మోదీ, నితీష్ ల 'చాణుక్యుడి' కోసం పవన్ ట్రై చేస్తున్నాడా?
Publish Date:Sep 6, 2016
Advertisement
మీకు పవన్ కళ్యాణ్ తెలుసు. ప్రశాంత్ కిషోర్ తెలుసా? పవర్ స్టార్ అయితే అందరికీ తెలుస్తాడు కాని మధ్యలో ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరు అంటారా? తెలుగు వారికి ప్రశాంత్ కిషోర్ చాలా వరకూ తెలియదు. కాని, కాస్త ఇంగ్లీష్ మీడియా టచ్ వున్న వాళ్లకు ప్రశాంత్ ఎవరు బాగా తెలుసు! ఇక ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీల్లో అయితే, ది కింగ్ మేకర్ ప్రశాంత్ కిషోర్ చాలా చాలా ఫేమస్! మోదీ 2012లో గుజరాత్ ఎన్నికలకు వెళ్లాడు. అప్పటికే సీఎం అయిన ఆయన మళ్లీ గెలవడనీ, గెలవలేడని కథనాలు గుప్పుమన్నాయి! కాని, అనూహ్యంగా మంచి విజయం సాధించాడు! 2014లో ప్రధాని అయ్యేందుకు రూట్ క్లియర్ చేసుకున్నాడు! కాని, 2012 మెదీ విజయం వెనుక వున్నది ఎవరో తెలుసా? ప్రశాంత్ కిషోర్!
ప్రశాంత్ కిషోర్ విదేశాల్లో ఉద్యోగం వదులుకుని ఇండియా వచ్చిన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్! అంటే... రాజకీయ నేతలకి వాళ్ల క్యాంపైన్ ఎలా నడపాలో నేర్పిస్తాడన్నమాట! మోదీకి 2012లో సాయంగా వుండి గెలుపు సంపాదించి పెట్టాడు. తరువాత 2014లో నమో పీఎం అయ్యేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ అద్భుతమైన స్ట్రాటజీ వుంది! ప్రశాంత్ అద్భుత విజయాల తరువాత ఆయనని బీహార్ సీఎం నితీష్ కుమార్ అప్రోచ్ అయ్యారు. వెంటనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ తన సత్తా చాటాడు. అసలు బీజేపి గెలుపు ఖాయమనుకున్న ఆ రాష్ట్రంలో నితీష్ ని మళ్లీ సీఎంని చేశాడు!
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడుతున్నాడు! రాహుల్ గాంధీ చేత పాదయాత్ర చేయించి జనంలోకి తీసుకెళుతున్నాడు! ఉత్తర్ ప్రదేశ్ రైతుల్ని మంచాలు వేసి కూర్చోపెట్టి సభలు నిర్వహిస్తూ కొత్త పంథా ప్రదర్శిస్తున్నాడు! ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపుపై కాంగ్రెస్ కు కొత్త ఆశలు కలిగిస్తున్నాడు... జాతీయ స్థాయిలో ఆల్రెడీ అలజడి రేపిన ప్రశాంత్ కిషోర్ జనసేనకు కూడా తన సేవలు అందించబోతున్నాడా? అవుననే అంటున్నారు కొందరు! ఇప్పుడే పక్కాగా ఏం చెప్పటానికి లేకపోయినా ప్రశాంత్ కిషోర్ ని పవన్ కళ్యాణ్ ని కలవటం కూడా జరిగిందట. అంతా సవ్యంగా సాగితే రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ కి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ వుంటాడట! అప్పుడిక తమ నాయకుడి గెలుపుకి అడ్డే వుండదంటున్నారు పవనిస్టులు!
మోదీని, నితీష్ కుమార్ ని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ , పవన్ కళ్యాణ్ నిజంగా చేతులు కలుపుతారా? ఏమో... ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కాని, వాళ్లిద్దరి మద్యా డీల్ ఓకే అయితే మాత్రం రాజకీయ ప్రత్యర్థులకి ఛాలెంజింగ్ టైమ్సే!
http://www.teluguone.com/news/content/pawan-kalyan-45-66129.html





