ఢిల్లీ అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్

Publish Date:Apr 6, 2026

Advertisement

 

దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది. కఠిన భద్రత మధ్య, ముసుగు ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కారుతో వి.వి.ఐ.పీ గేటును ఢీకొట్టి లోపలికి ప్రవేశించడం భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన తెల్లటి టాటా సియెర్రా ఎస్‌యూవీ అసెంబ్లీ గేటు నెంబర్–2 వద్దకు అత్యంత వేగంగా చేరుకుంది. సాధారణంగా కఠిన అనుమతులు ఉన్న వాహనాలకే అనుమతి ఇచ్చే ఈ గేటును, ముసుగు ధరించిన వ్యక్తి ఇనుప గేటు, బూమ్ బారియర్‌లను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లాడు.

లోపలికి వెళ్లిన అనంతరం, ఆ వ్యక్తి కారు దిగి అసెంబ్లీ పోర్చ్ ప్రాంతానికి చేరుకుని, స్పీకర్ విజేందర్ గుప్తకు చెందినదిగా భావిస్తున్న వాహనం వద్ద ఒక పూల బొకే ఉంచాడు. వెంటనే తిరిగి కారులోకి చేరి, వచ్చిన వేగంతోనే భద్రతా ఏర్పాట్లను దాటుకుంటూ బయటకు పారిపోయాడు.ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు వెంటనే హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు, ఫోరెన్సిక్ బృందాలు అసెంబ్లీ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనలో ఉపయోగించిన కారు సర్బ్జిత్ సింగ్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనం యజమానే నడిపాడా? లేక మరెవరైనా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.సెంట్రల్ రేంజ్ స్పెషల్ కమిషనర్ అనిల్ శుక్లా, లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ రవీంద్ర యాదవ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన కారు, సుమారు 2:15 గంటల సమయంలో ఓ రిక్షా కార్మికుడిని ఢీకొట్టినట్లు సమాచారం. బాధితుడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. నిందితుడి ప్రయాణ మార్గాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పగటిపూట, సాయుధ భద్రత మధ్య ఉన్న అసెంబ్లీ వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోకి ఒక వ్యక్తి కారుతో ప్రవేశించి, తిరిగి సులభంగా బయటపడటం భద్రతా లోపాలను బహిర్గతం చేసింది. నిందితుడు అక్కడ బొకే ఎందుకు ఉంచాడు? ఇది నిరసనా? వ్యక్తిగత సందేశమా? లేక భద్రతా వ్యవస్థను పరీక్షించడానికేనా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


 

By
en-us Political News

  
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంత‌టా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట‌ వినిపిస్తోన్న మాట‌.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.