ఒబామా తల్లి వేశ్య అంటోన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!
Publish Date:Sep 6, 2016
Advertisement
అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా టైం బావున్నట్టు లేదు! అగ్రరాజ్యం అధ్యక్షడుకి ఏం కష్టమొచ్చింది? అంటారా! పెద్ద కష్టమేం కాదు కాని అవమానాలు జరుగుతున్నాయి! అవును... సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ కి వారంలోనే రెండు అవమానాలు ఎదురయ్యాయి! అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచం గడగడలాడిపోతుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అమెరికాను ప్రపంచం లైట్ తీసుకుంటోంది. అంటే... మరీ చులకన చేసేస్తోంది అని కాకపోయినా... ముందులా మరీ భయపడిపోవటం లేదన్నమాట! ఇంతకీ విషయం ఏంటంటే... జీ 20 దేశాల సదస్సు కోసం ఒబామా చైనా వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకకుండా చైనీస్ అధికారులు తీవ్ర అవమానం చేశారు. అంతే కాదు, అమెరికన్ జర్నలిస్టుల్ని కూడా అమెరికా అద్యక్షుడి వద్దకి వెళ్లనీయలేదు. అదేంటి అంటే... మా దేశం, మా ఎయిర్ పోర్ట్, మా ఇష్టం పొమ్మన్నారు! చైనాలో ఎదురుదెబ్బ తిన్న ఒబామా అక్కడ్నుంచి వియత్నాం చేరుకున్నాడు. అసలు అమెరికాను ఓడించి చరిత్ర సృష్టించిన ఏకైక దేశం వియత్నాం! ఒకప్పుడు ఏకపక్షంగా అమెరికా వియత్నాంపై దాడి చేస్తే అక్కడ ప్రజలంతా సైన్యంగా మారిపోయి చుక్కలు చూపించారు! ఎంత అగ్ర దేశమైనా విర్రవీగితే ప్రమాదం అని అమెరికాకు అప్పుడు అర్థమైంది! ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ అమెరికన్ ప్రెపిడెంట్ వియత్నాం సందర్శించలేదు. ఇప్పుడు ఒబామా వియత్నాంలో కాలుమోపారు! కాని, అంతలోనే ఆయనకు రెండో అవమానం ఎదురైంది! ఆసియాలోని ఓ చిన్న దేశం ఫిలిప్పీన్స్! దాని ప్రెసిడెంట్ రోడ్రిగో. ఈ మధ్యే అధ్యక్షడైన ఆయన ఏమైందో ఏమోగాని ఒబామాను తిట్టేశాడు. ఊరికే తిట్టడమే కాదు బూతులు తిట్టాడు! ఒబామా వేశ్య కొడుకని ఇంగ్లీష్ లో తిట్టేశాడు! ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే... ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగోతో ఒబామా చర్చలు జరపాల్సి వుంది. వియత్నాంలో వాళ్లిద్దరి మీటింగ్ నిర్ణయమైంది! కాని, తనను పచ్చి బూతులు తిట్టిన శత్రువుతో ఒబామా ఏం మాట్లాడతాడు? అందుకే, మీటింగ్ క్యాన్సిల్ అన్నాడు.రొడ్రిగో లాంటి వాడితో చర్చించటం దండగ అన్నాడు! అంతకన్నా ఇప్పటికిప్పుడు ఒబామా చేయగటిగింది కూడా ఏం లేదు! ఇంతకీ ఫిలీప్పిన్స్ అధ్యక్షుడు అమెరికన్ ప్రెసిడెంట్ ని ఎందుకు అంతగా తిట్టాడో తెలుసా? తమ దేశంలో డ్రగ్స్ మాఫియాకి కారణమైన వేలాది మందిని రోడ్రిగో చంపించేశాడు ఈ మధ్య! ఎప్పటిలాగే అమెరికా మానవ హక్కుల ఉల్లంఘన అంటూ వాళ్ల అంతర్గత విషయంలో వేలు పెట్టింది. ఒబామా ఫిలీప్పిన్స్ అధ్యుక్షడ్ని హింస ఆపాలంటూ హెచ్చరించాడు! దాంతో మండిపోయిన రొడ్రిగో నోటికొచ్చినట్టు తిట్టేశాడు! కాకపోతే, కొసమెరుపు ఏంటంటే... తాను అలా తిట్టాల్సింది కాదని తరువాత ఫిలీప్పిన్స్ అధ్యక్షడు తాపీగా విచారం వ్యక్తం చేశాడట! మరి కొన్ని రోజుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ గిరి నుంచి వైదొలగనున్న ఒబామాకి ఇన్నింగ్స్ చివర్లో ఇలాంటి అవమానాల బౌన్సర్లు రావటం ... నిజంగా షాకింగే!
http://www.teluguone.com/news/content/philippines-45-66115.html





