రాత్రంతా పార్లమెంటు ఆవరణలోనే ఎంపీలు.. తగ్గేదేలే!

Publish Date:Jul 27, 2022

Advertisement

రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన  ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ సహా 20 మంది ఎంపీలు సస్పెండైన సంగతి తెలిసిందే. సస్పెన్షన్లపై ఆయా పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా 48 గంటల నిరసనకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా   జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. రాత్రి పూట కూడా దీక్షను కొనసాగించారు. రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుటే బైఠాయించారు. రాజ్యసభలో టీఆర్ఎస్ సహా ఇతర విపక్షాలకు చెందిన 20 మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆయా పార్టీలు మండిపడ్డాయి.

కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అందరూ కలిసి 48 గంటల నిరవధిక ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేటి రాత్రి ధర్నాలో టీఆర్ఎస్ తరఫున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. రాత్రి అంతా విపక్షాల ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

విపక్ష ఎంపీలపై అప్రజాస్వామిక సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉభయ సభల్లో జీఎస్టీ, ధరల పెరుగుదల సహా ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.   అధిక ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారాలపై రాజ్యసభలో చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతించకుడా ప్రశ్నించే పార్టీలను బయటకు వెళ్లగొడుతోందని ఈ సందర్భంగా ఎంపీలు విమర్శించారు.

మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే పార్లమెంటు ఆవరణలోనే రాత్రి అంతా బైఠాయించామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. 

By
en-us Political News

  
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.