Publish Date:Apr 23, 2026
హైదరాబాద్ నగరంలో మరో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడింది. దేశవ్యాప్తం గా మత్తు పదార్థాలపై కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తాజాగా హైదరాబాద్ మౌలాలి ఐడీఏ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న డ్రగ్ తయారీ కేంద్రాన్ని ఛేదించింది. మౌలాలీలోని ఒక రసాయన యూనిట్‌లో అక్రమంగా మత్తు మందులు తయారవుతున్నాయన్నవిశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌సిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా మత్తు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 69 వేల 600 కిలోల ఆల్ప్రజోలామ్ స్వాధీనం చేసుకున్నారు.
దానితో పాటు డ్రగ్ తయారీకి అవసరమైన రసాయనాలు, ముఖ్యంగా ఎఫెడ్రిన్ తయారీ ముడి పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ 17.40 కోట్ల రూపాయిలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆపరే షన్‌లోఒక కెమిస్ట్,ముడి పదార్థాల సరఫరాదారు, రవాణా నిర్వహించే వ్యక్తిని అరెస్టు చేశారు.
ఎన్‌సిబి ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వేసవిలో డ్రగ్స్ కు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని కల్లు దుకాణాలకు ఆల్ప్రజోలామ్ సరఫరా చేయాలని కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. అరెస్టైన నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ncb-raids-drugs-factory-in-hyderabad-36-218024.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.