ఎన్నికల వేళ రెండో రాజధాని రగడ!
Publish Date:Jun 18, 2023
Advertisement
దేనిని అయితే చూసుకొని కన్నూ మిన్నూ కానకుండా మిడిసి మిడిసి పడుతున్నారో.. దానిని వారి వద్ద నుంచి బలవంతంగానో.. ఎలాగోలా.. లాగేసుకొంటే.. ఆ తర్వాత వారి పరిస్థితి.. అనంతరం చోటు చేసుకొనే పరిణామాలు అందరికీ తెలిసినవే. చూడబోతే అలాంటి ప్రయత్నానికి కేంద్రంలోని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టిందనే ఓ చర్చ అయితే తాజాగా పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా యమ రంజుగాసాగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్‌ను దెబ్బ కొట్టి.. తెలంగాణలో పాగా వేయాలి.. అలాగే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులను చొరగొనాలి.. ఆ క్రమంలో అందుకు తగ్గట్లు కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్దం చేసుకొని.. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుందా?.. అందులోభాగంగానే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ఆకస్మాత్తుగా తెరపైకి వచ్చి దక్షిణాదిలోని హైదరాబాద్ మహానగరం దేశానికి రెండో రాజధాని కావాల్సిన అవసరం ఉంది.. అంతేకాదు దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయి.. తీరుతోందని ఆయన స్పష్టం చేయడం.. అంబేద్కర్ స్మాల్ స్టేట్స్ పుస్తకంలో హైదరాబాద్ రెండో రాజధాని అని ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం.. అదే విధంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలంటూ సన్నాయి నొక్కులు నొక్కడం చూస్తుంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏదో మతలబు తెరపైకీ తీసుకు వచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జోరందుకుంది. అదీకాక గవర్నర్ గిరి పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్న సిహెచ్ విద్యాసాగరరావు.. ఇలా ఒక్కసారిగా తెరపైకి వచ్చి మరీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి.. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతోన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోవడంతో.. ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. ఇటువంటి నిర్ణయం అయితే అందరికీ శ్రేయస్కరమనే భావనలో మోడీ ప్రభుత్వం ఉందని.. అదీకాక హైదరాబాద్ మహానగరం నుంచి పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయిల ఆదాయం వస్తుందని.. దీనిని చూసి కేసీఆర్ అండ్ కో.. కేంద్రంతో డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోందని, ఆ క్రమంలో భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం.. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే.. దీంతో బీజేపీకే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజల అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్ లా ఔకటే ఔషదం అన్నట్లుగా అవుతోందని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ వైరల్ అవుతోంది. అదీకాక దశాబ్దాల కింద కాకినాడ వేదికగా జరిగిన సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిన కమలనాథులు.. మళ్లీ తాజాగా దేశానికి రెండో రాజధానిగానే కాకుండా... రెండు రాష్ట్రాలకు ఒకటే రాజధాని.. అదీ హైదరాబాద్ అని మోడీ సర్కార్ ప్రకటిస్తే సరిపోతుందనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా అయితేనే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతామని.. మరోవైపు జమ్ము కాశ్మీర్‌లో గతంలో నిత్యం కాల్పులు, బాంబు దాడులు, కిడ్నాపులు వార్తలతో నిండిపోయి ఉండేదని.. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత సదరు రాష్ట్ర పరిస్థితి ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందేనని .. అదే విధంగా మోదీ సర్కార్.. హైదరాబాద్‌పై ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ అలా చేస్తే.. తెలంగాణలో చక్రం తిప్పుతోన్న కేసీఆర్ అండ్ కో.. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి.. కార్యక్షేత్రంలోని దూకుతొందనడంలో ఎటువంటి సందేహం లేదనే చర్చ సైతం నడుస్తోంది. అదీకాక. . విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతే.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సైతం దశాబ్ది వేడుకల సాక్షిగా లక్షల కోట్ల ఆప్పులో మునిగిపోయింది. అలాంటి వేళ.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం ఎంపిక చేస్తే.. ప్రజలు సైతం సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సైతం సాగుతోంది. అదీకాక.. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రాహావిష్కరణ సందర్బంగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సైతం తన తాత గారు దేశనికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు. ఇదే సభా వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కనుండగానే ప్రకాశ్ అంబేద్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం కోసమెరుపు.
http://www.teluguone.com/news/content/new-dispute-on-board-39-157005.html





