9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు షాకింగ్ తీర్పు

Publish Date:Apr 6, 2026

Advertisement

 

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాతాంకుళం కస్టడీ డెత్ కేసులో కోర్టు సంచలనమైన తీర్పు వెలువడింది. తండ్రి–కుమారులపై జరిగిన దారుణ హింసపై విచారణ పూర్తి చేసిన మదురై కోర్టు 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తూ పోలీసు వ్యవస్థకు గట్టి హెచ్చరికగా మారింది. 2020లో కరోనా లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో సాతాంకుళంలో మొబైల్ షాప్ నడిపినందుకు వ్యాపారి జయరాజ్ మరియు ఆయన కుమారుడు బెనిక్స్ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతించిన సమయానికి మించి దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో వారిని స్టేషన్‌కు తరలించారు.

అయితే పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తండ్రి–కుమారులు తీవ్ర హింసకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. తరువాత వారిపై నమోదైన ఆరోపణలు అసత్య మని బయటపడటం ఘటనను మరింత సంచలనంగా మార్చింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, ప్రజలు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం పలువురు పోలీసులపై హత్య, కస్టడీ టార్చర్ కేసులు నమోదు చేసి కోర్టులో దీర్ఘకాల విచారణ కొనసాగింది.

పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులపై హత్య ఆరోపణలు నిరూపితమయ్యాయని కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ముత్తుకుమార్ ఈ ఘటనను “అరుదైన కేసులలోకెల్లా అరుదైనది”గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్కు రెండు శిక్షలు విధించారు. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు మరణశిక్ష, 84.1 లక్షల జరిమానా విధించారు. ఇతర నిందితులందరినీ సమానంగా బాధ్యులుగా పరిగణించారు. ఈ తీర్పు దేశంలో పోలీసు దుర్వినియోగం, మానవ హక్కుల పరిరక్షణపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిపుణులు కూడా పోలీసు సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడు తున్నారు. సాతాంకుళం కేసులో వెలువడిన ఈ తీర్పు దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.