భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ.. తెలుగువన్ పోల్ సర్వే లో వెల్లడి
Publish Date:Jul 28, 2023
Advertisement
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకుంటుందా? ఐఎన్డీఐఏ కూటమి విజయకేతనం ఎగరేస్తుందా? మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొడతారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? రాహుల్ గాంధీ పీఎం అవుతారా? తనపై ఉన్న వ్యతిరేకతను పోల్ మేనేజ్మెంట్ తో అధిగమించి బీజేపీ మరోసారి చక్రం తిప్పుతుందా? కర్ణాటకలో ఫలితాలను దేశమంతా విస్తరించేలా కాంగ్రెస్ చేపడుతున్న ప్రణాళికలు సక్సెస్ అవుతాయా? అసలు ఈసారి భారత దేశానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరు? ఇదే ఇప్పుడు సగటు రాజకీయాలలో ఆసక్తిగా సాగుతున్న చర్చ. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి అధికారం దక్కితే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం గ్యారంటీ. అదే సమయంలో ఐఎన్డీఐఏ కూటమికి అధికారం దక్కితే ప్రధాని ఎవరన్నది ఇంకా తేలాల్సిన ప్రశ్న. అయితే.. ఈ కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్సే కనుక రాహుల్ గాంధీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలలో ఈసారి ప్రధాని కాబోయే వ్యక్తి ఎవరు అని తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మెజారిటీ నెటిజన్లు రాహుల్ గాంధీయే ప్రధాని కావచ్చని ఓట్లేయడం విశేషం. తెలుగు వన్ సర్వేలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని 66 శాతం మంది ఓట్లేస్తే.. ప్రధాని మోడీ మరోసారి పీఎం అవుతారని కేవలం 34 శాతం మాత్రమే మంది మాత్రమే ఓట్లేశారు. స్వల్ప వ్యవధిలోనే 34 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో 66 శాతం మంది రాహుల్ గాంధీ జై కొట్టడం విశేషం. కాగా, ఈ ఆన్ లైన్ సర్వేలో నరేంద్ర మోడీ వెనకబడడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ చూపిస్తున్న సవతి ప్రేమ ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్టాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రభుత్వ సంస్థలు.. ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. వీటితో పాటు సాధారణంగానే దక్షణాది రాష్ట్రాలలో బీజేపీ పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. అందునా మన తెలుగు రాష్టాలలో బీజేపీకి స్వల్ప ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. ఇక ఏపీలో అయితే కేవలం ఒకటి శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది. ఇక మణిపూర్ హింసాకాండ, మహారాష్ట్ర లో దొడ్డిదారిన అధికారంలోకి రావడం వంటి కారణాలు కూడా జనంలో మోడీ వ్యతిరేకతకు దోహదం చేశాయి. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే.. భారత్ జోడో యాత్ర తరువాత నుంచీ రాహుల్ పట్ల జనబాహుల్యంలో సానుకూలత వ్యక్తమౌతోంది. ఆ యాత్ర రాహుల్ ను దేశ ప్రజలకు సరికొత్తగా పరిచయం చేసింది. రాహుల్ గాంధీకి జనం నీరాజనాలు పలికారు. ఈ విషయాన్ని అప్పట్లో రాహుల్ గాంధీ ఓపెన్ గానే చెప్పేశారు. పరిణితి చెందిన రాజకీయవేత్తగా జనం ఆయనను గుర్తిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nexp-pm-rahul-25-159158.html





