కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం
Publish Date:Dec 11, 2025
Advertisement
కడప కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో పాక సురేష్ వినా మరెవరూ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. గత ఎన్నికల్లో మేయర్ గా గెలిచిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ చట్టాలను అతిక్రమించి పనులు చేపట్టారనే కారణంగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు పొందారని తేలింది. విజిలెన్స్ నివేదికను అనుసరించి సురేష్ బాబును ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేయర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్ చార్జి మేయర్ గా నియమించింది. తాజాగా ఖాళీగా ఉన్న మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లు ఉండగా గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గిలిచారు. ఈ రెండూ మినహా మిగిలిన 48 డివిజన్ లలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మార డం, కడప ఎమ్మెల్యేగా టిడిపి నుంచి మాధవీ రెడ్డి గెలవడం జరిగింది .ఆ తర్వాత ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ లు మరణించారు. దీంతో దీంతో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య సంఖ్య 38గా ఉంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసిపి అనుకూలంగా ఉండటంతో వారి సంఖ్య 39 . ఆ కడప కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. సంఖ్యా బలం లేకపోవడంతో గురువారం (డిసెంబర్ 11) జరిగిన మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పోటీ చేయలేదు. వైసీపీ నుండి 47 వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేస్ ను మేయర్ అభ్యర్థి పోటీకి దిగి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది.
http://www.teluguone.com/news/content/paka-suresh-elected-unanimous-as-kadapa-mayor-39-210833.html





