హైదరాబాద్ గతం.. అమరావతి భవిష్యత్.. చంద్రబాబునాయుడు

Publish Date:May 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. మంగళవారం అమరావతిలో బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్  యూనివర్శిటీ (బిసెర్ ) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి భవిష్యత్తుపై తనకున్న విజన్‌ను పంచుకున్నారు.

 పాతిక ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ కి ఈ సంస్థ పెద్దపీట వేయనుంది. రానున్న రోజుల్లో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చి..  వారిని అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మెడికల్, పారామెడికల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. 

అలాగే.. ఈ ప్రాజెక్టు గడువుపై స్పష్టమైన చంద్రబాబు నిర్దిష్ట గడువు నిర్దేశించారు.  వచ్చే ఏడాది మే నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేయాలని  యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల అనుమతులు  ఆటో పైలట్  మోడ్‌లో వేగంగా మంజూరు చేస్తామని,ఇన్వెస్టర్లు  పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.  గతంలో తాను హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ,  హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ..  అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు  చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులతో అమరావతి అంతర్జాతీయ పటంలో నిలుస్తుందన్నారు. 

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల కలలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు భవిష్యత్తులో ఈ నగరం ద్వారా అత్యధిక లాభం చేకూరుతుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని చంద్రబాబు అన్నారు.  

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్,  నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించడమే కాకుండా..  పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. యువత కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

అమరావతి గడ్డపై బిసెర్ వంటి విద్యా, వైద్య సంస్థలు రావడం శుభపరిణామమన్న సీఎం చంద్రబాబు.. ఈ ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా..  రాజధాని ప్రాంతం ఒక మెడికల్ టూరిజం హబ్‌గా మారుతుందని చెప్పారు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది.
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.