ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో, సరిగ్గా మూడేళ్ల కిందట   అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసింది. ఏడు పదుల వయస్సులో ఈ అరెస్టు సమయంలో చంద్రబాబు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందని చెప్పాలి. ఏకంగా 53 రోజుల పాటు ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో నిర్బంధించింది. ఐసోలేటెడ్ సెల్ లో, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించింది అప్పటి జగన్ సర్కార్. నాటి రోజులను తాజాగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికపై తనను అక్రమంగా అరెస్టు చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్టులో తనను అరెస్టు చేసిన తీరు దారుణమనీ పేర్కొన్న చంద్రబాబు.. అయితే ఈ ఘటన తనను ఏ మిత్రం కుంగదీయలేదన్నారు. తనను అరెస్టు చేయించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదన్న ఆయన అయితే తన విధానం అది కాదన్నారు.  తనను చాలా మంది మెతక అనీ, కఠిన నిర్ణయాలు తీసుకోలేని మృదు స్వభావిననీ చెబుతుంటారు.   కానీ వాస్తవానికి తాను చేసే  ప్రతి పనీ తెలుగు ప్రజల శ్రేయస్సు,  సమాజ హితం కోసమే ఉండాలి అని భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే  సవాళ్లు విసురుకోవడం, తొడలు కొట్టుకోవడం కాదన్నారు. అలాగే   ఎన్నికల ఫలితాల ఆధారంగా ఒకరినొకరు అరెస్టు చేయించుకోవడం కూడా కాదన్నారు.  తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక హితం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు.  [Chandrababu Naidu, AP Politics, YS Jagan Mohan Reddy, Revenge Politics, Telugu Desam Party, Andhra Pradesh News, Telugu One]
తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు.  జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు.  జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.  [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.       (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)
ALSO ON TELUGUONE N E W S
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన బ్యూటిఫుల్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర, సీనియర్ యాక్టర్ సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపించి ఆడియన్స్‌ని కట్టిపడేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ సొంతం చేసుకుని, ఊహించని రేంజ్ లాభాలను మేకర్స్ కి అందించి ఈ ఏడాది సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు థియేటర్లలో అలరించిన ఈ ఎమోషనల్ రైడ్ డిజిటల్ స్క్రీన్స్ మీదకి ఎప్పుడు రాబోతోంది అనే దానిపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ సెప్టెంబర్ 18 నుంచి 'ఇరుముడి' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రటన రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు, అలాగే మళ్లీ మళ్లీ ఈ ఎమోషనల్ డ్రామాను చూడాలనుకునేవారికి సెప్టెంబర్ 18 బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.       [Ravi Teja Irumudi, Irumudi OTT, Irumudi Netflix, Ravi Teja, Shiva Nirvana, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]  
'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ ఇన్‌సైడ్ టాక్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకొని వెళ్తుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. కథను చాలా గ్రిప్పింగ్‌గా, ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ నడిపించిన తీరు సూపర్ అని టాక్ వస్తోంది. ప్రతి సీన్ ప్రేక్షకులను సినిమాలో మమేకం చేసేలా డిజైన్ చేశారట. అసలు అసలైన మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్స్ ఏంటంటే... ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్. ఇవి రెండూ వేరే లెవెల్‌లో ఉండబోతున్నాయట. ఈ రెండు ఎపిసోడ్స్ థియేటర్లలో ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయం. ఈ పార్ట్స్ చూస్తున్నంతసేపు థియేటర్లో సీటు అంచున కూర్చోవాల్సిందే. ఆ రేంజ్ హై-వోల్టేజ్ డ్రామా, మాస్ ఎలివేషన్స్ ఇందులో దాగున్నాయట. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ కంప్లీట్ చేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం సెకండాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఇచ్చే బిజిఎమ్ వల్ల ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందని టీమ్ ధీమాగా ఉంది. అనిరుధ్ మ్యూజిక్ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరో బిగ్ న్యూస్ ఏంటంటే.. నిన్నటితో ఈ సినిమా టోటల్ షూట్ సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ అయింది. చివరి షాట్ వరకు పర్ఫెక్షన్ కోసం టీమ్ ఎంతగానో కష్టపడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రన్‌టైమ్ వచ్చేసి దాదాపు 2 గంటల 40 నిమిషాలు ఉండబోతోంది. పర్ఫెక్ట్ లెంగ్త్‌లో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా, ఫుల్ పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి డైరెక్టర్ శ్రీకాంత్ పక్కా ప్లాన్‌తో వస్తున్నాడని టాక్.       [The Paradise Movie, Natural Star Nani, Srikanth Odela, Anirudh Ravichander, Telugu Film News, Tollywood News, Telugu News]  
As audiences gain access to more entertainment than ever before, Zee 5 is redefining how they discover and experience entertainment. Building on its expanded content proposition, the platform is unveiling one of its most defining transformations yet – a bold, ground-breaking revamp across Mobile and Connected TV, powered by smarter personalisation, AI-led discovery, richer visual navigation and a seamless cross-screen experience. Designed around the audiences’ watch rhythm, the new Zee 5 opens doors to five distinct universes – Premium Entertainment, Free 5, KidZ, TV and Sports – making discovery intrinsically intuitive, immersive and effortless. Because as India’s watch pattern evolves, so does the experience of discovering entertainment. Personalisation sits at the heart of the new experience, helping audiences discover content that is most relevant to their interests, whereas the AI add-on enables smarter discovery and smoother interactions across the platform. With audiences increasingly consuming entertainment across connected devices alongside mobile, the new experience has been designed to move seamlessly between the small and big screen. Taking convenience a step further is a next-generation AI-powered customer support assistant feature, that delivers intelligent, near-instant resolution across subscriptions, playback, access, content and devices. Alongside these features, Zee 5 is also taking advanced steps to strengthen data privacy, supported by safeguards that are best-in-class and category-leading. Together, these innovations, bundled together, set a new benchmark for a faster, smarter and more effortless entertainment experience. To build the new experience, Zee 5 delved deeper into understanding how audiences across India watch, discover and engage with entertainment. Combining existing app feedback with consumer studies and focus group discussions across markets, the platform mapped audience journeys across mobile and Connected TV. The research highlighted the need for a simpler, more intuitive experience without compromising the richness and immersion of the big-screen experience. These insights shaped the redesign, while intensive Bugathons brought together experts across product, engineering, quality assurance and design to rigorously test, refine and fine-tune every aspect of the platform before launch. Over the last quarter, Zee 5 has significantly expanded its diverse content offering, first by securing the rights to the global sporting event, FIFA World Cup 2026™ and 2030, followed by the launch of its content slate across seven languages. Building on this momentum, Zee 5 is now unveiling an unprecedented premium English entertainment slate, bringing an extraordinary line-up of global cinema and some of the biggest names in Hollywood to audiences. Through strategic collaborations with PVR INOX PICTURES and LIONSGATE PLAY, the ambitious slate brings together Digital Premieres that includes Normal, featuring Bob Odenkirk, Henry Winkler and Lena Headey; The Invite, featuring Seth Rogen, Penélope Cruz, Edward Norton and Olivia Wilde; Anxious People, starring Angelina Jolie and Jason Segel; Babies featuring Seth Rogen and Anna Kendrick; The Wizard of the Kremlin, starring Jude Law; How to Make a Killing, starring Glen Powell and Margaret Qualley; Tony, featuring Dominic Sessa; and Paper Tiger, starring Adam Driver, Scarlett Johansson and Miles Teller. With its unprecedented breadth of marquee talent, global stories and premium cinema, the slate marks a bold new chapter in Zee 5’s English entertainment offering. Simultaneously, Free 5 is being reimagined with a bold new identity in one of its most expansive entertainment propositions yet. The all-new Free 5 brings together an unparalleled breadth of entertainment – Series, Movies, Korean and Chinese dramas, anime, news, micro dramas and the vibrant creator ecosystem. With more languages, genres, formats and voices than ever before, the refreshed Free 5 gives audiences an expansive world of entertainment to discover, explore and enjoy – completely free, without any need of a subscription. This expanded proposition also opens up significant new opportunities for advertisers to connect with and cater to a wide spectrum of audiences on Zee 5. Tejkarran Singh Bajaj, Business Head - Zee 5 India and AI & Innovation said, “The next phase of Zee 5 is about making entertainment easier to discover, more relevant and more rewarding. We have reimagined the product experience across mobile and Connected TV, with smarter personalisation, deeper use of AI and more intuitive discovery. In addition to the platform’s existing offering of premium movies and series across seven languages, rich television content, sports, kids’ entertainment, Live TV and news, we are now expanding the depth of content with an English slate bringing global cinema to Indian audiences, alongside a revamped Free 5 with more languages, genres and the creator ecosystem. For advertisers, this breadth creates a richer canvas to connect with distinct audience cohorts across languages, content genres and viewing occasions. Together, our product and content evolution gives audiences more choice, more depth and a simpler way to find what they love.” Pramod Prakash, Chief Technology Officer, Zee Entertainment Enterprises Ltd., said, “A streaming platform is experienced through hundreds of small interactions, and each of those interactions shapes how audiences feel about the service. Our focus was therefore to look beyond individual features and rethink the experience as a whole, identifying where the journey could feel more natural, more responsive and less demanding for the user. At the heart of this is an intuitive and easy-to-use app that gives every generation in the family simple access to the entertainment they love. The revamp reflects a simple product philosophy: technology should quietly remove friction and allow the entertainment to take centre stage. As viewing becomes increasingly distributed across devices, formats and contexts, we are building Zee 5 to be more adaptive, dependable and ready for the way audiences will consume entertainment next.”   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
టాలీవుడ్‌లో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధిస్తే, అదే బాటలో మిగతా దర్శకనిర్మాతలు కూడా నడవడం ఇండస్ట్రీలో సాధారణమే. కన్నడలో వచ్చిన 'కాంతార' చిత్రం సంచలన విజయం సాధించిన తర్వాత, దేశవ్యాప్తంగా సినిమాల్లో దైవిక అంశాలు (Divine Touch) జోడించే ట్రెండ్ ఊపందుకుంది. పూర్తి స్థాయి పౌరాణిక చిత్రాలే కాకుండా, కమర్షియల్ కథలకు హిందూ పురాణాలు, దేవుళ్ల నేపథ్యాలను అల్లుతూ తెరకెక్కిస్తున్న చిత్రాల సంఖ్య టాలీవుడ్‌లో గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు అంతా ఇదే ఫార్ములాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోయే పాన్-ఇండియా చిత్రాల్లోనూ రామాయణ ఇతిహాస పోరాటాలు, కాల ప్రయాణం (Time-travel) వంటి వినూత్న అంశాలు ఉంటున్నాయి. అలాగే, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం దేవతల సేనాధిపతి అయిన కుమారస్వామి (కార్తికేయ) కథాంశం ఆధారంగా ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా, ప్రశాంత్ వర్మ వంటి సృజనాత్మక దర్శకులు కూడా పురాణాల స్ఫూర్తితో సరికొత్త సినిమా యూనివర్స్‌ను సృష్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల విడుదలవుతున్న 'నాగబంధం' వంటి చిత్రాలు అనంత పద్మనాభ స్వామి ఆలయం, దైవిక శక్తుల చుట్టూ తిరిగే కథలతో వస్తుండగా, రవితేజ 'ఇరుముడి' చిత్రం అయ్యప్ప దీక్ష తదితర భక్తి భావాలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతోంది. అయితే, సినిమాల్లో దైవిక అంశాలు ఉండటం మంచిదే అయినప్పటికీ, వరుసగా ప్రతీ సినిమాలోనూ అవే మూలాలు పునరావృతమైతే ప్రేక్షకులు విసిగిపోయే ప్రమాదం ఉందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ కథలోనైనా భావోద్వేగాలు, బలమైన నరేషన్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని, కేవలం భక్తి లేదా దైవిక టచ్‌ను నమ్ముకుంటే సరిపోదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, టాలీవుడ్ మేకర్స్ రొటీన్ కథలకు భిన్నంగా పురాణాలు, ఇతిహాసాలు మరియు దైవిక నేపథ్యాల వైపు అడుగులు వేస్తుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ట్రెండ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది రాబోయే చిత్రాల విజయంపై ఆధారపడి ఉంటుంది.
టాలీవుడ్‌లో తండ్రి కూతుళ్ల బంధాన్ని వెండితెరపై చూపించడం కొత్తేమీ కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఎన్నో సినిమాలు ఈ ఎమోషనల్ సెంటిమెంట్‌తో వచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. మధ్యలో కొంతకాలం ఈ ట్రెండ్ కాస్త తగ్గినట్లు అనిపించినా, ఇప్పుడు మళ్లీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫార్ములాగా రూపాంతరం చెందింది. దానికి తాజా ఉదాహరణే 'ఇరుముడి'. ఈ సినిమాలో త్రినాథ్ - మణమ్మల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ, బేబి నక్షత్రల అద్భుతమైన నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఎంతలా అంటే.. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 250 కోట్ల వసూళ్లు సాధించి రికార్డులను తిరగరాసింది. గతంలో వచ్చిన అనేక చిత్రాలు కూడా ఇదే ఎమోషన్‌తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. 'హాయ్ నాన్న' సినిమాలో చిన్నారి మహిని కాపాడుకోవాలని తపించే తండ్రి పాత్రలో నాని ఒదిగిపోయిన తీరు అందరినీ కంటితడి పెట్టించింది. 2023లో వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇక అదే ఏడాది వచ్చిన 'భగవంత్ కేసరి'లో పెంచుకున్న కూతురిని ఆర్మీ ఆఫీసర్‌గా చూడాలనే లక్ష్యం కోసం శ్రమించే పవర్ ఫుల్ ఫాదర్‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ మెప్పించారు. గతంలో రవితేజతో దర్శకధీరుడు రాజమౌళి తీసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'విక్రమార్కుడు' కూడా డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్‌తో ముడిపడిన కథే. అలాగే వెంకటేష్ నటించిన థ్రిల్లర్ 'దృశ్యం' కూడా కూతురి కోసం ఒక తండ్రి పడే తపన, ఆరాటం చుట్టూనే తిరుగుతుంది. కూతురు వల్ల జరిగిన తప్పును కప్పిపుచ్చేందుకు ఒక తండ్రి చేసే పోరాటం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'కాకా'పై పడింది. ఈ సినిమాలో కూడా డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్‌ను ఎమోషనల్‌గా చూపించబోతున్నారట. గతంలో చిరంజీవి తండ్రి-కూతురు సెంటిమెంట్‌తో చేసిన 'డాడీ' చిత్రం ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరి రాబోయే 'కాకా' సినిమాతో మెగాస్టార్ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారేమో చూడాలి.       [Father Daughter Sentiment, Telugu Movies, Ravi Teja, Irumudi Movie, Kaaka Movie, Megastar Chiranjeevi, Nandamuri Balakrishna, Telugu Film News]  
శ్రీమతి వేదుల బాలకామేశ్వరి సమర్పణలో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’. ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఫస్ట్ బెంచ్‌లో మొదలైన ప్రేమ.. చివరికి వారి జీవితాలనే మార్చిన కథ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక విద్యా విధానంలో ర్యాంకుల కోసం పోటీ, యువతి, యువకుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు.. ఈ gen-z తరం క్షణిక ఆనందాలు, భావోద్వేగాలు, తొలి ప్రేమ మరోవైపు.  ఇద్దరు టాప్ ర్యాంకర్స్ మధ్య మొదలైన ఈ ప్రేమ, వారి చదువు, భవిష్యత్తు, కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపింది? ప్రేమ తర్వాత వారి జీవితాల్లో వచ్చిన అలజడి ఎక్కడికి దారితీసింది అనే ఎమోషనల్ జర్నీ. ప్రతి ఒక్కరి కాలేజ్ రోజులను, వారి తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే.. యువత ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం మధ్య జరిగే సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా చూపించే చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ అని మూవీ టీం చెబుతోంది.     [First Bench Premakatha, V Vijayendra Prasad, Telugu Cinema, Telugu Film News, Tollywood]  
    నాచురల్ స్టార్ నాని రేంజ్ ని మరింతగా ఎలివేట్ చేయబోతున్న మూవీగా అభిమానుల్లో , ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంది ది ప్యారడైజ్'.  ఏ మాటకా మాట ప్రచార చిత్రాలైతే అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. పైగా నానితో దసరా నిర్మించిన నాని ఓదెల దర్శకుడు. మరి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.  సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానున్న ఈ చిత్రానికి, ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబరు 23న నార్త్ అమెరికాలో గ్రాండ్ ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ చేసారు. ఇప్పుడు  అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే  ప్యారడైజ్' సృష్టించిన సంచలనం చూసి సినీ ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కేవలం బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే 5000 టికెట్స్ సోల్డ్ అయ్యి  $100K (లక్ష డాలర్లు) ప్రీ-సేల్స్ పూర్తి చేసుకుని నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ అరుదైన మైలురాయిని కేవలం సీనిమార్క్ (Cinemark) థియేటర్ నెట్‌వర్క్ నుంచే సాధించడం నాని ఓవర్సీస్ మార్కెట్ స్టామినాని  మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.   Also Read: Sardar 2: హైలెట్స్ ఇవే.. ఇక లైఫ్ లో వాటి జోలికి వెళ్ళమంటున్న ప్రేక్షకులు! ఇప్పుడు ఆ ఊపు మరింత పెరిగి, నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ మార్కెట్‌లో 'ది ప్యారడైజ్' మూవీ $150K డాలర్ల ఘనమైన మార్క్‌ను మరిన్ని గంటల్లో దాటబోతుంది.ఈ గణాంకాలు చూస్తుంటే ప్రీమియర్ షోల సమయానికి ఈ కలెక్షన్లు ఊహించని స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ పాన్-ఇండియా హీరోల సినిమాలకు లభించే రేంజ్ రెస్పాన్స్, నాని నటించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి  దక్కడం విశేషం.     [Nani, The Paradise, Srikanth Odela, Keerthi Suresh, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News[    
తారాగణం: మాధవ్ భూపతిరాజు, దీపా బాలు, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, రూపలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, బిప్రదీప్ దత్తా డీఓపీ: ప్రశాంత్ అంకిరెడ్డి ఎడిటర్: సాయి బాబు తలారి దర్శకత్వం: మంచాల నాగరాజు నిర్మాత: మయూర్ రెడ్డి బండారు విడుదల తేదీ: సెప్టెంబర్ 10, 2026 మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతూ నటించిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'మారెమ్మ'. మంచాల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా రూరల్ కల్చర్, అమ్మవారి జాతర, జంతు బలిదానం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన 'మారెమ్మ' సినిమా మెప్పించిందా? మాధవ్ డెబ్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: తెలంగాణలోని మహిషాపురం అనే ఒక గ్రామంలో జరిగే 'మారెమ్మ' అమ్మవారి జాతర నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆ ఊరిలో ప్రతి ఏటా అమ్మవారికి ఓ దున్నపోతుని బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి హీరో కర్ణి(మాధవ్ భూపతిరాజు) పెంచుకున్న దున్నపోతుని జాతరలో బలి ఇవ్వడానికి ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. తీరా బలి ఇచ్చే సమయానికి ఆ పవిత్రమైన దున్నపోతు ఊహించని విధంగా మాయమవుతుంది. అసలు ఆ దున్నపోతు ఎక్కడికి వెళ్లిపోయింది? అది మళ్ళీ దొరికిందా లేదా? బలి జరగకపోతే ఊరికి ఏమైనా ముప్పు వాటిల్లుతుందా? ఆ ముప్పు నుంచి బయటపడటానికి ఊరి ప్రజలు, హీరో ఏం చేశారు అనేదే ఈ 'మారెమ్మ' చిత్ర కథ. విశ్లేషణ: 'మారెమ్మ' కథ విన్నప్పుడు మలయాళ మూవీ 'జల్లికట్టు' కథ గుర్తుకు రావడం సహజం. అందులో కూడా తప్పిపోయిన దున్నపోతుని వెతికే పనిలో ఊరంతా ఉంటుంది. అయితే ఆ కథ వేరే వెర్షన్ లో నడుస్తుంది. దున్నపోతు మిస్సింగ్ పాయింట్ ను మాత్రమే తీసుకొని, దానికి దైవత్వాన్ని జోడించి.. ఈ 'మారెమ్మ' కథ రాసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఇలా తెలంగాణ నేపథ్యంలో, ఈ తరహా కథతో ఇప్పటికే 'పొట్టేల్' అనే సినిమా వచ్చింది. అందులో కూడా గ్రామ దేవతకు బలివ్వడం కోసం ఉంచిన ప్రత్యేకమైన పొట్టేల్‌ (గొర్రె) కనిపించకుండా పోతుంది. ఆ సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ, 'మారెమ్మ'లో మాత్రం ఎమోషన్స్ పండలేదు. తెలంగాణ నేటివిటీని, స్థానిక ఆచార వ్యవహారాలను, అలాగే జానపద పాటలను ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు బాగానే ప్రెజెంట్ చేశాడు. అయితే, ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్.. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టత లేకపోవడమే. జంతు బలుల గురించి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకున్నారా లేక ఒక విలేజ్ రివెంజ్ డ్రామా చూపించాలనుకున్నారా అనేది క్లారిటీ లేకుండా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా తప్పిపోయిన దున్నపోతుని వెతికే క్రమంలోనే నడుస్తుంది. కానీ అక్కడ స్క్రీన్‌ప్లే చాలా చప్పగా, ఎలాంటి ఎమోషన్ లేదా గ్రిప్పింగ్ మూమెంట్స్ లేకుండా బోర్ కొట్టిస్తుంది. దీనికితోడు, విలన్ ట్రాక్ మొత్తం చాలా పేలవంగా డిజైన్ చేశారు. మధ్యలో వచ్చే చేతబడి ఎపిసోడ్లు కూడా కథకి ఎలాంటి ప్లస్ కాలేకపోయాయి. హీరో క్యారెక్టర్ ని, దున్నపోతుతో అతనికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని ఇంకాస్త లోతుగా బిల్డ్ చేసి ఉంటే అవుట్‌పుట్ వేరేలా ఉండేది.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: డెబ్యూ హీరోగా మాధవ్ భూపతిరాజు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఊరి కుర్రాడిగా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ సహజంగా ఉన్నాయి. మొదటి సినిమానే అయినా ఎక్కడా తడబడకుండా చాలా సిన్సియర్‌గా పెర్ఫార్మ్ చేశాడు. అలాగే హీరోయిన్ దీపా బాలు కూడా పల్లెటూరి అమ్మాయిగా డిసెంట్ లుక్స్, నటనతో మెప్పించింది. ప్రశాంత్ విహారి, బిప్రదీప్ దత్తా అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తాయి. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే..  మాధవ్ భూపతిరాజు తన వంతుగా కష్టపడినప్పటికీ.. వీక్ స్క్రీన్ ప్లే, క్లారిటీ లేని డైరెక్షన్ వల్ల 'మారెమ్మ' ఒక డిజప్పాయింటింగ్ రూరల్ డ్రామాగానే మిగిలిపోయింది.   రేటింగ్: 2/5   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.     [Maremma Review Telugu, Maremma Movie Review, Maremma Review Rating, Maadhav Bhupatiraju, Raviteja, Telugu Movie Review, Telugu Cinema Review, Telugu Film News]  
  స్టార్ హీరో కార్తీ,  పీఎస్ మిత్రన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులకి, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ చెప్తూ థియేటర్స్ లోకి వచ్చేసింది  మొదటి భాగంలో వాటర్ మైనింగ్ అనే సామాజిక సమస్యని  ముడిపెట్టి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్, ఈ సీక్వెల్‌లో భారతదేశ భద్రతతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అతిముఖ్యమైన 'యాంటీబయాటిక్స్ మితిమీరిన వాడకం' అనే  పాయింట్‌ని కూడా చెప్పడం జరిగింది.  మరి మూవీ చూసిన ప్రేక్షకులు కొన్ని హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం 1 .సర్దార్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్  2 . ఫస్ట్ హాఫ్  3 . మిషన్ డోకు వెనక ఉన్న పర్పస్  4 . యాక్షన్ సీక్వెన్స్  5 . ప్రతి సీన్ ని అద్భుతంగా మలిచిన దర్శకత్వ ప్రతిభ  6 . కార్తీతో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్  7 . అబ్బురపరిచే ఫొటోగ్రఫీ      Also Read: Sardar 2 : తెలుగులో నెగిటివ్ టాక్ నడుస్తుందా? తమిళనాడులో పరిస్థితి ఏమిటి? ఈ విధమైన హైలెట్స్ ని మూవీ చూసిన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది  సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు 'మనం తినే నాన్ వెజ్( చికెన్) కి సంబంధించి  వయసు పెరగని కోళ్ళని ఇంజక్షన్స్ ఇచ్చి వయసు ఎలా పెంచుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న వాటికి కూడా కొన్ని కంపెనీల  టాబ్లెట్స్ వాడుతూ ఎలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామో క్లియర్ గా మూవీలో చెప్పారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నారు. కొంత ముందైతే లైఫ్ లో వాటి జోలికి వెళ్ళమని కూడా  చెప్తున్నారు.        [Sardar 2 , Karthi, Sardar 2 Review, Chiken, Anti Biotic, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
Cast: Karthi, Malavika Mohanan, Ashika Ranganath, S. J. Suryah, Nassar, Achyuth Kumar, Ashish Vidyarthi, Yogi Babu Crew: Written & Directed by P. S. Mithran Cinematography by George C. Williams Music by Sam CS Editing by Vijay Produced by Lakshman Kumar, Ishan Saxena Karthi arrived in theaters today with the highly anticipated Sardar 2. It is the direct sequel to his 2022 blockbuster Sardar. Let us discuss the film in detail to see how it fares. Plot: During World War II, under a mission named 'Mission Doku', Japan selects India as an exchange location to transfer a highly dangerous weapon named 'Doku' to another country. However, during the exchange process, the weapon accidentally falls within Indian borders. The Indian government goes into a state of panic regarding the safety of its citizens, as 'Doku' is considered the most dangerous weapon in the universe, capable of wiping out all of mankind. What exactly is the threat posed by Doku? Did that disaster occur, and if not, who stopped it and how? Finally, how are the characters of Sardar (Karthi), Vijay (Karthi), and Yoganand (S. J. Suryah) connected to Mission Doku? The movie answers all these questions.   Analysis: Executing this kind of story requires a lot of intelligence, great locations, high production values, and immense dedication from the cast. Fortunately, this film has all of those elements. However, once the core motive of the story is revealed, it instantly reminds the audience of the Corona pandemic. Since we have already seen films based on that concept, it feels a bit repetitive. But to its credit, the movie does not bore you at any point. Moreover, the discussions regarding the usage of antibiotic tablets in our daily lives along with non-vegetarian food are thought-provoking. In the first half, the scenes generate good curiosity right from the start. The sequences featuring Vijay, Yogi Babu, and Nizhalgal Ravi work well, though the episode where Vijay discovers that Sardar is still alive could have been executed much better. The scenes involving Zara (Malavika Mohanan), the step-by-step narration of the flashback, and the teamwork episodes are highly engaging. Sardar's entire flashback portion is mind-blowing, and the action blocks in this sequence are on another level. S. J. Suryah’s introduction as Yoganand is superb, and the interval bang is decent. The second half moves at a very fast pace. Since the narrative shifts completely into an action mode, the makers succeeded in building suspense about what happens next. A standout moment is when Yoganand explains health secrets to Yogi Babu and Nizhalgal Ravi; it is highly impactful and serves as an eye-opener. While the pre-climax portions work out well, the crucial decision taken by Vijay in the climax should have ideally been taken by Sardar, or at least executed by Sardar under emotional circumstances. Karthi impresses once again in his dual roles as Sardar and Vijay, with the younger Sardar's performance being a major highlight. Malavika Mohanan, Ashika Ranganath, Achyuth Kumar, Nassar, and the rest of the cast perform strongly in their respective roles. S. J. Suryah in his negative role displays his acting prowess brilliantly yet again. P. S. Mithran succeeds completely as a director, though the dialogue writing is weak. The cinematography and grand production values stand out as the film's main strengths. The sole song in the film is just average, and the background score by Sam CS is strictly okay.   Positives: Fast-paced Screenplay Performances of Karthi and all other artists Direction High Production Values Negatives: Core Story (feels repetitive) Climax sequence. Action Sequences Predictability in Second Hour   Bottomline: Karthi and the makers have put in a lot of hard work to ensure Sardar 2 is an engaging watch without any boring moments.   Rating: 2.25/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనలో చాలామంది చిన్నతనంలో ప్రభుత్వం ఇచ్చే టీకాలు లేదా తల్లిదండ్రులు వేయించే వ్యాక్సిన్లు వేసుకుంటే సరిపోతుందని, ఇక జీవితాంతం ఎలాంటి తీవ్రమైన వ్యాధులు రావని భావిస్తుంటారు. చిన్నతనంలో తీసుకునే టీకాలు అనేక ప్రాణాంతక రోగాల నుండి ప్రారంభ రక్షణ ఇచ్చినప్పటికీ, కాలక్రమేణా వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలోని రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంటుంది. దీనివల్ల చిన్నప్పుడు పొందిన రోగనిరోధక రక్షణ కాలక్రమేణా క్షీణించిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, కొన్ని రకాల వ్యాధులను నిరోధించడానికి లేదా బూస్టర్ రక్షణ పొందడానికి పెద్దయ్యాక కూడా కొన్ని టీకాలు తీసుకోవడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ తీసుకోని వారు, లేదా బూస్టర్ డోసులు మిస్ అయినవారు తమ వయస్సు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, దీర్ఘకాలిక వ్యాధులను బట్టి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెద్దవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 6 అత్యంత కీలకమైన వ్యాక్సిన్ల వివరాలు ఇవే. మొదటిది టెటనస్ బూస్టర్ డోస్. చిన్నతనంలో టెటనస్ వ్యాక్సిన్ సిరీస్ తీసుకున్నప్పటికీ, పెద్దయ్యాక ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి టెటనస్ లేదా Tdap బూస్టర్ డోస్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పదునైన ఇనుప వస్తువులు గుచ్చుకున్నప్పుడు, కాలిన గాయాలైనప్పుడు, లేదా మట్టి, జంతువుల వ్యర్థాలతో సంబంధం ఉన్న పనులు చేసేటప్పుడు టెటనస్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది. గతంలో టీకా ఎప్పుడు తీసుకున్నారో గుర్తులేకపోతే వెంటనే డాక్టర్ ని సంప్రదించి బూస్టర్ డోస్ పొందడం సురక్షితం. రెండవది హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఈ హెపటైటిస్ బి వైరస్ రక్తం, కలుషితమైన సూదులు, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి కాలేయ సిర్రోసిస్ మరియు కాలేయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారితీస్తుంది. చిన్నతనంలో హెపటైటిస్ బి టీకా పూర్తి చేయని పెద్దలు తప్పక వైద్యుడిని సంప్రదించి యాంటీ హెచ్‌బీఎస్ (Anti HBs) రక్త పరీక్ష ద్వారా తమ బాడీలోని రోగనిరోధక స్థాయిలను అంచనా వేసుకుని టీకా డోసులు పూర్తి చేయాలి. మూడవది న్యూమోకోకల్ వ్యాక్సిన్. న్యూమోకోకల్ బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా మరియు మెదడువాపు వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, మధుమేహం (షుగర్), దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, లేదా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల న్యుమోనియా తీవ్రత నుంచి రక్షణ పొందుతారు. నాల్గవది ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిన ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్. ప్రతి ఏడాది ఫ్లూ వైరస్ తన రూపాంతరాన్ని మార్చుకుంటూ ఉంటుంది, అందువల్ల ప్రతి ఏటా కొత్త ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిని తీవ్ర అనారోగ్యం పాలవ్వకుండా మరియు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఐదవది హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) వ్యాక్సిన్. ఇది కేవలం టీనేజ్ బాలికలకే కాకుండా, గతంలో టీకా తీసుకోని 26 నుండి 45 సంవత్సరాల లోపు పెద్దలకు కూడా వైద్యుల సలహాతో అందించవచ్చు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) తో పాటు ఇతర రకాల క్యాన్సర్లను అరికట్టడంలో ఈ HPV వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆరవది వరిసెల్లా వ్యాక్సిన్ (చికెన్ పాక్స్ టీకా). చిన్నతనంలో చికెన్ పాక్స్ (ఆటలమ్మ) రాని పెద్దలకు వరిసెల్లా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలతో పోలిస్తే పెద్దవారికి చికెన్ పాక్స్ వస్తే న్యుమోనియా, మెదడు వాపు వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ మరియు కాంప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చిన్నప్పుడు చికెన్ పాక్స్ రానివారు వరిసెల్లా 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. వయస్సు పెరిగే కొద్దీ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి సరైన సమయంలో టీకాలు వేయించుకోవడం ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో అవసరం.     Adult vaccination guide tetanus, flu, HPV telugu,6 important vaccines for adult health tips.
  మన భారతీయ సాంప్రదాయ భోజనంలో పెరుగు లేకపోతే ఆ విందు పూర్తయినట్లు అనిపించదు. ఎంతటి ఘుమఘుమలాడే వంటకాలు, నోరూరించే కూరలతో అన్నం తిన్నా కూడా చివర్లో కాస్త కమ్మటి పెరుగు వేసుకొని తింటేనే ప్రశాంతత, తృప్తి లభిస్తాయి. వేడి వేడి అన్నంతో తిన్నా లేదా ప్రసిద్ధ చద్దన్నంలో కలుపుకొని తిన్నా పెరుగు ఇచ్చే రుచే వేరు. పెరుగులో ఉండే మేలు చేసే మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) మన జీర్ణవ్యవస్థ పనితీరును అద్భుతంగా మెరుగుపరచడమే కాకుండా మన పేగుల ఆరోగ్యానికి సాక్షాత్తు అమృతంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే, మనలో చాలామంది రోజూ తెలియకుండా చేసే ఒక చిన్న పొరపాటు వల్ల ఈ అమృతం కాస్తా శరీరానికి కీడు చేసే పదార్థంగా మారిపోతోంది. మనం సాధారణంగా తోడుపెట్టిన పెరుగు పాడవకుండా లేదా అతిగా పులిసిపోకుండా ఉండటానికి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుతుంటాం. అయితే, ఆకలి వేసినప్పుడు లేదా భోజనం చేసే సమయంలో ఫ్రిజ్ లోంచి తీసిన వెంటనే బాగా చల్లగా ఉన్న పెరుగును నేరుగా తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తరంగ్ కృష్ణ గారి కథనం ప్రకారం, ఫ్రిజ్ అనేది కేవలం మనం వండుకున్న ఆహారాన్ని పాడవకుండా నిల్వ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ దానిలోని పోషక విలువలను లేదా నాణ్యతను పెంచదు. ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే విపరీతమైన చల్లదనంతో ఉండే పెరుగును తినడం వల్ల మన కడుపులోని జీర్ణక్రియ వేగం ఒక్కసారిగా మందగిస్తుంది. పురాతన వైద్య విధానమైన ఆయుర్వేదం ప్రకారం, చల్లటి పదార్థాలను అరగించుకోవడం జీర్ణవ్యవస్థకు చాలా కష్టమైన పని. ఇది శరీరంలో కఫ దోషాన్ని అమాంతం పెంచి శ్వాసకోశ సంబంధిత సమస్యలకు, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులకు దారితీస్తుంది. అంతేకాకుండా, పలు శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం పెరుగులో ఉండే అత్యంత ప్రయోజనకరమైన మంచి బ్యాక్టీరియా చురుకుదనం అనేది ఉష్ణోగ్రత ఆధారంగా మారుతుంటుంది. అతి చల్లటి వాతావరణంలో ఆ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. కేవలం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈ మంచి బ్యాక్టీరియా 100 శాతం చురుగ్గా మారి మన కడుపుకి పూర్తి స్థాయిలో మేలు చేస్తుంది. అందుకే పెరుగులోని పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి కొన్ని కీలక సూత్రాలను పాటించడం చాలా అవసరం. మీరు భోజనం చేయడానికి కనీసం 30 నిమిషాల (అరగంట) ముందే పెరుగు గిన్నెను ఫ్రిజ్ లోంచి బయటకు తీసి పక్కన పెట్టాలి. అది సాధారణ గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అలాగే పెరుగును రోజూ పగటిపూట లేదా మధ్యాహ్నం వేళల్లో మాత్రమే తీసుకోవడం అత్యుత్తమమైన పద్ధతి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపులో మంటను తగ్గించి చల్లబరుస్తుంది. ఇంకా అదనపు రుచి, జీర్ణ ప్రయోజనాల కోసం పెరుగులో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి లేదా చిటికెడు నల్ల మిరియాల పొడి కలుపుకొని తినవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెరుగు తినే అలవాటును పూర్తిగా మానుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల శ్లేష్మం విపరీతంగా పేరుకుపోవడంతో పాటు తీవ్రమైన జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజూ తాజాగా తోడుపెట్టుకున్న కమ్మటి పెరుగును మాత్రమే తీసుకోవడం వల్ల ఎసిడిటీ రాకుండా మన శరీరం నిరంతరం ఆరోగ్యంగా ఉంటుంది.       Is cold curd harmful for digestion telugu, Ayurveda rules for eating curd right way.
  మహిళల సౌందర్య సంరక్షణలో లిప్‌స్టిక్‌కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆఫీస్, శుభకార్యాలు, గ్రాండ్ పార్టీలు లేదా క్యాజువల్ అవుటింగ్స్.. సందర్భం ఏదైనా సరే పెదాలకు కాస్త రంగు అద్ది లిప్‌స్టిక్ వేసుకుంటే వచ్చే ఆకర్షణీయమైన లుక్ వేరు. ఎంత మేకప్ వేసుకున్నా చివరికి లిప్‌స్టిక్ లేకపోతే ముఖంలో ఏదో వెలితిగానే కనిపిస్తుంది. అయితే రోజూ లిప్‌స్టిక్ వాడటం వల్ల పెదాలు తమ సహజ సిద్ధమైన తేమను కోల్పోయి పొడిబారిపోతాయని, క్రమంగా నల్లగా మారిపోతాయని చాలామంది మహిళల్లో తీవ్రమైన ఆందోళన, సందేహాలు నెలకొన్నాయి. ప్రతిరోజూ కాస్మెటిక్స్ వాడటం చర్మానికి మరియు పెదాల ఆరోగ్యానికి సురక్షితమేనా అనే సందేహాలు నిత్యం ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అయితే బ్యూటీ మరియు చర్మ సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం లిప్‌స్టిక్ వాడటం వల్ల మాత్రమే పెదవులు పొడిబారవు లేదా రంగు మారవు. మనం ఎంచుకునే ఉత్పత్తుల నాణ్యత, ఎంపికలో చేసే పొరపాట్లు మరియు మన జీవనశైలే దీనికి ప్రధాన కారణాలు. ప్రతి లిప్‌స్టిక్ పెదవులను దెబ్బతీయదని చర్మ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మీరు ఎలాంటి ప్రొడక్ట్ ఎంచుకుంటున్నారు అనే దానిపైనే అధరాల ఆరోగ్యం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. చాలామంది ఆధునిక మ్యాట్ లిప్‌స్టిక్‌లు వాడటానికి ఇష్టపడతారు. సాధారణంగా నాణ్యమైన మ్యాట్ లిప్‌స్టిక్‌లలో విటమిన్ E మరియు హైలురోనిక్ యాసిడ్ వంటి పెదవులకు అవసరమైన తేమను అందించే అత్యుత్తమ పదార్థాలు ఉంటాయి. ఇవి పెదాలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. అయితే ఇప్పటికే పెదాలు డ్రైగా ఉన్నవారు మ్యాట్ లిప్‌స్టిక్ వేసుకుంటే ఆ పొడిబారిన తనం మరింత స్పష్టంగా బయటకు కనిపిస్తుంది. అంతేకాకుండా రోజంతా పరిమితికి మించి పదేపదే మ్యాట్ లిప్‌స్టిక్ కోటింగ్స్ వేసుకోవడం వల్ల పెదవులపై ఉండే సహజ చర్మం తేమను కోల్పోయి మరింత పొడిబారే ప్రమాదం ఎంతైనా ఉంది. అందువల్ల నాణ్యత కలిగిన బ్రాండెడ్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం అత్యంత ఉత్తమం. చాలామంది లిప్‌స్టిక్ వాడటం వల్లే తమ పెదాలు నల్లగా మారుతున్నాయని భావిస్తుంటారు, కానీ ఇది పూర్తిగా ఒక అపోహ మాత్రమే. పెదాలు నల్లబడటానికి, డ్రైగా మారడానికి అనేక ఇతర అంతర్గత, బాహ్య కారణాలు ఉంటాయి. శరీరానికి తగినంత నీరు అందకపోవడం, అంటే డీహైడ్రేషన్ వల్ల పెదాలు తేమను కోల్పోతాయి. ప్రతిరోజూ శారీరక అవసరాలకు తగినట్లుగా 100% నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచుకోకపోవడం పెదవులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే తీవ్రమైన ఎండలో సూర్యకాంతిలోని యువి కిరణాల బారిన పడటం, ధూమపానం అలవాటు ఉండటం, వివిధ రకాల అలర్జీలు, విటమిన్ లోపాలు మరియు వాతావరణంలో చల్లని పొడి గాలులు ఉండటం వల్ల పెదాలు త్వరగా నల్లబడతాయి. చాలామందికి పదేపదే నాలుకతో పెదవులను తడపడం ఒక అలవాటుగా ఉంటుంది, ఇది పెదాలను ఇంకా వేగంగా పొడిబారేలా చేస్తుంది. తక్కువ నాణ్యత గల లిప్‌బామ్‌లు, గడువు తీరిన కాస్మెటిక్స్ వాడటం కూడా పెదాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. లిప్‌స్టిక్ లేదా ఇతర లిప్ కేర్ ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎల్లప్పుడూ విటమిన్ E, షియా బటర్, మరియు జోజోబా ఆయిల్ వంటి సహజమైన, తేమను ఇచ్చే పదార్థాలు ఉన్న ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ఆరోగ్యానికి హాని కలిగించే పారాబెన్లు, ఘాటైన కృత్రిమ సువాసనలు ఉన్న ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అలాగే కొనుగోలు చేసేటప్పుడు ప్యాకింగ్‌పై ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌ను తప్పక పరిశీలించాలి. రోజువారీ సంరక్షణలో భాగంగా కనీసం SPF 15 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ ఉన్న లిప్‌బామ్‌లను వాడాలి. రాత్రి పడుకునేముందు తప్పనిసరిగా లిప్‌స్టిక్‌ను శుభ్రంగా తొలగించి, పెట్రోలియం జెల్లీ లేదా లిప్ మాస్క్ అప్లై చేయాలి. వారానికి 1 నుండి 2 సార్లు తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్ చేయడం ద్వారా చనిపోయిన చర్మ కణాలను తొలగించవచ్చు. అలర్జీలు ఉన్నవారు డెర్మటాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే ఉత్పత్తులను వాడటం శ్రేయస్కరం.       How to prevent dry lips lipstick tips, best lip care routine for soft lips.
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనతికాలంలోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు లేదా కఠినమైన ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.  అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఆహార నియమాలు , చిట్కాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ప్రోటీన్ ఫుడ్.. ప్రోటీన్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పనీర్, లేదా చికెన్ వంటి వాటిని చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి , జీవక్రియ రేటును పెంచడానికి తోడ్పడుతుంది. మంచినీరు మ్యాజిక్.. భోజనం చేసే సమయానికి కనీసం అర్ధగంట ముందు ఒక పెద్ద గ్లాసు మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది , భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా నిరోధించవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి , మెటబాలిజం వేగవంతమవుతుంది. దాహం వేసినప్పుడు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడానికి బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం, మజ్జిగ తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైబర్.. రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ , ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా ఫైబర్ నిరోధిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. కనుక ప్రతిరోజూ  తినే భోజనంలో సగం భాగం కూరగాయలు లేదా సలాడ్లు ఉండేలా చూసుకోవడం మంచిది. తినేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి.. ఆహారం తినేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వంటి పనులు మానుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది , కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. తొందరపడి తింటే తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినేసే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్.. ప్యాక్ చేసిన ఆహారాలు, బేకరీ తిళ్లు, వేపుళ్లు, , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో కేలరీలు, ఉప్పు , ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. అలాగే పంచదార , తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చక్కెర కలిపిన స్వీట్లకు బదులుగా ఖర్జూరాలు లేదా తాజా పండ్లను ఎంచుకోవచ్చు. వ్యాయామం ముఖ్యమే.. ఆహార నియమాలతో పాటు రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సాధన చేయాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. దీనికి సహనం, నిలకడ చాలా అవసరం. కఠినమైన డైటింగ్స్ చేసి అనారోగ్యం పాలవడం కంటే, ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవనశైలిలో భాగం చేసుకుంటే సులభంగా , శాశ్వతంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.                        *రూపశ్రీ.
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి. అయితే ప్రతి కిడ్నీ సమస్య తీవ్రమైనదే అని భావించాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సమస్యను గుర్తించి, తగిన వైద్య సలహా తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు, HOD, నెఫ్రాలజీ, NIMS Hospital, Hyderabad, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? కిడ్నీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలు ఉన్నవారు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. కిడ్నీ ఆరోగ్యంపై సరైన అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన సూచనలను తెలుసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు, ఆఫీస్ సిబ్బంది ఒకవైపు అయితే, ప్రతిరోజూ ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ బైక్ ప్రయాణాలు చేసేవారు మరొకవైపు. ఈ రెండు రకాల పనుల వల్ల వెన్నెముకపై చాలా ఒత్తిడి పడి, చిన్న వయస్సులోనే తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో డిస్క్ సమస్యలు, నరాల బలహీనతకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. కూర్చునే పద్ధతిపై దృష్టి పెట్టాలి.. కుర్చీలో కూర్చున్నప్పుడు వీపు కుర్చీకి సరిగ్గా ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. నడుము వెనుక భాగంలో ఖాళీ లేకుండా చిన్న కుషన్ లేదా పిల్లో పెట్టుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ లేదా లాప్‌టాప్ స్క్రీన్  కళ్ళ ఎత్తులోనే ఉండాలి. స్క్రీన్ కిందకు ఉన్నప్పుడు మెడ, వెన్ను భాగం ముందుకు వంగి నొప్పికి కారణమవుతాయి.  ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం రెండు నిమిషాలు అటు ఇటూ నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బైక్ జర్నీలు చేసేవారికి జాగ్రత్తలు.. రైడింగ్ చేసేటప్పుడు వీపును పక్కకు లేదా ముందుకు ఎక్కువగా వంచకుండా నిటారుగా కూర్చోవాలి. బైక్ షాక్ అబ్జార్బర్లను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రోడ్డుపై ఉండే గోతులు, స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చే షాక్స్ నేరుగా వెన్నెముకపై పడతాయి. అందుకే ప్రయాణంలో హెల్మెట్‌తో పాటు నడుముకు సపోర్ట్ ఇచ్చే లుంబార్ బెల్ట్ వాడటం మంచిది. దూర ప్రాంతాలకు బైక్‌పై వెళ్లేవారు మధ్యమధ్యలో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. వెన్నునొప్పికి ప్రధాన కారణం నడుము , పొత్తికడుపు భాగంలోని కండరాలు బలహీనపడటమే. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయడానికి కేటాయించాలి. భుజాలు, నడుము, మెడ భాగాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని భుజంగాసనం, మార్జాలాసనం వంటివి వెన్నెముకను బలంగా, దృఢంగా మారుస్తాయి. ఈ వ్యాయామాలు కండరాలకు రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. నీరు.. శరీరంలో నీటి శాతం తగ్గితే వెన్నెముక డిస్కులు తమ శోషణ శక్తిని కోల్పోయి త్వరగా అరిగిపోతాయి. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, ఆకుకూరలు, గుడ్లు, బాదం , నువ్వులు రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవడం కూడా వెన్నునొప్పి నివారణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర.. రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం లేదా సరిగ్గా లేని మెత్తటి పరుపులపై పడుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి పెరుగుతుంది. మరీ మెత్తగా ఉన్న పరుపుల కంటే వెన్నెముకకు సరైన ఆధారాన్ని ఇచ్చే ఆర్థోపెడిక్ పరుపులను ఉపయోగించడం మంచిది. చిన్న చిట్కా..  పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో చిన్న దిండు పెట్టుకోవడం వల్ల నడుముపై పడే భారం తగ్గుతుంది. ఈ చిన్నపాటి మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా డెస్క్ జాబ్‌లు, బైక్ ప్రయాణాల వల్ల వచ్చే వెన్నునొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉండి, కాళ్ళలోకి పాకుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.                     *రూపశ్రీ.