అమరావతిదే అంతిమ విజయం!
Publish Date:Apr 30, 2021
Advertisement
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 500వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని రైతులు..రైతులు.. కరోనా సూచనలు పాటిస్తూ నిరసనలు చేస్తున్నారు. అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారికి విజయం దక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశించారు. ఇన్ని రోజులుగా రైతులు తమ నిరసనలు తెలుపుతున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మూర్కపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ప్రజారాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి. "కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్ళతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు. పాలకులు ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నా, ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు 500 రోజులుగా శాంతియుతంగా నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకి అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
http://www.teluguone.com/news/content/amaravathi-farmers-protest-500-days-39-114564.html





