జనంలో బీజేపీపై వ్యతిరేకత రాహుల్ కు కలిసొస్తుందా?

Publish Date:May 9, 2023

Advertisement

బిజెపి నిరంకుశ విధానాలపై ప్రజల్లో అసహనం రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలు వరుస దాడులు, కేసులతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నతీరు పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేరుగా మోడీనే తాకుతున్నదని అంటున్నారు.  

వెూడీ, షా ద్వయం తమను గట్టిగా ఢీ కొంటున్న నేతలను కావాలనే వేధిస్తున్నారన్న భావన ప్రజల్లో  బలంగా ఏర్పడింది. కాగా కేంద్రం అనుసరిస్తున్న తీరు  , ఆ తీరును దీటుగా ఎదుర్కొంటున్నరాహుల్ ను జనం గమనిస్తున్నారు. యిప్పుడిప్పుడే రాహుల్ లోని నాయకత్వ లక్షణాలను  వారు గుర్తిస్తున్నారు.  తనపై అనర్హత వేటు వేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ స్పందన పరిణితి చెందిన నేతగా ఉంది. అంతే కాకుండా అనర్హత వేటు పడిన వెంటనే ఎంపీగా   కేటాయించిన భవనాన్ని కూడా ఖాళీ చేయాలని రాహుల్ కు హుకుం జారీ చేయడం, అందుకు బదులుగా నిబంధనల ప్రకారం గడువులోపు ఖాళీ చేస్తానని ఆయన ప్రకటించడం ద్వారా రాహుల్‌ తన నిజాయితీ చాటుకున్నారు.

గుజరాత్‌ కోర్టు తీర్పు, తరవాత పైకోర్టుల్లో లభించని ఊరట తదితర అంశాలన్నీ రాహుల్‌కు కలసి వస్తున్నాయి. ఎంపీగా అనర్హత వేటు పడిన తరువాత రాహుల్‌ పట్ల జనంలో అభిమానం పెరిగింది. అదే సమయంలో ప్రధాని వెూడీ ఇమేజ్‌ మసకబారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పైగా నెహ్రూ కుటుంబానికి చెందిన వారెవరినీ  పార్లమెంట్‌ గడప తొక్కకుండా చేయాలన్న పట్టుదలలో వెూడీ ఉన్నారని భావన కూడా ప్రజలలో విస్తృతంగా వ్యక్తం అవుతోంది.  ఒకప్పుడు తాను బీజేపీ అగ్రనాయకులైన వాజపేయి, ఎల్‌.కె.ఆద్వాణి వంటి వారికి అనుచరుడిగా, సహాయకుడిగా పరిచర్యలు చేసిన విషయం వెూదీ మరచిపోయాడు.

అధికారంలోకి రాగానే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి లాంటి ఉద్దండులను పక్కన పెట్టారు. రాహుల్‌ గాంధీ విషయంలో వెూడీ హుందాగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు పునాదులు పడేవికావు. నిజానికి 2024 ఎన్నికల్లో కూడా ప్రధాని వెూదీ విజయానికి తిరుగుండదన్న అభిప్రాయం నిన్న మొన్నటి దాకా ఉంది. అయితే ఇందిరాగాంధీ లాంటి వారే మట్టి కరిచారు. ప్రాంతీయ పార్టీల నాయకులను నయానో భయానో దారిలోకి తెచ్చుకున్నందున సంతృప్తి చెంది ఉండాల్సింది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికే ఉండకూడదు అనుకోవడం మాత్రం సరికాదు. ఒకప్పుడు బీజేపీ ఉనికిని కాంగ్రెస్‌ సహించేది కాదు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది చూస్తున్నాం. రేపు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సహజ న్యాయం అని ఒకటి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తుంది. కానీ ప్రజలు తలచుకుంటే ఏమైనా చేయవచ్చు. అధికధరలు, జిఎస్టీ వాయింపులు, పెట్రో ధరలు ప్రజలను సూదుల్లా పొడుస్తున్నాయి. వీటిని భరించే శక్తి లేనప్పుడు తిరుగుబాటు గురించి ఆలోచిస్తారు.

దేశంలో పరిస్థితి యిప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది.  ప్రజల ఆగ్రహం ఓడలను బండ్లు, బండ్లను ఓడలు చేస్తుంది. కర్నాటక ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.