నిర్మలమ్మకు.. కమలం పార్టీ పగ్గాలు ?
Publish Date:Jul 4, 2025

Advertisement
ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 21 న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని, బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చే వారం పది రోజుల్లో, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడు ఎవరో తేలిపోతుందని, బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
అయితే, ఈసారి బీజేపీ జతేఅయ్ అధ్యక్షుని ఎన్నికలో బిగ్ ట్విస్ట్’ ఉంటుందని అంటున్నారు. బీజేపే జాతీయ అధ్యక్ష పదవి దక్షణాది రాష్ట్రాలకు, అందునా మహిళా నాయకురాలికి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారంగా,మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే, అధ్యక్ష రేసులో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్’తో పాటుగా,ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి,తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే దక్షణాది మహిళకు అధ్యక్ష పీఠం అప్పగించాలనే నిర్ణయంలో మార్పు లేకుంటే నిర్మలా సీతారామన్’కు బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, గత ఏప్రిల్’లోనే నిర్మలా సీతారామన్ పేరు తెరపైకొచ్చింది. కాగా ఇప్పడు తాజాగా, కొద్దిరోజుల క్రితం జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన నేపధ్యంలో ఆమె పేరు మరో మారు తెరపైకి వచ్చింది.అదలా ఉంటే, ఇంచుమించుగా 45 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, పార్టీ అధ్యక్ష బాధ్యతలు మహిళ అప్పగించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం, ‘వ్యూహాత్మక’ ముందడుగుగా పరిశీలకులు పేర్కొంటున్నారు. రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల నాటికకి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తున్నందున, బీజేపే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అలాగే, దక్షణాది రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు, దక్షణాది మహిళకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడ ఉభయ తారకంగా ఉంటుందని అంటున్నారు.
అలాగే, ఇంతవరకు, బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్ సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు.కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళానేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.
అదే జరిగితే, నిర్మల సీతరామన్’కు పదవి దక్కితే, అది పార్టీ చరిత్రలోనే కాదు, ‘ఫస్ట్’ విమెన్ డిఫెన్స్’ మినిస్టర్, (ప్రప్రధమ మహిళా రక్షణ మంత్రి ) ‘ఫస్ట్’ ఫుల్ టైమ్’ ఫైనాన్సు మినిస్టర్’తో పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్’ ప్రవేశ పెట్టిన తొలి’ అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్’ రాజకీయ జీవితంలో మరో మెయిలు రాయిగా నిలిచి పోతుందని అంటున్నారు.
అలాగే,ఆమె ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు. అనేకాకుండా, దక్షణాది కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్’లోనూ మాట్లాడ గలరు. సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నదే, నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలున్న నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు.
అయితే, ఫైనల్’గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్’ తప్పదు.. అలాగే, ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు.ఎకడమిక్’ పర్సన్’. ఎకనమిక్ లేడీ. ఒక విధంగా ఆమె లేడీ మనోహన్’ సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు. అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు.అంతేకాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే, ఆర్ఎస్ఎస్’ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి.సో.. చివరాకు ఏమి జరుగుతుంది అనేది ..వేచి చూడవలసిందే అంటున్నారు.
http://www.teluguone.com/news/content/nirmala-sitharaman-39-201281.html












