కవితకు బీఆర్ఎస్ తలుపులు మూసుకుపోయినట్లేనా?

Publish Date:May 28, 2025

Advertisement

పార్టీ కంటే ముందే అనుబంధ సంస్థల ప్రకటన? కవిత స్పీడ్ మామూలుగా లేదుగా?

తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత స్పీడ్ ఓ రేంజ్ లో ఉంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కవిత బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె   జాగృతి సంస్థతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతే కాదు సింగరేణి  ప్రాంతంలో పార్టీతో సంబంధం లేకుండా తన సొంత కమిటీలను ఏర్పాటు చేసేశారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. తెలంగాణ రాజకీయాలలో మరీ ముఖ్యంగా నార్త్ తెలంగాణ లో సింగరేణి  ప్రాబల్యం ఎక్కువ. సింగరేణి ప్రాంతంలో కవితకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ప్రాంతానికి సబంధించి కవిత సొంతంగా కమిటీలను ఏర్పాటు చేయడం, కోఆర్డినేటర్లను నియమించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీలో అంతా బాగున్నప్పుడు సింగరేణి ప్రాంతంలో అనుబంధ సంఘాల బాధ్యతలన్నీ కవితే నిర్వహించిన సంగతి తెలిసిందే.  అలాగే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలలోనూ బీఆర్ఎస్ తరఫున కవితే అన్నీ తానై చూసుకునే వారు.  అటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ తో సబంధంధం లేకుండా జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించడం, కోఆర్డినేటర్లను నియమించడంతో ఆమె భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గత కొన్ని రోజులుగా వరుసగా జరిగిన పరిణామాలను గమనించిన ఎవరికైనా కవిత అడుగులు బీఆర్ఎస్ కు దూరంగా పడుతున్నాయన్న విషయం ఇట్టే అవగతమైపోతుంది. సామాజిక తెలంగాణ అంటూ కవిత గతంలో చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలను  బీఆర్ఎస్ నేతలు కానీ, కార్యకర్తలు కానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారో.. అప్పుడే ఆమె పార్టీకి మానసికంగా దూరమయ్యాన్న విషయం అవగతమైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఆ లేఖ లీక్.. తదననంతర పరిణామాలు గమనిస్తే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శిబిరం నుంచి కవితకు ఇసుమంతైనా ప్రాధాన్యం లేదన్న క్లారటీ వచ్చేస్తుంది. 

అన్నిటికీ మించి కవిత తన తండ్రి, పార్టీ అధనేత కేసీఆర్ కు రాసిన లేఖలో చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆమె లేఖను బట్టి చేస్తే ఇంత కాలంగా కాంగ్రెస్ చేస్తున్న బీజీపీ బీటీమ్ బిఆర్ఎస్ అన్న విమర్శలలో వాస్తవం ఉంది అనిపించకమానదని పరిశీలకులు అంటున్నారు. కవిత లేఖ మేరకు గులాబీ జెండా కాషాయ వర్ణంలోకి మారుతోందా అన్న అనుమానాలు కలగక మానవని బెబుతున్నారు. ఆ లేఖ ద్వారా బీఆర్ఎస్, బీజేపీ నెక్సస్ వాస్తవమేనని కవిత చాటినట్లైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత లేఖపై స్పందించే కంటే ఆమెను దూరం పెట్టి ఆమె దారి ఆమె చూసుకునేలా చేయడమే బటరన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే లేఖ వెలుగులోకి వచ్చి ఇన్ని రోజులైనా కేసీఆర్ ఆమెను పిలిపించుకుని మాట్లాడటం కానీ, ఆ లేఖపై స్పందించడం కానీ చేయలేదని చెబుతున్నారు. సో.. ఇహనో ఇప్పుడో, తేదా నేడో, రేపో కవిత తన దారి తాను చూసుకోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే కవితను అనుసరించడానికి బీఆర్ఎస్ లో  చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.