Publish Date:May 28, 2025
కరోనాతో పంజాబ్ చండీగఢ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్ బారినపడి చనిపోయాడని ఓ అధికారి పేర్కొన్నారు.
Publish Date:May 28, 2025
అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది.
Publish Date:May 28, 2025
తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. దేవుడి ఇచ్చిన శక్తి మేరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాని ఆయన అన్నారు. నా బలం, బలగం టీడీపీ నాయకత్వమే అన్నారు.
Publish Date:May 28, 2025
ఎన్టీఆర్ పుట్టక పోయి ఉంటే సినిమాల్లో మనకు స్టార్ డమ్ ఎలాంటిదో తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్ర సీమకు అతి పెద్ద హీరో చిత్తూరు నాగయ్య.. అప్పట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వచ్చినా ఆయనే చేసేవారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ పాతాళ భైరవి(1951) అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్ర సీమ డైనమిక్స్ మొత్తం ఛేంజ్ అయిపోయాయి.
Publish Date:May 28, 2025
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నియ్యారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఈ విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు.
Publish Date:May 28, 2025
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Publish Date:May 28, 2025
తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలితంగా.. అమరవీరుల త్యాగాల ఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, జూన్ 2. అవును తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను, స్వాతంత్ర దినోత్సవ వేడుకలా ఘనంగా జరుపుకుంటారు.
Publish Date:May 28, 2025
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకంలో అంశలను పరిశీలించి లోకేశ్‌ను చంద్రబాబు అభినందించారు.
Publish Date:May 28, 2025
యువనేత లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కావాలని టీడీపీ కార్యకర్తల నుంచి బలంగా డిమాండ్ వస్తోందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కడప మహానాడు’ ప్రాంగణంలో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలంతా ఈ డిమాండ్ నెరవేరాలని కోరుకుంటున్నారని చెప్పారు.
Publish Date:May 28, 2025
తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత స్పీడ్ ఓ రేంజ్ లో ఉంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కవిత బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
Publish Date:May 28, 2025
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మహానాడులో తీర్మానించారు. ఈ విషయమై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబుతో ఎమ్మెల్యే తెలియజేశారు
Publish Date:May 28, 2025
కడప మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమోషన్ లంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న ప్రచారం జోరందుకుంది.
Publish Date:May 28, 2025
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.