మీ గురించి మీరు పొరపాటున ఈ 5 విషయాలు ఎవరికీ చెప్పకూడదు..!

Publish Date:Jun 26, 2026

Advertisement

 

మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే..

ఆర్థిక పరిస్థితి గురించి

 ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.

 ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం.

ఆరోగ్యం, వైద్య సమాచారం..

ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.  

ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు.

ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు..

మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.

 వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి.

రిలేషన్స్, పర్సనల్ లైఫ్..

రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.

 ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
సాయంత్రం పూట వేడి వేడిగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ కోసం సింపుల్ టిప్స్.
మధుమేహం మరియు ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఊరటనిస్తూ, మందులు లేకుండానే రక్తంలోని చక్కెరను నియంత్రించే సూక్ష్మ ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ గురించి తెలుసుకోండి. స్విస్ పరిశోధకుల ఈ సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీ విశేషాలు.
గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులలో ఆరోగ్యానికి ఏది మంచిది? బరువు నియంత్రణ, డయాబెటిస్, ఎముకల బలం కోసం ఏ రొట్టె ఉత్తమమో పూర్తి పోషక విశ్లేషణ తెలుసుకోండి.
మార్కెట్ నుంచి ఎండిన బిర్యానీ ఆకులు కొనడం ఆపేయండి! కేవలం రూ.200 పెట్టుబడితో మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పైనే గుమగుమలాడే బిర్యానీ ఆకు మొక్కను ఎలా సులభంగా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారపు అలవాట్లు, నీరు త్రాగే విధానం, వ్యాయామం మరియు నిద్రకు సంబంధించిన ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
నిద్రలేమి సమస్యను తగ్గించే పోషకాలు, పిప్పి పన్ను నొప్పికి తేనెతో ఇంటి చిట్కాలు మరియు 70% పచ్చి ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.