ఆ సిట్టింగులకు నో టికెట్స్.. ఇప్పటికే జగన్ నిర్ణయం?

Publish Date:Jan 12, 2023

Advertisement

ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోంది. ఇందుకు సర్వేలను, నివేదికలను ఉటంకించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సరిపోతుంది.  ఆ విషయం విపక్షానికే కాదు.. అధికార వైసీపీకీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కూ కూడా స్పష్టంగానే అర్ధమైంది. ఈ క్రమంలోనే  సీఎం జగన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో  వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు.

వీటన్నిటిలోనూ ఆయన వైనాట్ 175 అంటూ చెబుతుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఆ భేటీల్లో తాను స్వయంగా చేయించిన సర్వేల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రిపోర్టులపై జగన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా  పార్టీ మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని, అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై జగన్ లో  అసహనం ఓ రేంజ్ లో పెరిగిపోతోందని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు సరిగా లేకపోవడం వల్లే పార్టీకి గడ్డు  పరిస్థితి వచ్చిందని జగన్ అంటున్నారు.  ఈ క్రమంలోనే జగన్ తన పార్టీలోని సిట్టింగులలో చాలా మందికి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పేస్తున్నారు.  

ఇలా సిట్టింగులకు ఉద్వాసన చెప్పే నియోజకవర్గాలలో దాదాపు 30 నియోజకవర్గాలపై ఇప్పటికే ఆయనో నిర్ణయం తీసేసుకున్నారని కూడా అంటున్నారు. అలా పక్కన పెట్టాలనుకునే వారిలో పలువురు సీనియర్లు, ఒకరిద్దరు మంత్రులు, మాజీ మంత్రులూ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరో వైపు జగన్ కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఎమ్మెల్యేలూ మీరు మారాలి, మీ పని తీరు మెరుగుపడాలి.. లేకుంటే టికెట్ కష్టమే.. ఇందులో ఎలాంటి మోహమాటం లేదు అని చెబుతూ వస్తున్నారు.  ఇప్పటికే చెప్పినా పని తీరు మార్చుకోని, మెరుగుపరుచుకోని ఓ 30 మందికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  ప్రస్తుతం అభ్యర్థి మార్పు తథ్యమని వినిపిస్తున్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా గూడూరు, వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఉదయగిరి, అలాగే ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, హిందూపురం, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు, నందిగామ, తిరువూరు అలాగే కర్నూలు జిల్లా పాణ్యం, నందికొట్కూరు ఇంకా  తిరుపతి,  కనిగిరి, గిద్దలూరు శ్రీకాళహస్తి ,పలమనేరు ననియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెరమీదకు తీసుకురావడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

ఇంకా   శ్రీకాకుళం జిల్లాలోనూ   మార్పులు ఉంటాయంటున్నారు. అదే విధంగా విజయనగరం, బొబ్బిలి, భీమిలి నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాలలోనూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించేందుకు జగన్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని చెబుతున్నారు.  అయితే వీరే కాక ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ టికెట్లు దక్కని సిట్టింగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రజలలో ఉండి, వారి సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను ఉపేక్షించేది లేదని జగన్ చెబుతున్న మాటలు కేవలం హెచ్చరికలు కావనీ, కొత్త ముఖాలతో వచ్చే ఎన్నికలకు వెళితేనే.. ఇప్పుడు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకత తీవ్రత ఒకింతైనా తగ్గే అవకాశం ఉందన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలనూ, ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలనూ ఎమ్మెల్యేల వైఫల్యంగా ప్రజలకు చూపి సేఫ్ గేమ్ అడాలన్న ఉద్దేశంతో జగన్ అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే సిట్టింగులకు టికెట్లు దక్కని పరిస్థితిపై పార్టీలో అసమ్మతి రాజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు టికెట్ వచ్చే అవకాశం లేదంటూ జగన్ ఇస్తున్న సంకేతాలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తిరుగుబావుటా ఎగురవేసేందుకు రెడీ అవుతున్నారు. రానున్న రోజులలో వైసీపీలో అసమ్మతి మరింత జ్వలించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 

By
en-us Political News

  
మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
అస‌లు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శ‌త‌ద్రు ద‌త్తా. శ‌త‌ద్రు ద‌త్తా ఎవ‌రంటే.. ఈయ‌న ప‌శ్చిమ‌ బెంగాల్ లోని హుగ్లీకి చెందిన వ్య‌క్తి. శ‌త‌ద్రు ద‌త్తా ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండ‌క్ట్ చేస్తుంటారు. క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్ల నిర్వ‌హ‌ణ చేయ‌డం శ‌త‌ద్రు ద‌త్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్ర‌ధానమైన ప‌ని.
పహల్గాం అటాక్ తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రతరమైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపించారు. ట్రోఫీ గెలిచినప్పటికీ.. పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. ఇదే విధానాన్ని యువ భారత్ ఈ అండర్ 19 టోర్నీలోనూ కొనసాగించింది.
తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ బ్రౌన్ యూనివర్సిటీ ఆవరణలో నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం.
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సీఐసీ ప్రధాన కమిషనర్ చేత సోమవారం (డిసెంబర్ 15) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఆయనతో పాటు నిమమితులైన ఎనిమిది మంది సీఐసీ కమిషర్లలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి వంటి ప్రముఖులు ఉన్నారు.
మెస్సీ బృందం నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, వారి సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా మారాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కు ఎక్కింది. ఇరు వర్గాలూ అంటే జగన్ , భారతీ, విజయమ్మ, షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ కేసులో ఎన్సీఎల్టీలో ఎప్పటికప్పుడు విజయమ్మ, జగన్ లు పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేసుకుంటున్నారు. ఒకరు ముందు దాఖలు చేసిన పిటిషన్ పై మరొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. దానినీ కౌంటర్ చేస్తూ మళ్లీ పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి.
మెదక్ జిల్లా పెద శంకరం పేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పంచాయతీ ఎన్నికలలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామరెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది
గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఉప్పల్ వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది.
గ్లోబల్ సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక గ్రామంలోని రోడ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఇమిడియట్‌ యాక్షన్ తీసుకున్నారు.
రామేశ్వరం కేఫ్‌లో మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో కేటీఆర్‌ భోజనం చేశారు.
సాంఘిక సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.