పరాజయం నుంచే అద్భుతాలు మొదలవుతాయి

Publish Date:May 28, 2019

Advertisement

మన దృష్టి సాధారణంగా మనలో ఉన్న బలాల మీద కాకుండా బలహీనతల మీదే ఉంటుంది. ఆ బలహీనతల వల్ల ఏర్పడిన పరాజయాల మీదే ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ ఎదుర్కొన్న ప్రతిసారీ... దాని నుంచి ఏదన్నా నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే... అదే మన విజయానికి దారితీస్తుంది. అందులో మన బలం కూడా ఎక్కడో దాగి ఉందని తెలుస్తుంది. నమ్మడం లేదు కదూ! కావాలంటే ముక్తామణి కథ వినండి...

 

ఈ కథ 1989లో మొదలవుతుంది. అప్పట్లో మణిపూర్‌లో ముక్తామణి అనే ఆవిడ ఉండేది. ముక్తామణి కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. ఆ కుటుంబానికి పూట గడవడమే కష్టంగా ఉండేది. పేదవాడి కష్టాలకి కొదవ ఉండదు కదా! అలా ఓ రోజు ఆమె రెండో కూతురు చిరిగిపోయిన షూస్‌తో ఇంటికి వచ్చింది. ఆ షూస్ అప్పటికే చిన్న చిన్న రిపేర్లతో బాగుపడే పరిస్థితిని దాటిపోయాయి.

కూతురు షూస్ చూసిన ముక్తామణికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒకపక్క తినడానికే డబ్బు లేదు. ఇక కొత్త షూస్ ఎక్కడి నుంచి తీసుకువస్తుంది. ఇక చేసేదేమీ లేక... చివరికి ఆ షూస్ చుట్టూ వులెన్ దారంతో అల్లింది. కానీ ఆ తల్లీకూతుళ్ల మనసులో ఒకటే అనుమానం. మర్నాడు టీచర్ ఏం తిడతారో అని! యూనిఫాంతో సరిపోని షూస్‌ని చూసి టీచర్ తప్పకుండా తిట్టిపోస్తుందని వాళ్ల భయం. ఆ భయంతోనే ముక్తామణి కూతురు మర్నాడు స్కూళ్లో అడుగుపెట్టింది. కానీ విచిత్రం! టీచర్ ఆ అమ్మాయిని తిట్టలేదు సరికదా... వాటిని ఎవరు అల్లారో కనుక్కొంది. అంతేకాదు- ‘మా పాపకి కూడా ఇలాంటి షూస్ అల్లిస్తుందేమో మీ అమ్మని కనుక్కో!’అంది.

తిట్టు వినపడతాయనుకునే చోట ప్రశంసలు కనిపించడంతో ముక్తామణి సంతోషానికి హద్దు లేకపోయింది. దాంతోపాటే ఆమెలో ఆ ఆలోచన కూడా మొదలైంది- ‘తను వులెన్ దారంతో షూస్ అల్లగలదు కదా! దాన్నే ఓ వృత్తిగా చేసుకుంటే ఎలా ఉంటుంది?’. ఆ ఆలోచన ప్రస్తుతం ‘ముక్తా షూ ఇండస్ట్రీ’కి దారి తీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఈ ముప్ఫై ఏళ్లలో ముక్తామణి వెయ్యిమందికి పైగా ఉపాధి కల్పించింది. ఆవిడ కంపెనీలో తయారయ్యే షూస్‌ ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి. ముక్తా సాధించిన విజయాలకి లెక్కలేనన్ని అవార్డులు కూడా దక్కాయి. ఈమధ్యే ‘ద టెలిగ్రాఫ్‌’ పత్రిక ఆవిడను ‘True Legends Awards 2018’తో సత్కరించింది. ఇంత ఎదిగినా కూడా ముక్తామణిలో కొంచెం కూడా గర్వం కనిపించదు- ‘నాతో పాటు అలుపెరగకుండా పనిచేసేవాళ్ల సాయం ఉండబట్టే, ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతారు.’

- Nirjara

By
en-us Political News

  
భారతీయ వంటింట్లో కొబ్బరి ప్రధాన ఆహార పదార్థం. కూరలో వేయడమే కాకుండా పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు .. ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వినియోగిస్తారు.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు,
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది.
జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి.
సాయంత్రం పూట వేడి వేడిగా కరకరలాడే స్ట్రీట్ స్టైల్ మసాలా వడలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ కోసం సింపుల్ టిప్స్.
మధుమేహం మరియు ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఊరటనిస్తూ, మందులు లేకుండానే రక్తంలోని చక్కెరను నియంత్రించే సూక్ష్మ ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ గురించి తెలుసుకోండి. స్విస్ పరిశోధకుల ఈ సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీ విశేషాలు.
గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులలో ఆరోగ్యానికి ఏది మంచిది? బరువు నియంత్రణ, డయాబెటిస్, ఎముకల బలం కోసం ఏ రొట్టె ఉత్తమమో పూర్తి పోషక విశ్లేషణ తెలుసుకోండి.
మార్కెట్ నుంచి ఎండిన బిర్యానీ ఆకులు కొనడం ఆపేయండి! కేవలం రూ.200 పెట్టుబడితో మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పైనే గుమగుమలాడే బిర్యానీ ఆకు మొక్కను ఎలా సులభంగా పెంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారపు అలవాట్లు, నీరు త్రాగే విధానం, వ్యాయామం మరియు నిద్రకు సంబంధించిన ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
నిద్రలేమి సమస్యను తగ్గించే పోషకాలు, పిప్పి పన్ను నొప్పికి తేనెతో ఇంటి చిట్కాలు మరియు 70% పచ్చి ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పండుగలు మరియు వివాహ వేడుకల వేళ మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్లలో ఏది ఉత్తమమో నిపుణుల సలహాలతో తెలుసుకోండి.
బొంబాయి రవ్వతో నోరూరించే జ్యూసీ రవ్వ లడ్డూలను పక్కా కొలతలతో, సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
విరిగిన పాల మీగడను వృథా చేయకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, రుచికరమైన దేశీ నెయ్యిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.