భలే పెళ్లి పత్రిక..
Publish Date:Apr 30, 2021
Advertisement
మాకు లైవ్ లో తల్వాల్ పడ్డంకా.. ఎవరి ఇంట్ల వాళ్ళు బువ్వ ఒండుకుని తినుర్రి. కానీ పిల్ల దిక్కు, పిలగానే దిక్కు కట్నాలు సదివించేటోళ్లు మాత్రం జి పే . ఫోన్ పే చేయిర్రి, ప్రేమతో మీరు పంపే కట్నాలను కరోనా కాలం లో బువ్వ లేకుండా భాదపడుతున్న వాళ్లకు ఆర్థిక సాయంగా అందించపడుతుంది. బరాత్ ఉంది గానీ ఎవరి ఇంట్ల వాళ్ళు పాటలు పెట్టుకుని ఎగురుర్రి.. ఆ తరువాత ఆ వీడియోలను మాకు పంపండి.. జగిత్యాల జిల్లా. సచిపోయి స్వర్గం లో ఉన్న తాత, అవ్వ జీల బాలరాజ్ , ఎల్లవ్వ దీవెనలతో లగ్నం మే 1 వ తారీకు పొద్దు పొడిచినంక 8 గంట కొట్టంగ ఇంస్టాగ్రామ్ లో మా పెద్ద పోరడు. యూట్యూబర్ అనిల్ జీల కోవిద్ నెగిటివ్ గానీ లగ్నం సదువుల తల్లి ఆమని కోవిద్ నెగిటివ్ తో పెళ్లి. మరువకుండా మీ సెల్ ఫోన్ ల 1 జిబి ను ఆగవట్టుకొని సుట్టలు అయినోళ్లు, పిల్లా.. జెల్లా.. అయినోళ్లు.. ముసలోళ్ళు ..అందరూ ఫోన్ ల ముందు అంతర్జాలంలో ఈ పెండ్లి చూసి ఆశీర్వదించగలరు. జగిత్యాలలో లంబాడిపల్లి మైవిలేజ్‌షో సభ్యుడు అనిల్ జీల మే 1న పెళ్లి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన హితులకు, బంధుగణానికి పత్రికను పంపేందుకు రూపొందించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్ల పేర్ల పక్కన కొవిడ్ నెగెటివ్ సూచన, పెళ్లికి రాకండంటూ.. వేడుకను ఆన్‌లైన్‌లో చూడమంటూ.. అందుకోసం ఒక జీబీ డేటాను ఫోన్‌లో పెట్టుకోండన్న అభ్యర్థనలతో ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లిపత్రిక ఆకట్టుకుంటోంది. కట్నాలు ఇవ్వాలనుకునే వారు గూగుల్‌పే క్యూఆర్ కోడ్ ద్వారా పంపాలని అభ్యర్థించారు. ఆ సొమ్మునంతా కరోనా వేళ ఆకలితో అలమటించే వాళ్లకు అందిస్తాననే హామీ ఇచ్చారు. ఇన్‌స్టా లైవ్‌లో పెళ్లి చూడండని.. ఏమనుకోకుండా ఎవరి ఇళ్లవద్ద వాళ్లే ఉండాలని కార్డుతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలో విన్నవిస్తున్నారు. లగ్గం జాగ, ఎవ్వరింట్ల ఆల్లు బువ్వ తినుర్రి.. ఇలా తెలంగాణ యాసలోని పదాలు పత్రికలో ప్రత్యేకతగా నిలిచాయి. అనిల్ పెళ్లి పత్రిక సోషల్ మీడియా లో వైరల్ అయింది.
http://www.teluguone.com/news/content/my-village-show-anil-marriage-card-39-114566.html





