వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్.. లంకపై గెలిచినా నిరాశే

Publish Date:Feb 28, 2026

Advertisement

టీ20 ప్రపంచకప్   టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. శ్రీలకంపై శనివారం (ఫిబ్రవరి 8) జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో గెలిచినా సెమీస్ బెర్త్ కు నోచుకోకుండానే టోర్నీ నుంచి వైదొలగింది.  సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కనీసం 64 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. ఆ సమీకరణాన్ని అందుకోవడంలో పాక్ విఫలమైంది. 

టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత  బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్  ఫర్హాన్ 60 బంతుల్లో  9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్  ఫకర్ జమాన్  42 బంతుల్లో  9 ఫోర్లు, 4 సిక్సర్లతో  84 పరుగులు చేశాడు. వీరిద్దరూ  ఆకాశమే హద్దుగా చెలరేగి తొలి వికెట్‌కు ఏకంగా 176 పరుగులు జోడించారు.

213 పరుగులు విజయ లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్ చేపట్టింది. పాకిస్థాన్ సెమీస్ కు చేరుకోవాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపు అరెస్టు చేయాలి. శ్రీలంకకు మంచి ఆరంభం లభించలేదు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆరంభంలో వికెట్లు తీయడంతో ఒక దశలో పాకిస్థాన్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా అనిపించింది. అయితే శ్రీలంక కెప్టెన్ షనక, పవన్ రత్నాయకేలు అద్భుత బ్యాటింగ్ తో పాక్ ఆశలను అడియాశలు చేయడమే కాకుండా శ్రీలంకను గెలుపు అంచుల వరకూ తీసుకువెళ్లారు.

స్కిప్పర్ షనక పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎనిమిది సిక్సర్లతో కేవలం 31 బంతుల్లోనే 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే రత్నాయకే కూడా 38 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగా శ్రీలంక విజయం సాధిస్తుందా అనిపించింది. చివరికి లంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.   

By
en-us Political News

  
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.