వన్డే వరల్డ్ కప్ 2027కు కోహ్లీ, రోహిత్‌లు అనుమానమేనా?
Publish Date:Aug 11, 2025
Advertisement
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలు రెండేళ్ల తర్వాత జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఇద్దరూ ఒకేసారి టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వీరిద్దరూ వన్డేల్లో మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డే క్రికెట్ నుంచి కూడా వైదొలగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఒకేసారి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. నిజానికి వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రపంచకప్ ఆడాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే దేశీయ వన్డే సిరీస్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడవలసి ఉంటుంది. 2007 ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలంటే అప్పటి వరకు వారిద్దరు ఫిట్‌నెస్ కాపాడుకోవడంతో పాటు ఫామ్‌లో ఉండటం అవసరం. ఈ నేపధ్యంలో వారిద్దరనీ ఎంపిక చేయడానికి బీసీసీఐ ఓ కండీషన్ పెట్టిందంట. ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం వీరిని పరిగణనలోనికి తీసుకుంటామన్నదే ఆ కండీషన్ గా చెబుతున్నారు. అంటే విజయ్ హజారే ట్రోఫీలో వీరు ఆడకపోతే వరల్డ్ కప్ దారులు మూసుకుపోయినట్టే. ఇక టీమ్ ఇండియా కోచ్ యువ ఆటగాళ్లవైపే మొగ్గు చేపుతాడన్నది తెలిసిందే. టెస్టుల విషయంలోనూ అదే జరిగిందనీ, గిల్‌కు సారథ్యం ఇవ్వడం వెనుక కారణం అదే అంటున్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడాలనే తొలుత రోహిత్, కోహ్లీ భావించారంట. కానీ భవిష్యత్తు అవసరాలు దృష్య్టా ఎంపిక కష్టమని బీసీసీఐ వర్గాలు చెప్పడంతోనే వారు టెస్టులకు గుడ్ బై చెప్పారట. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో బీసీసీఐ, గంభీర్ వ్యూహాలు ఫలించి భారత్ యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను డ్రాగా ముగించారు. ఇక పోతే కోహ్లీ, రోహిత్ లు వచ్చే వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అన్నది విజయ్ హజారే ట్రోఫీ తేల్చేస్తుంది. ఆ ట్రోఫీలో ఆడితేనే రోహిత్, కోహ్లీ పేర్లను ప్రపంచకప్ కోసం పరిశీలిస్తారు. ఒక వేళ ఆ ట్రోఫీలో వీరిరువురూ ఆడినా, అందులో వారు రాణించడంపైనే వరల్డ్ కప్ జట్టకు ఎంపక ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు. కాగా ఈ పరిస్థితుల నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 2027 ప్రపంచకప్ లోపు టీమిండియా మరో ఆరు వన్డే సిరీస్‌లు ఆడనుంది.
ఆ క్రమంలో రోహిత్, కోహ్లీ భవితవ్వం ఏంటో మరో రెండు నెలల్లో వచ్చే ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌లో తేలనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మే ఉన్నాడు. ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సారథ్యంలో ఇండియా నెగ్గింది. అయితే ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌కి శుభమన్‌గిల్‌కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని గట్టిగా వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/kohli-39-203982.html





