Publish Date:Mar 27, 2026
దేశ భద్రతకు సంబంధించి కొత్త సవాల్ ఎదురైందా? భారత్ ఉగ్రవాదుల రవాణా మార్గంగా మారుతోందా? అంటే జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన విషయాలు ఔననే అంటున్నాయి. పర్యాటక వీసాల ముసుగులో దేశంలోకి ప్రవేశించి అంతర్జాతీయ ఉగ్ర కుట్రకు పాల్పడుతున్న ఓ ముఠాను ఇటీవల ఎన్ఐఏ కోల్ కతాలో అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో అమెరికాకు చెందిన మాథ్యూ వాన్‌డైక్ సహా మరో ఆరుగురు ఉక్రేనియన్లు ఉన్నారు. రష్యా నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈ అరెస్టులు జరిగాయి.
వీరి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలు మయన్మార్ వంటి పొరుగు దేశాల్లోని అస్థిరతను సొమ్ము చేసుకుని ఇక్కడి తిరుగుబాటుదారులకు ఆయుధ సహా అన్ని విధాలుగా శిక్షణ ఇస్తున్నట్లు వెలుగు చూసింది. అంతే కాకుండా ఈ ముఠా అంతర్జాతీయ అస్థిరత సృష్టించేందుకు ఉగ్ర రవాణాకు ఇండియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఐరోపా నుంచి అత్యాధునిక డ్రోన్లను భారత్ మీదుగా మయన్మార్‌లోని తిరుగుబాటుదారులకు చేరవేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం పరికరాల సరఫరానే కాకుండా, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలు, డ్రోన్ల తయారీ మరియు మరమ్మతులపై అక్కడి ఉగ్రవాద గ్రూపులకు వీరు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మాథ్యూ వాన్‌డైక్ ముఠా పర్యాటక వీసాలపై భారత్‌కు వచ్చినట్లు గుర్తించారు. వీరే కాకుండా ఇంకా మరి కొందరు కూడా ఇలాగే పర్యాటక వీసాలతో వచ్చి అసోం, మిజోరం వంటి ప్రాంతాల్లో సంచరించినట్లు వెల్లడైంది. విదేశీయులు ఈ ప్రాంతాల్లో పర్యటించాలంటే రక్షిత ప్రాంత పర్మిట్ తప్పనిసరి. అయితే, అలాంటి ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాంతాలలో సంచరిస్తుండటమే కాకుండా యథేచ్ఛగా సరిహద్దులు దాటి మయన్మార్ చేరుకున్నట్లు కూడా ఎన్ఐఏ దర్యాప్తు తేల్చింది. మయన్మార్ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బృందాలకు వీరు సహకరించడమే కాకుండా, ఈశాన్య తిరుగుబాటు సంస్థలతో కూడా సంబంధాలు ఏర్పరుచున్నట్లు ఎన్ఐఏ ధృవీకరించింది.
అదలా ఉంటే ఎన్ఐఏ కోల్ కతాలో అరెస్టు చేసిన వారిలో ముఖ్యుడైన వాన్‌డైక్ సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థను నిర్వహిస్తూ.. గతంలో లిబియా, సిరియా వంటి దేశాల్లో జరిగిన అంతర్యు ద్ధాల్లో పాల్గొన్నాడు. యుద్ధాలను ఆసరాగా చేసుకుని.. ఒక దేశం నుంచి మరో దేశానికి కిరాయి ముఠాలను పంపడం వ్యాన్ డైక్ సంస్థ పని. ఇందుకోసం వాన్ డైక్ ఇండియాను సురక్షిత రవాణా మార్గంగా ఎంచుకున్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది. వాన్ డైక్ తదితరులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఉపా కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nternational-conspiracy-unfolds-in-india-36-216250.html
డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రముఖ AI టూల్స్ యొక్క బలహీనతను వాడుకుని హాకర్లు భారీ బాట్‌నెట్ నెట్‌వర్క్‌లను సృష్టిస్తున్నారు. హాలూస్క్వాటింగ్ (HalluSquatting) అనే ఈ సరికొత్త సైబర్ ముప్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్‌లో ఇంటెల్, ఏఎండీ, శాన్‌డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్‌డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ ముందు ఊహించని పరిణామం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, మరియు హోస్ట్ యూఎస్ఏ జట్లు టోర్నీ నుండి అవుట్ కావడంతో క్వార్టర్ ఫైనల్ టికెట్ల ధరలు భారీగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ ఘోర ఓటమి తర్వాత సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై వివాదం చెలరేగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వివరణ, స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉపయోగించి దీర్ఘకాలంలో కోట్ల రూపాయల సంపదను ఎలా సృష్టించాలో ఉదాహరణలతో సులభంగా తెలుసుకోండి.
బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో 14 చిన్న తరహా అణు రియాక్టర్ల (SMR) ఏర్పాటు కోసం పోలిష్ బిలియనీర్ 35 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. AI డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు చూడండి.
హోమ్ సెక్యూరిటీ కెమెరాలు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారా? అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు గోడ దూకిన ఈ భయంకరమైన నిజ జీవిత సంఘటన మరియు కెమెరాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చదవండి.
బిట్‌డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.