నా అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్‌ బ్యాన్!

Publish Date:Feb 19, 2026

Advertisement

ప్రముఖ యూట్యూబర్   నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ బ్యాన్ అయింది. నా అన్వేష్  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో గతంలో  ఈ యూట్యూబర్ పైకేసు నమోదైంది. దీంతో ఆ ఖాతా వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యంఆ వివరాలు అందజేసింది.  

వాటిని పరిశీలించిన సీసీఎస్ పోలీసులు అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్థారణకు వచ్చి అతడి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు మరో లేఖ రాశారు. ఆ లేఖతో  అన్వేష్ ఖాతాను   ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్ బ్యాన్ చేసింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. ఇప్పుడు అతడి  ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది.

తెలుగులో ఎక్కువ మంది వీక్షించే ట్రావెల్ వ్లాగర్‌లలో అన్వేష్ ఒకరు . ట్రావెల్ వ్లాగింగ్ అంటే మీ ప్రయాణాలను వీడియోల ద్వారా అందరితో పంచుకోవడం. అంటే..  ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను తీసి, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి, ఇతరులతో పంచుకోవడం. అలా చేసే వారినే ట్రావెల్ వ్లాగర్ అంటారు .

మహిళల వస్త్రధారణపై కొద్ది రోజుల క్రితం చెలరేగిన వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ ఆ సమయంలో అన్వేష్ ఓ వీడియో రూపొందించాడు. తన వాదన వినిపించే క్రమంలో  అనుచిత భాష వాడడం, హిందూ దేవతల పేర్లు తీసుకురావడం వివాదాస్పదంగా మారింది.  పురాణగాథల్లో జరగని ఘటనలు జరిగినట్టు అర్థం వచ్చేలా, సీత, ద్రౌపదిల గురించి వ్యాఖ్యానించాడు. ప్రవచనకారుల గురించి జుగుప్సాకరంగా మాట్లాడాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి.

By
en-us Political News

  
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
యూఏఈ తన ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో.. క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు.
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.