సంక్షిప్తం
Publish Date:Jun 18, 2023
Advertisement
1. ఆర్థికశాస్త్రంలో మోడీ నిరక్షరాస్యుడు అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విత్త మంత్రి నిర్మల సీతారామన్‌కు ఏం చేయాలో తెలీదంటూ ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం మోడీ పుణ్యమేనని పేర్కొన్నారు. 2. కర్ణాటక ఫార్ములా జాతీయ స్థాయిలో వర్కౌట్ అవుతుందన్న నమ్మకం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. జాతీయ ఎన్నికల్లో ఓటర్ల తీరు భిన్నంగా ఉంటుందన్నారు. మూడు రాష్ట్రాల్లో గెలిచిన తరువాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైందని గుర్తు చేశారు. 3. పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ పై నమోదైన రాజద్రోహం కేసును ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హరగోపాల్ తో పాటు మరికొందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులను ఉపసంహరించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. 5. మహిళల వస్త్రాధారణపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సంచల వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం తెలెత్తిన నేపథ్యంలో ఆయన మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదన్నారు. ముస్లీం మహిళలు బుర్ఖా వేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. 6. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు ముగిశాయి. అనంతరం మంగళవారం విచారణకు రమ్మంటూ పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 7 తెలుగుదేశం హయాంలో కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వే సుకుని ప్రగల్భాలు పలుకుతున్నారంటూ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. గుడివాడ సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. 8. బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిన్న ఖమ్మంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో ఆ పార్టీ ప్రకటించగలదా అని ప్రశ్నించారు. 9. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు మూహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. అంత కంటే ముందు అంటే ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు భేటీ కానున్నారు. 10.కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా గతంలో తనను దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను తిరస్కరించినట్లు చెప్పారు. 11.తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు. ఇలా ఉండగా వీసీ బర్త్ రఫ్ కు సిఫారసు చేస్తూ కేసీఆర్ గవర్నర్ కు లేఖ రాశారు. 13. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు ఢిల్లీ షరతులతో కూడిన ప్రతిపాదన చేసింది. ఢిల్లీ, పంజాబ్లలో తమకు అండగా ఉంటే, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో తాము పోటీకి దూరంగా ఉంటామని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రతిపాదించారు. 14.జూన్ 20న సికింద్రాబాద్‌లో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి రామ్‌గోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆలయంలో 130 ఏళ్ల నుండి రథయాత్రను నిర్వహిస్తున్నారు. 15.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి నిచ్చింది. ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు. 16.జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసం తీన్ మూర్తి భవన్ లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలాంటి చరిత్రలేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేస్తారని మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. 17. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ కు మేం అభ్యంతరం చెప్పం స్వాగతిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే అలా చేయడం వల్ల హైదరాబాద్ కు అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. 18. కేసీఆర్ పాలనను భరించే ఓపిక ఇక తెలంగాణ ప్రజలకు లేదని టీసీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నుండి విముక్తి కలిగించేందుకు, తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేన రాష్ట్రంలో కాంగ్రెస్ లో చేరికలన్న ఆయన ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీకగా అభివర్ణించారు. 19. ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ స్కూటర్లను డిస్కౌంట్‌తో అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కొసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. కేంద్రం సబ్సిడీ తగ్గింపు, రాష్ట్రంలో వాహనాల లైఫ్ టాక్స్ పెంపు కారణంగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లు మందగించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 20. హుద్ హుద్ తుపానును సైతం తట్టుకున్న విశాఖ ఇప్పడు వైసీపీ అక్రమార్కులకు చేతిలో విలవిల్లాడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు పంచభూతాలను మింగేశారని అన్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఇందుకు తాజా ఉదాహరణ అన్నారు. 21. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని, వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19 తరువాత రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది. 22. వచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. 23. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవివాష్ రెడ్డి ఈ రోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరువావాల్సి ఉన్న సంగతి విదితమే. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకూ సీబీఐ ఆయనను విచారించింది. 24. ఆదిపురుష్ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ చిత్రం హిందువులకు అత్యంత పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిల్ దాఖలు చేశారు. 25. ప్రధాన మంత్రి మోదీ వజూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో ర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటనలో భాగంగా జూన్ 22న కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. 26. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ క్రైం కేపిటల్ గా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, క్రైమ్ రేట్ పెరగలేదని డీజీపీ చెప్పారనీన, అమర్ నాథ్ అనే 10th క్లాస్ అబ్బాయి అత్యంత దారుణంగా కొట్టి తగలబెట్టడం దేనిని నిదర్శనమని ప్రశ్నించారు. 27.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ లో పొందుపరిచి కోర్టుకు సమర్పించారు. 500 పేజీల ఛార్జిషీట్‌లో ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల్లో ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలు, వీడియో రుజువులున్నాయి. 28. రైల్లో ప్రయాణించే సమయంలో చోరీ జరిగితే అది రైల్వే సేవల లోపం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఓ కేసులో తీర్పు ఇస్తూ రైల్లో ప్రయాణించే వారు తమ వస్తువుల భద్రత తామే చూసుకోవాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. 29.నేపాల్ దేశ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్‌కు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల వ్యవధిలో ఆయనకు గుండెపోటు రావడం ఇది రెండో సారి. రాంచంద్రను త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. 30. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో అమితాబ్ బచ్చన్ అని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అన్నారు. అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నాంటూ వస్తున్న వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. 31.అసోంను వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో 11 జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. వరద ప్రబావిత ప్రాంతాల నుంచి 34వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 32. ఫ్రాన్స్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైన ఈ భూకంప ప్రభావానికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. పలువురు గాయపడ్డారు. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భవనాలు కూలిన ఘటనల్లో కొందరు గాయపడ్డారు. 33. కోనసీమ జిల్లామడికి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున గూడ్స్ ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. చోడవరం నుండి గూడ్స్ ఆటోలో తొమ్మిది మంది మందపల్లికి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. 34. రష్యా భూభాగానికి ప్రమాదం వస్తే అణ్వాయుధాల ప్రయోగానికి వెనుకాడేది లేదని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌లో ఉంచామని ప్రకటించారు. ఉక్రెయిన్ తో యుద్ధం లో రష్యా అణ్వాయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 35. హైదరాబాద్ ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్ఠం జరిగింది. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. 36. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామన్న భయం వద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధరణిలోని లోపాలను సవరించి మరింత సమర్ధవంతంగా అమలు చేస్తామన్నారు. అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తామన్నారు. 37. తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఖండించారు. తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామనీ, అలాగే ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. 38. కోనసీమ జిల్లాలో ఓఎన్ జీసీ పైప్ లైన్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. కేశనపల్లిలో జీసీఎస్ పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన జరిగింది. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేశారు. 39. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో పార్టీ కీలక నేతప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చే నెల 7 తర్వాత తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని చెప్పారు. తమ భేటీలో భట్టి విక్రమార్క పాదయాత్ర తెలంగాణ ఎన్నికలపై చర్చించినట్లు చెప్పారు. 40.నల్ల బంగారం బొగ్గు, తెల్ల బంగారం పత్తి సమృద్ధిగా దొరికే ప్రాంతం తెలంగాణ మాత్రమేనని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకదన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కెటిఆర్ పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. 41. మంత్రుల ఆధ్వర్యంలో కంటి వెలుగు వందరోజుల సంబురాలు ఘనంగా జరిగాయి. సచివాలయంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్,లు కేక్ కట్ చేశారు. కంటి వెలుగు పథకం 100 రోజులు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 42. ఉగండాలోని ఓ పాఠశాలపై జరిగిన ఉగ్రదాడిలో కనీసం పాతిక మంది మరణించారు. 25మంది చనిపోయిన ఘటన ఉగాండాలో చోటుచేసుకుంది. ఐసీస్ తో సంబంధాలున్న ఏడీఎఫ్ సాయుధ తిరుగుబాటుదారులు కాంగో సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలపై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 43. కృష్ణా జిల్లా వానపాముల గ్రామం వద్ద ఓ ఆర్టీసీ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68మంది ప్రయాణీకులు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 44. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం అంబేద్కర్ కాలనీలో దుప్పి మాంసం విక్రయిస్తున్న ముగ్గురిని ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. వారినుంచి దుప్పి తల, కాళ్ళు, మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 45. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లిలో రూ. 2 కోట్లతో నిర్మించనున్న గిరిజన భవనానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంజారా డిజే పాటలకు గిరిజన మహిళలతో కలిసి వారు నృత్యం చేశారు. 46. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13 కోట్ల విలువ చేసే కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం సీసాల్లో కలిపి తరలించేదుకు ప్రయత్నించిన కెన్యా దేశస్థుడిని అదుపులోనికి తీసుకున్నారు. 47. ఆదిపురుష్ చిత్ర బృందం క్షమాపణ చెప్పాలంటూ శివసేన ఉద్దవ్ థాకరే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 48. జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళగిరిలో విలేకరులతో మాట్లాడిన ఆయ రాష్ట్రంలో నేరాలు తగ్గాయనీ, శాంతి భద్రతల పరిస్థితి భేషుగ్గా ఉందనీ డీజీపీ చెప్పడం ఆయ మూర్ఖత్వానికి నిదర్శనమని కన్నా అన్నారు. 49. బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలంలో టెన్త్ విద్యార్థి పై నిప్పంటించి హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను పాము వెంకటేశ్వర రెడ్డి , గోపిరెడ్డి, ఎం వీర రాఘవులుగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు సాంబిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 50. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలంగాణ కేసీఆర్ జాతీయ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ-బీ టీమ్గా అభివర్ణించారు. బీఆర్ఎస్ తెలంగాణలో అడుగుపెట్టడంపై విలేకరుల అడిగిన ప్రశ్నకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, ఎన్సీపీలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని అన్నారు.
4. హైదరాబాద్‌లో కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో కొందరు ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. హిజాబ్‌తో పరీక్ష కేంద్రంలోకి రావద్దని సిబ్బంది అడ్డుకున్నారని వారు చెప్పారు.
12. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
http://www.teluguone.com/news/content/news-in-brief-39-157007.html





