ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు భీమ్ రెడ్డి తన ప్రత్యక్ష, బినామీ ఆస్తులు, వాటికి సంబంధించిన లావాదేవీలు, అప్పులు, అలాగే ఆ వ్యవహారాల గురించి తెలిసిన వ్యక్తులు, మధ్యవర్తుల వివరాలను ఒక డైరీలో నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరీలో తెల్లాపూర్‌లో వాచ్‌మన్ పేరు మీద ఉన్నట్లు ఆరోపణలు ఉన్న రెండు ఫ్లాట్లు, మణికొండలోని లాన్‌కో హిల్స్ రోడ్డులో G+5 వాణిజ్య భవనంలో తన వాటా, గచ్చిబౌలిలోని టెలికాం నగర్‌లో ఉన్న G+2 భవనం వివరాలు నమోదు చేసినట్లు గుర్తించారు.
అలాగే కర్ణాటకలోని జహీరాబాద్ పరిసరాల్లో 45 ఎకరాల భూమి, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ముచింతల్‌లో 4.2 ఎకరాల భూమి వంటి బినామీ ఆస్తుల వివరాలు కూడా డైరీలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా 'కమ్ బ్యాక్' అనే గమనికతో ఒక వ్యాపారంలో రూ.2 కోట్ల పెట్టుబడి, విల్లా కొనుగోలుకు రూ.60 లక్షలు కేటాయించినట్లు కూడా నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ డైరీ పేజీలను స్కాన్ చేసి తన కుమారులకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే భీమ్ రెడ్డికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, డైరీలో ప్రస్తావించిన బినామీలు, మధ్యవర్తులను త్వరలో విచారణకు పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వెస్సెల్లా మెడోస్‌లోని భీమ్ రెడ్డి విల్లాతో పాటు మణికొండలోని అతని వ్యాపార భాగస్వామి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరించి, కేసులో మరిన్ని అంశాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dsp-bheem-reddy-36-225103.html
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.