Publish Date:Jun 13, 2026
కాకినాడ జిల్లా తుని మండ లం సీహెచ్ అగ్రహారంలో గత వారం రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్షించారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. చిన్నారి ఆచూకీని త్వరిత గతిన కనుగొనేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీ ఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
అలాగే దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలింపు కోసం అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఇతర నిపుణుల సహకారం తీసుకుని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా జల్లెడ పట్టాలని ఆదేశించారు.ఇప్పటికే ఈ ఘటనపై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వారం రోజులుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా ఎస్పీ వివరాల ప్రకారం, చిన్నారి కోసం ప్రస్తుతం 400 మంది కిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అత్యాధునిక డ్రోన్ల సహా యంతో విస్తృతంగా శోధనలు కొనసాగుతున్నాయి. అలాగే బాలిక ఇంటి పరిసరాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పోలీ సులు ఇప్పటికే పరిశీలిం చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-holds-a-special-review-on-disappearance-36-222881.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.