అంతర్గత కుమ్ములాటల్లో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే!

Publish Date:May 9, 2023

Advertisement

ఒకప్పుడు కాంగ్రెస్‌ రాజకీయాల్లో భాగమైన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బిజెపిలో కూడా సర్వసాధారణంగా మారిపోయాయి.  కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బుధవారం మే (10)న జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని  తెలిసినా ఎలాగోలా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి పెద్దలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

కర్ణాటకలో ఏదో రకంగా గెలిచేందుకు లేదా కాంగ్రెస్‌ను సాధ్యమైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చేసేం దుకు బిజెపి  వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది. బీజేపీకి కర్నాటకలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరం. ఎందుకంటే కర్నాటక ఫలితం యితర రాష్ట్రాలపై కచ్చితంగా పడుతుందన్నది పరిశీలకుల అంచనాయే కాకుండా బీజేపీ భావన కూడా. ఒక వేళ కర్ణాటకలో అధికారాన్ని కోల్పోతే ఇక దక్షిణాదిన  అడుగుపెట్టే  అవకాశాలు ఆ పార్టీకి దాదాపుగా మృగ్యమౌతాయి.  అలాగే ఉత్తరాది పార్టీగానే  బీజేపీ గుర్తింపు కొనసాగుతుంది. ఆ కారణంగానే బీజేపీ అగ్రనేతలు కర్ణాటక ఎన్నికలను అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.  దక్షిణాదిన తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బిజెపి నేతలు పార్టీలో చేరికలకు తలుపులు బార్లా తెరిచేశారు.

 కేరళలో ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్‌ కె ఆంటోనీ, తమిళనాడులో చక్రవర్తి రాజగోపాలాచారి మనుమడు సిఆర్‌ కేశవన్‌, ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా దక్షిణాదిలో తమకు ఇంకా ఉనికి ఉన్నదని చెప్పేందుకు బిజెపి అగ్రనేతలు తంటాలు పడుతున్నారు. తాను డిమాండ్‌ చేసిన విధంగా సీట్లు కేటాయించేందుకు అధిష్ఠానం అంగీకరించకపోవడంతో  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసంతృప్తి తో ఉన్నారు. కర్ణాటక బిజెపిలో అధికార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన అధికార కేంద్రమైన యడ్యూరప్ప పట్టు నుంచి బిజెపిని తప్పించేందుకు ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ సఫలీకృతమైయ్యాయనన సంగతి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సఫలమయ్యాయన్నది తేలిపోతుంది. వెూడీ, అమిత్‌ షా కర్ణాటక రాజకీయాలను శాసించాలను కున్నా, శాసించగల పరిస్థితిలో లేరని స్థానిక రాజకీయాలు తెలిసిన వారు అంటున్నారు.

కర్ణాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి మరో నేతకు అప్పగించడంలో వెూడీ, షాలు విజయం సాధించగలిగారు కాని పార్టీకి విజయం దిశగా నడిపించగలిగిన  మరో నాయకుడిని అయితే వారు గుర్తించలేకపోయారు. అలాగే యడ్యూరప్ప ఆధిపత్యాన్ని తగ్గించడంలో విఫలమయ్యారు. తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఫిబ్రవరిలో తన 80వ జన్మదినం సందర్భంగా యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రకటించారు. అయినప్పటికీ యడ్యూరప్పను విస్మరించి బిజెపి అధిష్ఠానం కర్ణాటకలో రాజకీయాలు చేయగలిగిన పరిస్థితిలో లేదు. ఉత్తరాదిన చక్రం తిప్పినట్లు దక్షిణాదిన చక్రం తిప్పడం అంత సులభం కాదని వెూదీ, షా లకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నిజానికి ఉత్తరాదిన కూడా యోగి ఆదిత్యనాథ్‌, వసుంధరా రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ల ఆధిపత్యాన్ని వారు తగ్గించలేకపోతున్నారు. స్థానికంగా ఉన్న సెంటిమెంట్‌ను గౌరవించడం లేదు.

అవినీతి నేతలను దూరం పెట్టడంలోనూ విఫలమయ్యారు. అయితే యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆలస్యంగా అయినా గుర్తించిన నేతలు.. ఎన్నికల తర్వాత యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న వాగ్దానంతో అమిత్‌ షా శాంతిప చేశారని ప్రచారం సాగుతోంది. మిగతా రాష్టాల్లో 75 ఏళ్లు దాటిన నేతల్ని ప్రక్కన పెట్టగలిగిన వెూడీ, షాలు కర్ణాటకలో యడ్యూరప్ప విషయంలో అంత సాహసం చేయలేకపోయారు. ఢిల్లీ ప్రమేయం లేకుండా తన కుమారుడికి, ఇతరులకు యడ్యూరప్ప సీట్లు ప్రకటించే స్థితిని అడ్డుకోవడానికి అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది.

గత లోకసేభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ లాంటి నేతలు సైతం వెూడీ హవాలో ఓడిపోయారు. ఈ గెలుపులో యడ్యూరప్ప పాత్ర కన్నా వెూడీ పాత్రే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అంతకు ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పకు స్వేచ్ఛ నిచ్చినప్పటికీ, సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనపడినప్పటికీ బిజెపి మెజారిటీ సీట్లను సాధించలేకపోయింది. అయినప్పటికీ కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ద్వారా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. యడ్యూరప్ప కాలంలో జరిగిన అవినీతి, ఆయనపై ఉన్న కేసుల గురించి తెలిసినా ఢిల్లీ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. అరాచక, అవినీతి పాలనను అరికట్టలేక పోయారు. కర్ణాటకలో వారసత్వ రాజకీయాలను, ఘోరంగా విస్తరించిన అవినీతిని అదుపు చేయలేని ప్రధానమంత్రి నరేంద్రవెూడీ తెలంగాణ వంటి ఇతర రాష్టాలకు వెళ్లి వారసత్వ పాలనను, అవినీతిని విమర్శించడాన్ని జనం గుర్తించడం లేదని భావించడం కమలనాథులు చేస్తున్న పొరపాటుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కేంద్రంలో తొమ్మిది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నా బిజెపికి దక్షిణాది నాడి తెలియదని చెప్పేందుకు మాత్రమే ఈ చేరికలు దోహదం చేస్తాయి.  బిజెపిలో చేరుతున్న వారిని, బిజెపి భావజాలాన్ని అభిమానిస్తున్న వారిని చూస్తుంటే రాజకీయాల్లో సైద్దాంతిక దృక్పథం కన్నా అవకాశవాదం, స్వప్రయోజనాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.  

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.