కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటులో ఎటువంటి ఉల్లంఘనలూ లేవని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కమిషన్ విచారణలో కేసీఆర్ అండ్ కో అవకతవకలకు పాల్పడ్డారని తేలినందునే వారు కోర్టును ఆశ్రయించారని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషిలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మానసం గురువారం (మార్చి 5) విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ జస్టిస్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ విచారణ ఎలా జరుగుతుందో కేసీఆర్‌కు తెలుసన్నారు. అన్నిటికీ మించి కమిషన్ నివేదికలో వారి పాత్ర గురించి ఉందని తెలిసన తరువాతే వారు కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న తరువాత హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. మొత్తం మీద కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ అండ్ కోకు చిక్కులు తప్పకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-violations-36-215122.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.