్టీకీ చెందిన వాళ్లం కాదని, కొందరు స్థానిక నాయకులు తమపై రాజకీయ కక్షలు చూపుతున్నారని ఆయనకు వివరించారు. దీంతో దిగి వచ్చిన ఎమ్మెల్యే శాంతించిన ఎమ్మెల్యే  ఆయా ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.  

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.