బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు

Publish Date:Apr 28, 2026

Advertisement

భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఓ పదిహేనేళ్ల బాలుడి పేరు మార్మోగిపోతోంది. ఐపీఎల్ లో అతడు సృష్టిస్తున్న పరుగుల విధ్వంసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తోంది. కమిన్స్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లను సైతం అతడి అభిమానులుగా మార్చేస్తోంది. అతడే 15 ఏళ్ల  వైభవ్ సూర్యవంశి.  ఇండియన్ ప్రీమియర్ లీగ్  2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ కుర్రాడు, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ చేసిన మెరుపు సెంచరీ అతడిని రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్‌ను చేసింది.

కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసిన వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 12 సిక్సర్లు బాదడం విశేషం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అతను ఆడుతున్న తీరు క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు తన ప్రదర్శనతో ఆ రికార్డుల స్థాయిని మరింత పెంచుతున్నాడు.  

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం  స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు..  12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.  ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.  

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌లోని ప్రతిభను గుర్తించి 2025 వేలంలో 1.1 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా పరుగులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా అతని బ్యాట్ స్పీడ్, స్ట్రోక్ ప్లే లో చూపిస్తున్న టైమింగ్  దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌లను గుర్తుచేస్తోందని అభిమానులు అంటున్నారు.  

ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే..  వైభవ్ సూర్యవంశీ అతి త్వరలోనే టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 400కు పైగా పరుగులు సాధించిన ఈ యువ సంచలనం..  మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్ ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

కాగా మంగళవారం (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్ లో ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  అతడీ ఘనతను కేవలం ఈ ఘనతను కేవలం 167 బంతుల్లోనే అందుకున్నాడు. ఈ క్రమంలో ఆండ్రీ రసెల్  188 బంతుల్లో నాలుగువందల పరుగుల రికార్డు చెరిగిపోయింది.  

By
en-us Political News

  
బ్యాంకు అధికారులు తన సోదరి చనిపోయిందని నమ్మడం లేదనీ.. ఆమెను స్వయంగా తీసుకురావాలని అన్నారని అంటాడు జీతూ. అమాయకత్వం, చదువు లేకపోవడం, బ్యాంకు నిబంధనల పట్ల త‌గిన‌ అవగాహన లేకపోవడంతో.. తన సోదరి చనిపోయిందని నిరూపించడానికి ఆమె సమాధిని తవ్వి, అందులోని అస్తిపంజరాన్ని సంచిలో వేసుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు కాలినడకన చేరుకున్నాడు జీతూ.
చంద్రబాబు నాయుడుకు హైటెక్ అనే పేరు ఊరికే రాలేదు. 90వ దశకంలోనే ఐటి ప్రాధాన్యతను గుర్తించి, చేతిలో ఒక పామ్ టాప్ పట్టుకుని తిరుగుతూ అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్ర‌బాబు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన ఫోన్ చూసి ఆశ్చర్యపోవడం, బాబు గారి అప్‌డేటెడ్ లైఫ్‌స్టైల్‌కు మరో నిదర్శనంగా చెబుతారు.
బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో మీజిల్స్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 90 శాతం దేశం మీజిల్స్ ప్రభావానికి గురైంది. మార్చి మధ్య కాలం నుండి ప్రారంభమైన ఈ వ్యాప్తి ఉధృతి ఏప్రిల్ ఆఖరు నాటికి పతాక స్థాయికి చేరింది. సుమారు 30 వేల మందికి పైగా చిన్నారులు.. మీజిల్స్ లక్షణాలతో బాధపడుతుండగా, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది.
యూఏఈ తన ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో.. క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు.
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.