వైసీపీ ఎంపీల కాషాయం బాట?.. కారణమేంటంటే?
Publish Date:Jun 22, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం అనిపించే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి త్వరలో భారీ వలసలు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ముగ్గురు కీలక ఎంపీలు త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారన్న వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి తిరుగులేని ఐక్యతతో ముందుకు సాగుతోంది. అయితే.. ఆ ఎన్నికలలో ఘోర పరాజయం పాలై, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని వైసిపి పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారింది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీ గూటికి చేరనన్నారన్నవార్తలు గట్టిగా వినిపిస్తుననాయి. పార్లమెంటు ముంగిటకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోనుందన్న వార్తలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే, ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా దాదాపు 80 అసెంబ్లీ స్థానాలు, 13 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు పెరిగితే, భవిష్యత్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీకిి బలమైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని అంటున్యనారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆ పార్టీ నేతలకు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోలన మొదలైందిజ ఈ నేపథ్యంలోనే వచ్చే కొద్దిరోజులలో వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మారుతున్న పరిణామాలను గమనించిన జనసేన పార్టీ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేసి, వలసలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వచ్చే రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకోవడానికి ఈ ఎంపీలు కమలం గూటికి చేరడమే ఉత్తమ మార్గమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగడం అన్నది కేవలం నంబర్స్ మాత్రమే కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే కీలక పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే.. వైసిపికి, ఆ పార్టీలో కొనసాగితే.. తమకూ రాజకీయ భవిష్యత్ లేదని భావిస్తున్న ఆ పార్టీకి చెందిన నేతలు.. పార్టీ మారడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు వైసీపీ ఎంపీలు కమలం గూటికి చేరడానికి రెడీ అయిపోయారని చెబుతున్నారు. అయితే ఈ వలసల పర్వం ఈ ముగ్గురితో ఆగే అవకాశం లేదనీ, ముందు ముందు మరింత మంది వైసీపీయులు కూటమి పార్టీలలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/three-yp-mps-likely-to-join-bjp-39-223764.html





