కాకినాడ ఎమ్మెల్యే అవినీతి ‘ద్వారం’పూడి అన్న పవన్
Publish Date:Jun 19, 2023
Advertisement
కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్రెడ్డి పై అనితీని ద్వారం అన్న విమర్శలు చాలా కాలంగా వినవస్తున్నాయి. దాదాపుగా అవే ఆరోపణలను, విమర్శలను వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ మరో మారు చేశారు. దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభ కోణం రేషన్ బియ్యం దారి మళ్లింపు కుంభకోణంగా తెలుగుదేశం ఏళ్ల తరబడి చేస్తోంది. పేదోడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి ‘దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి’గా మారిపోయాన్న విమర్శలున్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగు మతి చేస్తూ వేల కోట్లు జగన్‌రెడ్డి ఖజానాకు తరలించే క్రతువులో ద్వారంపూడిది కీలక పాత్రగా విమర్శలు ఉన్నాయి. . కేంద్రం ఏటా రాష్ట్రానికి సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో 2019-20 నుంచి 2022 జూన్ వరకు 5.70 లక్షల టన్నుల బియ్యం లెక్కలు తేలలేదని పార్ల మెంటులో స్వయంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కుండ బద్దలుగిట్టినట్లు చెప్పారు. ఆ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని నిగ్గు తేల్చే విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కాగా ఈ విమర్శలనే జనసేనాని పవన్ కల్యాణ్ మరింత ఘాటుగా చేయడమే కాకుండా..వచ్చే ఎన్నికలలో ద్వారంపూడిని గెలవనిచ్చేది లేదన్నారు. ద్వారంపూడి దోపిడీదారుడని.. కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ చేసి రూ. పదిహేను వేల కోట్ల మేర దోచేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ అండ తోనే ద్వారంపూడి దోపిడీ సాగుతోందన్నారు. వైసీపీ నేతలు దళితుడ్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే పట్టించుకున్న వారు లేరన్నారు. వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరెత్తడం లేదని జనసేనాని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో శాంతిభద్రతలపై చేసిన వ్యాఖ్యలలో లోతైనా లోతైన అర్థం ఉందన్న జనసేనాని రాష్ట్రంలో మద్యం, మైన్, డ్రగ్స్ ఈ మూడింటి చుట్టూనే కుంభకోణాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయన్నారు.
http://www.teluguone.com/news/content/pawan-criticise-kakinada-mla-39-157037.html





