Publish Date:Mar 12, 2026
ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో 'న్యాయ వ్యవస్థలో అవినీతి' పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇకపై ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినోతో పాటు టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లు రూపొందించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. “ప్రొఫెసర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లకు భారత న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేకపోయి ఉండాలి. లేకపోతే విద్యార్థుల ముందు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరించి ఉండాలి” అని వ్యాఖ్యానించింది.రాబోయే తరాలకు పాఠ్యపుస్తకాలు రూపొందించే ప్రక్రియలో ఈ ముగ్గురికి ఎలాంటి పాత్ర ఉండకూడదని, వారిని వెంటనే పక్కనపెట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధులతో పూర్తిగా లేదా పాక్షికంగా సంబంధమున్న ఏ బాధ్యతలనూ వారికి అప్పగించకూడదని కూడా ఆదేశించింది.
న్యాయవ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ, పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కనీసం ఒక్క న్యాయ నిపుణుడికీ అవకాశం ఇవ్వకపోవడం అసంతృప్తికరమని ధర్మాసనం పేర్కొంది. ఎన్‌సీఈఆర్‌టీఈ లీగల్ స్టడీస్‌కు సంబంధించిన పాఠ్యప్రణాళిక రూపకల్పన కోసం వారం రోజుల్లోగా న్యాయ రంగానికి చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాది, అలాగే విద్యావేత్త ఒకరు ఉండాలని సూచించింది.
వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీతో సంబంధం ఉన్నవారైతే మరింత సమగ్రంగా అంశాలు చేర్చే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద ఎన్‌సీఈఆర్‌టీఈ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సామాజిక మాధ్యమ వేదికలు, వ్యక్తుల వివరాలు అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోర్టు తీర్పులను వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ncert-book-controversy-36-215380.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.