ప్రపంచ ఆర్థిక సదస్సుకు జగన్ కు నో ఇన్విటేషన్.. అసలు ఏపీని పట్టించుకోలేదు!
Publish Date:Jan 16, 2023
Advertisement
ఏటా దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు ఈ ఏడాది కూడా దావోస్ లో జరుగుతోంది. అయితే ఈ సదస్సుకు నిర్వాహకులు ఏపీ సీఎంను పట్టించుకోలేదు. పేరుకు యాక్టివ్ భాగస్వాములు అని అంటారు కానీ.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆహ్వానం పంపుతారు. ఏటా ఇది జరిగేదే..కానీ ఈ సారి మాత్రం ఏపీకి ఆహ్వానం దక్కలేదు. సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైంది’ అని కేటీఆర్ కు అందిన ఆహ్వానంలో ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ సీఎం జగన్ కు అందింది. ఈ కారణంగా సీఎం జగన్ కూడా తన ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లారు. అయితే ఈ సారి దావోస్ కు ఏపీకి ఆహ్వానమూ అందలేదు.. ఏపీ నుంచి ప్రతినిధి బృందమూ వెళ్ల లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ ఏడాది ఏపీ నుంచి ప్రతినిధి బృందం వెళ్లేది. ఏపీని గొప్పగా ప్రమోట్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నది.. దీంతో ఏపీ వైపు పెట్టుబడిదారులు చూడటం లేదు. అయినా దావోస్ నుంచి ఆహ్వానం అందినా, జగన్ పెద్ద ప్రతినిథి బృందాన్ని వెంటపెట్టుకుని వెళ్లినా పెద్దగా ఒరిగేదేం లేదని గత ఏడాది ఆయన దావోస్ పర్యటన ద్వారా తేలిపోయింది. అందుకే ఈ సారి దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును జగన్ సర్కార్ లైట్ గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్వానం వచ్చినా.. ఆయన వెళ్లాలన్నా మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అలా తీసుకుని వెళ్లినా ఏపీలో పరిస్థితులు తెలిసిన పారిశ్రామిక వేత్తలెవరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. గత ఏడాది జగన్ ఆర్భాటంగా దావోస్ వెళ్లినప్పటికీ ఆయన పర్యటన మొత్తం వివాదాస్పదంగానే మారింది. భార్యతో విహార యాత్రకు వెళ్లిన చందంగా ఆయన దావోస్ పర్యటన ఉందన్న విమర్శలు వెళ్లువెత్తాయి. ఆయన దావోస్ పర్యటనకు బయలు దేరడానికి ముందే అప్పట్లో మంత్రులు ఈ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న భ్రమలు వద్దని చెప్పేశారు. పెట్టుబడులు వస్తాయన్న ఆశలు లేనప్పుడు దావోస్ వెళ్లడమెందుకని అప్పట్లోనే విమర్శలు వెళ్లు వెత్తాయి.
http://www.teluguone.com/news/content/no-invitation-to-jagan-for-wef-39-150034.html





