సర్దార్‌కి సెల్యూట్... నెహ్రూ ఫ్యామిలీకి చెక్...

Publish Date:Nov 1, 2014

Advertisement

 

భారత ప్రధాని నరేంద్రమోడీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరి భాగస్వామ్యంతో విజయాలు సాధిస్తున్నాయి. మొన్నీమధ్య ఆయన గాంధీజీ స్ఫూర్తితో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రతిస్పందన లభిస్తోంది. ఆ కార్యక్రమం ఇక నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగుతుందన్న నమ్మకం బలంగా ఏర్పడింది. అలాగే ఇప్పుడు మోడీ చేపట్టిన మరో కార్యక్రమం దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అది ముక్కలు చెక్కలుగా వున్న భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా నిర్వహించడం, ఈ సందర్భంగా ప్రజలతో కలసిపోయి సమైక్యతా పరుగు, సమైక్యతా ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను నిర్వహించడం! ప్రధాని నరేంద్రమోడీ సర్దార్ పటేల్ జయంతిని ఇంత భారీగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం వెనుక దేశంకోసం జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా, ఇంతకాలం దేశం నెత్తిన గుదిబండలా కూర్చున్న నెహ్రూ కుటుంబానికి చెక్‌ పెట్టే ఉద్దేశం వుందని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ప్రధానమంత్రి హోదాలో నాయకత్వం వహించే అంశంలో పటేల్, నెహ్రూ మధ్య నెలకొన్నపోటీ, ఆ పోటీలో నెహ్రూ ‘తెలివిగా’ సాధించిన విజయం అందరికీ తెలిసిందే. దేశంలో ముక్కలు చెక్కలుగా వున్న సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించడంలో హోంమంత్రి హోదాలో సర్దార్ పటేల్ చేసిన కృషి అనితరసాధ్యమైనది. నెహ్రూ కాకుండా పటేల్ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే భారతదేశం ఇప్పుడు మరోలా వుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుంటాయి. సాహసి, దార్శనీకుడు, నిస్వార్థపరుడు అయిన పటేల్ ప్రధానమంత్రి కాకపోవడం ఈ దేశ దురదృష్టాల్లో ఒకటన్న అభిప్రాయం కూడా వుంది. నెహ్రూ కూడా గొప్ప నాయకుడే... కానీ ఆయన వారసత్వం మాత్రం దేశాన్ని అధోగతిపాలు చేసింది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అభివృద్ధిలోకి వెళ్ళాల్సిన దేశం తిరోగమన దిశగా పయనించడానికి నెహ్రూ కుటుంబం ప్రధాన కారణమన్న అభిప్రాయాలూ వున్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూకంటే మిన్నగా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కి ఆ తర్వాత నెహ్రూ కుటుంబ పాలనలో సరైన గుర్తింపు లభించలేదు. దానికి కారణం ప్రధాని పదవి విషయంలో నెహ్రూతో పటేల్ పోటీపడటమేననేది బహిరంగ రహస్యమే. ఈ రాజకీయ కారణంతోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వున్న ఇంతకాలం పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమంలోనయినా దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన నెహ్రూ కుటుంబం పేర్లు వినిపిస్తాయే తప్ప, దేశంకోసం సర్వస్వం అర్పించిన పటేల్ లాంటి నాయకుల పేర్లు ఏనాడూ వినిపించలేదు. ఆ పొరపాటును దిద్దే పనిని ఇప్పుడు మోడీ చేయడం అభినందనీయం.

 

ఇప్పుడు దేశం నెత్తిన కాంగ్రెస్ పార్టీ రూపంలో నెహ్రూ కుటుంబ గుదిబండ వుంది. దీనిని క్రమంగా తొలగించే పనిని మోడీ చేపట్టినట్టు కనిపిస్తోంది. మోడీ ఒక వైపు మహాత్మాగాంధీని, మరోవైపు సర్దార్ పటేల్‌ని స్ఫూర్తిగా తీసుకుంటూ వీరిద్దరూ దేశంకోసం సమంగా పోరాడిన నాయకులని అంటున్నారు. గాంధీజీ, పటేల్ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు అసంపూర్ణంగా వుండేవారని మోడీ చెబుతున్నారు. అంతే తప్ప ఆయన ఏ సందర్భంలోనూ నెహ్రూ పేరును ప్రస్తావించిన దాఖలాలు లేవు. అక్టోబర్ 31వ తేదీన పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారే తప్ప, నెహ్రూ కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో మోడీ పాల్గొనలేదు. ఇది దేశానికి పట్టిన నెహ్రూ కుటుంబ జాడ్యాన్ని క్రమక్రమంగా తొలగించే బృహత్తర కార్యక్రమంలో మొదటి అడుగుగా భావించవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. నెహ్రూ దగ్గర మొదలుపెట్టి.. ఇందిర.. రాజీవ్.. సోనియా... రాహుల్... ఇలా క్రమక్రమంగా నాసిరకంగా మారుతున్న నెహ్రూ కుటుంబ వారసత్వ చెర నుంచి దేశాన్ని కాపాడే ఉద్దేశంతో మోడీ వున్నారని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.