పంజాబ్ కింగ్స్ కు తొలి ఓటమి

Publish Date:Apr 28, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తొలి పరాజయాన్ని ఎదుర్కొంది. మంగళవారం ((ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్ లో జరిగిన మ్యాచ్ లో ఆరువికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. మార్కస్ స్టయినిస్ మెరుపు ఇన్నింగ్స్ 22 బంతుల్లో 66 నాటౌట్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ మన్ సింగ్ 44 బంతుల్లో 59 అర్ధశతకంతో రాణించాడు. 
అనంతరం 223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్  27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు.

చాహల్ 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్ల పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. ఒక దశలో విజయయానికి 50 బంతుల్లో వంద పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే.. ఫెరీరా, శివం దుబెలు నిలకడగా, వేగంగా ఆడారు. పేసర్లను లక్ష్యం చేసుకుని బౌండరీల వర్షం కురిపించారు. దీంతో 19.2 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.   

By
en-us Political News

  
మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
యూఏఈ తన ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో.. క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.